జుట్టు రాలడం, బరువు పెరగడం ఈ సమస్యకు సంకేతమా?-types of disorders due to imbalance in thyroid hormones risk factors symptoms ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  జుట్టు రాలడం, బరువు పెరగడం ఈ సమస్యకు సంకేతమా?

జుట్టు రాలడం, బరువు పెరగడం ఈ సమస్యకు సంకేతమా?

HT Telugu Desk HT Telugu
Jun 27, 2022 07:11 PM IST

థైరాయిడ్ అనేది మెడ భాగంలో సీతాకోకచిలుక అకారంలో ఉండే గ్రంధి. ఇది శరీరంలోని జీవక్రియలను నియంత్రిస్తుంది. కొన్ని అసాధరణ పరిస్థితుల్లో ఈ గ్రంధి నుండి విడుదలయే హార్మోన్ల రుగ్మత కారణంగా జుట్టు రాలడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఏర్పడుతాయి.

Thyroid
Thyroid

థైరాయిడ్ లక్షణాలు- కొంత మందిలో అకస్మాకంగా బరువు పెరగడం, జుట్టు రాలడం వంటి సమస్యలు కనిపిస్తాయి. వాటితో పాటు అలసట, అధిక నిద్ర, నెలసరిలో మార్పులు వంటి వాటిని కూడా చూడవచ్చు. థైరాయిండ్ వుంటే ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధరణంగా థైరాయిడ్ గ్రంథి మెడ భాగంలో ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఈ గ్రంథి థైరాయిడ్ హార్మోన్‌ను అధికంగా లేదా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఈ సమయంలో జుట్టు రాలడం, బరువు పెరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి. అయితే ఇలాంటి సందర్బాలలో ఈ హార్మోన్‌ను బ్యాలెన్స్ చేయడం ముఖ్యం. దానికి ముందుగా సమస్యను గుర్తించడం చాలా ముఖ్యం. మరీ థైరాయిడ్ సమస్యను ఎలా గుర్తించాలి. ఎలాంటి లక్షణాలు ఉంటే థైరాయిడ్ సమస్యగా భావించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు జుట్టుకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి

జుట్టు పల్చబడటం

జుట్టు మరింత పొడిగా మారడం

జుట్టు ఎక్కువగా రాలడం

థైరాయిడ్ వల్ల జుట్టు ఎందుకు రాలుతుంది?

సాధరణంగా థైరాయిడ్ గ్రంధిలో ఏమైన లోపాలు ఉంటే జుట్టు రాలిపోతుంది. థైరాయిడ్ గ్రంధి నుంచి విడుదలయ్యే టి3, టి4 హార్మోన్లు జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి. ఈ రెండూ జుట్టు పిగ్మెంటేషన్‌ను నియంత్రిస్తుంటాయి. ఈ రెండూ ఎక్కువ లేదా తక్కువ ఉంటే, జుట్టు ఎక్కువగా రాలడం ప్రారంభమవుతుంది.

బరువు పెరగడం

ఆకస్మికంగా బరువు పెరగడం హైపో థైరాయిడిజంలో ప్రధాన లక్షణం. ఈ సమయంలో ఆందోళన, అతి నిద్ర, దృష్టిలో ఇబ్బంది, హృదయ స్పందనలో మార్పు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా హైపోథైరాయిడిజం సమయంలో, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

చికిత్స విధానం

పై లక్షణాలు కనిపిస్తే థైరాయిడ్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. థైరాయిడ్ గ్రంథిని స్థితిని తెలుసుకోవాలి. థైరాయిడ్ ఉంటే రోజూ డాక్టర్ సూచించిన మందులను తీసుకోవాలి. దీంతో థైరాయిడ్‌ను సమతౌల్యంగా ఉంచుకోవచ్చు. దీనితో పాటు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా, థైరాయిడ్ లక్షణాలను చాలా వరకు తగ్గించవచ్చు. సమస్య ఉంటే వీలైనంత త్వరగా దాని చికిత్సను ప్రారంభించడం చాలా ముఖ్యం.

WhatsApp channel

సంబంధిత కథనం