పెద్దవారిలో నిద్రలేమి సమస్యలకు కారణాలేమిటో తెలుసు, సరైన నిద్రలేనపుడు ఒంట్లో ఎలా ఉంటుందో ఎవరిది వారికి తెలుస్తుంది. కాని ఈ నిద్రలేని సమస్య అనేది పెద్దవారినే, నెలల వయసున్న శిశువులను సైతం ఇబ్బంది పెడుతుందని తెలుసా? పిల్లలలో నిద్ర సమస్యలు 6 నెలల నుండి యుక్తవయస్సు వరకు సంభవించవచ్చు. అయితే పిల్లల్లో నిద్ర సంబంధిత సమస్యలను (Sleeping Disorder) గుర్తించడం కాస్త కష్టమే.
కానీ పిల్లలకు నిద్ర లేకపోవడం వల్ల కోపం, చిరాకు ప్రదర్శిస్తారు. సరిగ్గా తినకపోవడం, కడుపు సంబంధిత సమస్యలు, నీరసం వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. దీనివల్ల పెద్దల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు సరిగ్గా నిద్రపోవడం లేదనటానికి వారిలో కొన్ని లక్షణాలు చూసి గుర్తించవచ్చు. ఆ లక్షణాలు ఎలా ఎలా ఉంటాయి? పిల్లల్లో నిద్రలేమి సమస్యలకు కారణాలేమి, దానిని నివారించడానికి చర్యలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకోండి.
రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయాన్నే నిద్రలేవడం.
రాత్రి సమయంలో పదే పదే మేల్కొలపడం, మళ్లీ నిద్రపోవడంలో ఇబ్బందిగా అనిపించడం.
పగటిపూట 10 నుండి 15 నిమిషాల పాటు అనేక సార్లు కునుకు తీయడం.
ఆడుకోవడానికి బదులు నిశ్శబ్దంగా కూర్చోవడం. ఆహారం తీసుకోవడం తగ్గించడం.
అన్ని వేళలా నీరసంగా అనిపించడం.
చిన్న చిన్న విషయాలకే కోపం, చిరాకు కలిగి ఉండటం
- చాలా మంది పిల్లలకు సాధారణంగా పీడకలల వల్ల నిద్ర పట్టకపోవడం, నిద్ర నుంచి హఠాత్తుగా మేల్కోవడం చేస్తారు. దీనిని నివారించడానికి, మీ పిల్లలు నిద్రపోయే ముందు లేదా రోజంతా మొబైల్, టీవీలో ఏమి చూస్తున్నారనే దానిపై శ్రద్ధ వహించండి. హరర్, హింసా వంటి దృశ్యాలు చూడకుండా అడ్డుకోండి.
- శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ వంటి పానీయాలలో కెఫిన్ చాలా ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. పిల్లలు తెలియకుండా వీటిని తీసుకుంటే నిద్రలేమి సమస్య ఉండవచ్చు. కాబట్టి పిల్లలకు అలాంటివి తాగించకూడదు. కాఫీ, టీలకు బదులు పాలు తాగించటమే మేలు.
- కొన్నిసార్లు చుట్టుపక్కల వాతావరణం, అధిక వేడి లేదా చలి కారణంగా, పిల్లలు నిద్రపోలేకపోవచ్చు. కాబట్టి పిల్లలను నిద్రపుచ్చేటప్పుడు. ఎక్కువ చలి లేదా వేడి లేకుండా వెచ్చగా ఉంచేలా చూడండి. చుట్టూ పూర్తిగా ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోండి. పిల్లవాడు నిద్రిస్తున్న గదిలో ఉష్ణోగ్రత సాధారణంగా ఉండాలి.
- కొన్ని రకాల ఔషధాల అధిక మోతాదుల కారణంగా కూడా పిల్లల్లో నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. అలాంటి సందర్భాలలో మీరు వైద్యులను సంప్రదించి పరిష్కార మార్గం కనుగొనాలి.
సంబంధిత కథనం