Avocado Toast Recipe : మీరు ఆరోగ్యకరమైన టోస్ట్‌ను.. పవర్ ప్యాక్డ్ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలంటే.. అవకాడో టోస్ట్ మీకు మంచి ఆప్షన్. దీనిని అవకాడో, గుడ్లను ఉపయోగించి తయారు చేస్తాము. ఇది రుచిని ఇవ్వడమే కాకుండా.. మీ ఆరోగ్యానికి కూడా మంచిది. ఉదయాన్నే హెల్తీగా తినాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. ఇప్పుడు దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* బ్రెడ్ - 2
* వెల్లుల్లి - 1
* ఆలివ్ నూనె - 1 టేబుల్ స్పూన్
* వెన్న - 1 టేబుల్ స్పూన్
* అవకాడో - 1 (సన్నగా తరగాలి)
* గుడ్లు - 2
* ఉప్పు - రుచికి తగినంత
* పెప్పర్ - రుచికి తగినంత
* చీజ్ - 1 టీస్పూన్ (తురుముకోవాలి)
ముందుగా వెల్లుల్లి పైన లేయర్ తీసి.. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వీటిలో ఆలివ్ నూనె, ఉప్పు, పెప్పర్, వేసి బాగా కలిపి.. బ్రెడ్ మీద రాసి.. దానిని ముందుగా వేడిచేసిన ఓవెన్ (180 సి)లో 10 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు పాన్ తీసుకుని.. వెన్న వేయాలి. దానిలో గుడ్డు పగులగొట్టి.. దిగువ క్రిస్పీగా అయ్యేలా వేయించాలి. ఇప్పుడు బ్రెడ్‌పై అవకాడో ముక్కలు వేసి.. రుచికి ఉప్పు, మిరియాలు పొడి వేసి.. చీజ్ వేయాలి. ఇప్పుడు క్రిస్పిగా తయారు చేసిన ఆమ్లెట్ వేయాలి. అంతే అవకాడో టోస్ట్ రెడీ.
అయితే అవకాడోను ముక్కలు చేయడానికి బదులుగా.. అవకాడోను మెత్తగా చేసి ఉల్లిపాయలు, టొమాటో, కొత్తిమీర, నిమ్మరసంలో కలపవచ్చు. ఆ తర్వాత ఇదే రెసిపీని ఫాలో అయిపోవచ్చు.
సంబంధిత కథనం