Badam Milk Recipe : చలికాలంలో బాదంపాలు తాగితే మంచిదట.. ఇలా చేసేయండి..-badam milk is good for health specially in winter here is the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Badam Milk Recipe : చలికాలంలో బాదంపాలు తాగితే మంచిదట.. ఇలా చేసేయండి..

Badam Milk Recipe : చలికాలంలో బాదంపాలు తాగితే మంచిదట.. ఇలా చేసేయండి..

Badam Milk Recipe : బాదం పాలను పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఇష్టపడతారు. అయితే దీనిని తయారు చేయడం చాలామందికి రాదు. కాబట్టి బయటకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే దీనిని తయారు చేయడం చాలా సింపుల్. కేవలం కొన్ని పదార్థాలతో.. టేస్టీ టేస్టీ బాదం పాలను తయారు చేసుకోవచ్చు అంటున్నారు.

బాదంపాలు

Badam Milk Recipe : బాదం ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. అంతేకాకుండా పాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ రెండిటీ కాంబినేషన్​లో చేసే బాదం పాలు రుచిగా ఉండడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి అంటున్నారు ఆహార నిపుణులు. ముఖ్యంగా చలికాలంలో బాదం పాలు తీసుకుంటే హెల్త్​కి చాలా మంచిదని.. క్రమం తప్పకుండా తీసుకోవడం కొన్ని సమస్యలు దూరం చేసుకోవచ్చు అంటున్నారు. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* పాలు - 1 గ్లాస్

* కుంకుమ పువ్వు - కొంచెం

* బాదం పప్పులు - 10 (క్రష్ చేయండి)

* బెల్లం - రుచికి తగినంత (తురుముకోండి)

తయారీ విధానం

పాలు మరిగించి దానిలో కుంకుమపువ్వు వేయండి. అవి మరుగుతున్న సమయంలో బాదం పప్పులు వేసి.. ఒకటి లేదా రెండు నిమిషాలు ఉడకనివ్వండి. అనంతరం మంట తగ్గించి దానిలో బెల్లం వేసి బాగా కలిపి స్టౌవ్ ఆపేయండి. చల్లారిన తర్వాత ఫ్రిజ్​లో ఉంచి సర్వ్ చేసుకోండి. దానిపై బాదం పలుకులు కూడా చల్లుకోవచ్చు.

సంబంధిత కథనం