Skipping Breakfast : డైట్ పేరుతో బ్రేక్​ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే జాగ్రత్త..-skipping breakfast is very bad idea these side effects are very dangerous ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Skipping Breakfast : డైట్ పేరుతో బ్రేక్​ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే జాగ్రత్త..

Skipping Breakfast : డైట్ పేరుతో బ్రేక్​ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే జాగ్రత్త..

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 14, 2022 07:40 AM IST

Skipping Breakfast : కొందరు డైట్ పేరుతో ఉదయం బ్రేక్​ఫాస్ట్ తీసుకోవడం మానేస్తారు. కానీ బ్రేక్​ఫాస్ట్ తీసుకోవడం మానేస్తే.. మీరు అనారోగ్యాలని కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు పోషకాహార నిపుణులు. అల్పాహారమనేది చాలా ముఖ్యమని.. కచ్చితంగా దీనిని తీసుకోవాల్సిందేనని.. లేకంటే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరించారు.

<p>బ్రేక్​ఫాస్ట్​ని బ్రేక్ చేయకండి..&nbsp;</p>
బ్రేక్​ఫాస్ట్​ని బ్రేక్ చేయకండి..

Skipping Breakfast : అల్పాహారాన్ని ఒక కీలకమైన భోజనంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది మీకు రోజంతా అవసరమైన శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే.. ఇది మీ జీవక్రియను వేగవంతం చేస్తుంది. కాబట్టి.. ఇది రోజులో ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. బ్రేక్​ఫాస్ట్ చేయడం వల్ల బరువు పెరగరు. తగ్గుతారని అర్థం చేసుకోవాలి.

ఆహారం తీసుకోకుండా ఎక్కువసేపు ఉన్నప్పుడు చిరాకు వస్తుందని డాక్టర్ దివేకర్ తెలిపారు. దీనివల్ల చిరాకు, మలబద్ధకం, జుట్టు రాలడం మాత్రమే కాకుండా అనేక ఇతర లక్షణాలు కూడా అనుభవించాల్సి వస్తుందని అంటున్నారు. అందుకే ఇంటర్మిటెంట్ డైట్ చేసే అమ్మాయిల్లో కూడా పీరియడ్స్ సమస్యలు అనుభవిస్తారు. పైగా మీ మానసిక, శారీరక ఆరోగ్యంపై ఈ ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు.

భోజనం మధ్య ఎక్కువసేపు ఖాళీ ఉంటే.. తలనొప్పి, మైగ్రేన్లు, ఆందోళన వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకో విషయం తెలుసా? మీరు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం చేసినా.. ఇంటర్మిటెంట్ డైట్ చేస్తున్నవారితో సమానం బరువు కోల్పోతారు. ఈ విషయం తెలియక చాలా మంది ఇంటర్మింటెంట్ వైపే మొగ్గు చూపుతారు.

అల్పాహారం మానేయడం వల్ల శరీరంలోని సూక్ష్మపోషకాల స్థాయిలపై ప్రభావం చూపుతుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. భోజనాల మధ్య ఎక్కువ విరామం ఉంటే.. మీరు కాల్షియం, హిమోగ్లోబిన్‌ లోపానికి గురవుతారని తెలిపారు. ఒకవేళ మీరు డైట్​ అనుసరిస్తే.. కచ్చితంగా సప్లిమెంట్లను తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే క్రమరహిత పీరియడ్స్, ఆందోళన, తలనొప్పులు, ఉబ్బరం, యాసిడ్ రిఫ్లక్స్, ఆహార కోరికలు, నెమ్మదిగా బరువు తగ్గడంతో పాటు చాలా ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వెల్లడించారు. అంతేకాకుండా కండరాల పెరుగుదలకు ప్రోటీన్‌ను గ్రహించే సామర్థ్యాన్ని శరీరం తగ్గిస్తుందని.. దీని ఫలితంగా సూక్ష్మపోషకాల లోపాలు, విటమిన్ D, B12, హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువైపోతాయని.. డాక్టర్ దివేకర్ తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం