Almond Chicken Momos Recipe : ప్రోటీన్ ఫుడ్​ కావాలంటే.. బాదం, చికెన్ మోమోస్​ తినాల్సిందే..-almond chicken momos for protein rich breakfast here is the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Almond Chicken Momos For Protein Rich Breakfast Here Is The Recipe

Almond Chicken Momos Recipe : ప్రోటీన్ ఫుడ్​ కావాలంటే.. బాదం, చికెన్ మోమోస్​ తినాల్సిందే..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 29, 2022 06:40 AM IST

Almond Chicken Momos Recipe : ఉదయాన్నే ప్రోటీన్ ఫుడ్ కావాలనుకునే వారు కచ్చితంగా బాదం, చికెన్ మోమోస్ తీసుకోవచ్చు. పైగా ఇది మీకు ఆరోగ్యప్రయోజనాలతో పాటు.. మంచి టేస్ట్​ని అందిస్తుంది. తయారు చేయడం కూడా సులభం. వీటిని మీ ఉదయం బ్రేక్​ఫాస్ట్​గా తీసుకుంటే.. మీ కడుపు చాలా సేపు నిండుగా ఉంటుంది.

బాదం చికెన్ మోమోస్
బాదం చికెన్ మోమోస్

Almond Chicken Momos Recipe : ఉదయాన్నే చాలా మంది తమ బ్రేక్​ఫాస్ట్​లో ప్రోటీన్ ఉండేలా చూసుకుంటారు. జిమ్​కి వెళ్లేవారు.. ఆరోగ్యానికి ప్రాధన్యతనిచ్చే వారు కచ్చితంగా తమ డైట్​లో ప్రోటీన్​కి చాలా పెద్ద పీట వేస్తారు. మీరు కూడా ఫిట్​నెస్​ ఫ్రీక్​ అయితే.. మీ డైట్​లో బాదం, చికెన్ మోమోస్​లను యాడ్ చేసుకోవచ్చు. ఇవి విభిన్నమైన, రుచికరమైన టేస్ట్​ని ఇవ్వడంతో పాటు.. సులభంగా తయారు చేసుకోగలిగే ఓ వంటకం ఇది. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* చికెన్ - 250 గ్రాములు (బోన్ లెస్)

* వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరగాలి)

* క్యారెట్ - 1 (సన్నగా తరగాలి)

* స్ప్రింగ్ ఆనియన్ - 3 టేబుల్ స్పూన్లు (సన్నగా తరగాలి)

* అల్లం - 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరగాలి)

* సోయా సాస్టర్ - 1 టేబుల్ స్పూన్

* నూనె - డీప్ ఫ్రైకీ తగినంత

* బాదం - 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరగాలి)

తయారీ విధానం

చికెన్ ఓ గిన్నెలో తీసుకుని సన్నగా తరగాలి. దానిలో బాదం తప్పా.. మిగిలిన పదార్థాలన్నీ వేసి సమాన పరిమాణంలో ఉండే బాల్స్‌గా తయారు చేసుకోవాలి. అనంతరం ఈ బాల్స్‌ను సన్నగా తరిగిన బాదంపప్పులో రోల్ చేయాలి. ఇలా సిద్ధం చేసుకున్న వాటిని.. ఒక greased ప్లేట్‌లో జాగ్రత్తగా ఉంచి.. స్టీమర్‌ మీద 15 నిమిషాల పాటు ఉడికించాలి. వేడి సమానంగా ఉంచుతూ.. ఆవిరి మీద ఉడికనివ్వాలి. అనంతరం వీటిని కాస్త ఫ్రై చేసుకుని.. గోల్డెన్ కలర్ వచ్చాక దించేసుకోవాలి. వీటిని మీకు ఇష్టమైన కెచప్​తో లేదా గ్రీన్ చట్నీతో సేవించవచ్చు. మీ ఫుడ్​లో నూనె వద్దు అనుకుంటే.. వీటిని ఉడికించిన వెంటనే ఫ్రై చేయకుండా కూడా హ్యాపీగా తినేయవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం