French Omelette Recipe : మీ బ్రేక్‌ఫాస్ట్‌కి ఫ్రెంచ్ ఆమ్లెట్ పర్ఫెక్ట్.. ఇలా చేసేయండి
French Omelette Recipe : మీ ఉదయాన్ని హ్యపీగా, సింపుల్‌గా, ఈజీగా తయారు చేసుకోగలిగే బ్రేక్‌ఫాస్ట్‌తో స్టార్ట్ చేయాలనుకుంటే.. మీరు ఫ్రెంచ్ ఆమ్లెట్‌ను ట్రై చేయవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
French Omelette Recipe : మీరు ఎన్నో ఆమ్లెట్స్ తిని ఉండొచ్చు కానీ.. వాటిలో ఫ్రెంచ్ ఆమ్లెట్ చాలా ప్రత్యేకం. ఇది చాలా సింపుల్‌గా చేసుకోగలిగే.. హెల్తీ బ్రేక్ ఫాస్ట్. అంతే కాకుండా చాలా రుచికరంగా ఉంటుంది. మీ బీజీ లైఫ్‌లో టేస్టీగా డే ని స్టార్ట్ చేయాలనుకుంటే.. మీరు దీనిని కచ్చింతంగా ట్రై చేయవచ్చు. మరి దీనిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో.. ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* గుడ్లు - 2
* పాలు - 2 టేబుల్ స్పూన్స్
* సాల్ట్ - తగినంత
* పెప్పర్ - తగినంత
* వెన్న - 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
ఓ గిన్నెలో గుడ్లు, పాలు, ఉప్పు, మిరియాలు వేసి బాగా కలపండి. స్టవ్ వెలిగించి.. దానిమీద ఆమ్లెట్ పాన్ పెట్టండి. మీడియం హీట్ మెయింటైన్ చేయండి. పాన్ వేడెక్కిన తర్వాత.. దాని మీద బటర్ వేయండి. పాన్ మొత్తం బటర్ స్ప్రెడ్ చేయండి. బటర్ నురుగు రావడం ఆపేసిన తర్వాత.. దానిపై ఎగ్స్ మిశ్రమాన్ని వేయండి. ఒక్కసారి గుడ్లు సెట్ చేసిన తర్వాత.. పాన్ నుంచి ఆమ్లెట్‌ను వదిలించడానికి.. పాన్‌ను బర్నర్‌పై సున్నితంగా కొట్టండి. స్టవ్‌కి 45-డిగ్రీల కోణంలో పాన్‌ని పట్టుకుని.. ఆమ్లెట్‌ను జాగ్రత్తగా మడవండి. పాన్‌ను పైకి లేపడం లేదా బ్రౌనింగ్‌ను నిరోధించడానికి వేడిని తగ్గించే వరకు కావలసిన స్థాయి వరకు ఉడికించండి. అంతే వేడి వేడి ఫ్రెంచ్ ఆమ్లెట్ రెడీ.
సంబంధిత కథనం