Parenting Tips : పిల్లల్లో తరచూ ఎక్కిళ్లు వస్తున్నాయా? అయితే ఇలా ట్రై చేయండి..-parenting tips to reduce hiccups in babies ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Parenting Tips : పిల్లల్లో తరచూ ఎక్కిళ్లు వస్తున్నాయా? అయితే ఇలా ట్రై చేయండి..

Parenting Tips : పిల్లల్లో తరచూ ఎక్కిళ్లు వస్తున్నాయా? అయితే ఇలా ట్రై చేయండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 21, 2022 04:23 PM IST

Parenting Tips : ఎక్కిళ్లు అనేవి చాలా సాధారణమైనవి. అందరికి ఇవి వస్తాయి. పెద్దలు అయితే ఏదొకటి చేసి.. తమ ఎక్కిళ్లను తగ్గించుకుంటారు. మరి చిన్నపిల్లలకు ఎక్కిళ్లు వస్తే.. వాటిని ఎలా తగ్గించాలి. ఎక్కిళ్లు రాకుండా ఎలా ఆపాలి. పిల్లలకు ఎక్కిళ్లు రాకుండా ఎలా ఆపాలో వైద్యులు పలు సూచనలు ఇస్తున్నారు. మీరు కూడా పిల్లల విషయంలో ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటే.. వీటిని ఫాలో అయిపోండి.

<p>ఎక్కిళ్లు</p>
ఎక్కిళ్లు

Parenting Tips : శిశువులకు ఎక్కిళ్లు రావడం చాలా సాధారణమైనవి. అయితే తరచుగా వస్తే మాత్రం కాస్త ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే ఎక్కిళ్లు పిల్లలకు అసౌకర్యాన్ని ఇస్తాయి. కాబట్టి పిల్లల్లో ఈ అసౌకర్యాన్ని తగ్గించాలనుకుంటే.. ఎక్కిళ్లు ఆపడానికి ఇక్కడ కొన్ని పద్ధతులు సూచిస్తున్నారు వైద్యులు. అసలు ఎక్కిళ్లు ఎందుకు వస్తున్నాయో.. లేదా వస్తే ఎలా నిరోధించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లల్లో ఎక్కిళ్లు ఎందుకు వస్తాయంటే..

1. తల్లిపాలు

ఫీడింగ్ (పాలు లేదా ఇతర ఆహారాలు) లేదా ఉష్ణోగ్రతలో తగ్గుదల శిశువునకు చలిని కలిగిస్తాయి. ఇది ఎక్కిళ్లకు దారితీస్తుంది. ఎక్కిళ్లు ఎక్కువగా వస్తే భయపడాల్సిన అవసరం లేదు. కానీ వైద్యుని సంప్రదిస్తే మంచిది.

2. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD)

గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిజార్డర్ (GERD) ఉన్న శిశువులు తరచుగా ఎక్కిళ్లతో ఇబ్బంది పడతారు. రిఫ్లక్స్ కారణంగా శిశువు కడుపు నుంచి ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి వస్తుంది. ఇది ఎక్కిళ్లకు దారి తీస్తుంది. నవజాత శిశువులలో రిఫ్లక్స్ లక్షణాలు దగ్గు, ఉమ్మివేయడం, దురద.

3. అతిగా తినడం

బేబీ ఎక్కిళ్లు ఎక్కువగా తినడం వల్ల కూడా వస్తాయి. లేదంటే స్పీడ్​గా తినడం వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి. అందుకే పిల్లలకు అతిగా ఆహారం ఇవ్వకుండా జాగ్రత్త వహించండి. వారు సొంతంగా తినే వయసులో ఉంటే.. ఎక్కువ తినకుండా జాగ్రత్త తీసుకోండి.

శిశువులలో ఎక్కిళ్లు నిరోధించడానికి ఇవి ఫాలో అవ్వండి..

1. బర్పింగ్​కు సమయం ఇవ్వాలి.

శిశువుకు ఆహారం ఇస్తున్నప్పుడు బర్పింగ్ కోసం విరామం కచ్చితంగా తీసుకోవాలి. దీనివల్ల ఎక్కిళ్లను నివారించవచ్చు. మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంటే.. ఒక రొమ్ము నుంచి మరొక రొమ్ముకు మారినప్పుడు మీ బిడ్డను ఊపడం వల్ల ఎక్కిళ్లు నివారించవచ్చు.

2. అతిగా తినిపించకండి

మీరు బిడ్డకు అతిగా తినిపించకూడదు. బిడ్డను బర్ప్ చేయడానికి ఫీడింగ్ సమయంలో తరచుగా విరామం తీసుకోవాలి. తద్వారా కడుపు వెంటనే నిండదు. అలాగే మీ బిడ్డకు ఆకలి వేయకముందే తినిపించండి. తరచుగా తక్కువ మోతాదులో ఫుడ్ ఇవ్వండి.

3. పరధ్యానంతో వద్దు

శిశువుకు పరధ్యానంతో ఫీడింగ్ ఇవ్వకూడదు. వారికి ఆహారం తినిపించినా, పాలు తాగిపించినా శ్రద్ధ అంతా వారిపైనే ఉండాలి. వీలైనంత ప్రశాంతంగా, సౌకర్యవంతంగా వారికి ఆహారం ఇవ్వండి.

4. పాలు తాగుతున్నప్పుడు దగ్గరే ఉండండి.

పిల్లలకు బాటిల్​లో పాలు తాగిపిస్తుంటే.. అది పూర్తిగా నింపండి. వారు తాగేవరకు దగ్గరే ఉండండి. లేదంటే ఖాళీ బాటిల్​లోని గాలి పిల్లలకు ఎక్కిళ్లు వచ్చేలా చేస్తుంది.

5. ఫీడింగ్ తర్వాత మీ బిడ్డను నిద్రపోనివ్వకండి..

శిశువుకు ఎక్కిళ్లు రాకుండా ఉండాలంటే.. ఫీడింగ్ తర్వాత కొన్ని నిమిషాలు శిశువును పడుకోకుండా చూడండి.

మీ బేబి తరచుగా ఎక్కిళ్లతో బాధపడుతుంటే.. వెంటనే వైద్యుని వద్దుకు తీసుకువెళ్లాలి. సాధారణం కంటే ఎక్కువగా ఉమ్మివేస్తే.. తప్పకుండా వైద్యునికి చెప్పాలి. ఈ పరిస్థితికి వైద్యులు సులభంగా చికిత్స అందిస్తారు కాబట్టి భయపడవద్దు.

Whats_app_banner

సంబంధిత కథనం