రోటిన్ బ్రేక్‌ఫాస్ట్‌తో బోర్ కొట్టిందా.. అయితే ఈ టేస్టీ అవలక్కీని ట్రై చేయండి!
Breakfast recipes: మార్నింగ్ సమయంలో అల్పాహారం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. బ్రేక్‌పాస్ట్ మానేయడం ఆరోగ్యానికి చాలా హానికరమని అంటున్నారు.అయితే బ్రేక్‌పాస్ట్ ఇన్‌స్టాంట్‌గా తొందరగా తయారుచేసుకోవడానికి చాలా రెసిపీలు అందుబాటులో ఉన్నప్పటి పాలతో అవలక్కీ చాలా స్పెషల్ అని చెప్పాలి.
రోజంతా చురుకుగా, అలసట లేకుండా ఉండాలంటే ఉదయం పూట అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే చాలా మంది బ్రేక్‌పాస్ట్ స్కిప్ చేస్తుంటారు. ఒక్కవేళ తీసుకున్న అది ఆరోగ్యంగా, సంతృప్తికరంగా ఉండదు. ఆఫీస్‌కు లేదా బయటకు వెళ్ళాలనే తొందరలో బ్రేక్‌పాస్ట్ విషయంలో అంతగా ఆసక్తిగా ఉండరు. అయితే మార్నింగ్ సమయంలో అల్పాహారం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. బ్రేక్‌పాస్ట్ మానేయడం ఆరోగ్యానికి చాలా హానికరమని అంటున్నారు. ఇది రోజు వారీ దినచర్యను ప్రభావితం చేస్తుంది. అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన డైట్ అని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన అల్పాహారం శక్తి స్థాయిలను పెంచుతుంది. ఏకాగ్రత పెంచుతుంది. ఇది బరువు నిర్వహణలో సహాయపడుతుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన అల్పాహారం ఆకలిని అదుపులో ఉంచుతుంది. అలాగే అల్పాహారం తినకపోతే రోజంతా తిన్నా తృప్తి కలగదు.కాబట్టి మీరు ఉదయం అల్పాహారం తీసుకోవడం మానొద్దు.
అయితే బ్రేక్‌పాస్ట్ ఇన్‌స్టాంట్‌గా తొందరగా తయారుచేసుకోవడానికి చాలా రెసిపీలు అందుబాటులో ఉన్నప్పటి పాలతో అవలక్కీ చాలా స్పెషల్ అని చెప్పాలి. మరీ ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన రెసిపీ తయారు చేయాలో చూద్దాం.
పాలు అవలక్కీ రెసిపీ (milk poha recipe) కోసం కావలసినవి
పాలు
అవలక్కి
బెల్లం
బాదం
జీడిపప్పు
యాలకులు
పాల అవలక్కీ తయారీ విధానం
అవలక్కీని నీళ్లలో వేసి 2 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత దానిని ఫిల్టర్ చేసి, అవశేషాలను తొలగించండి. ఇప్పుడు మీడియం మంటలో పాలను వేడి చేసి అందులో యాలకులు వేయాలి. కొద్దిసేపు మరిగించాలి. తర్వాత దానిలో అవలక్కీ వేయాలి. అనంతరం బాగా కలపాలి. పాలలో కాస్త బెల్లం వేసి, అన్ని పదార్థాలను బాగా కలపాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. జీడిపప్పు, బాదం పప్పులను చిన్న ముక్కలుగా చేసి అందులో వేయాలి. అలాగే ఎండుద్రాక్ష వేసి కలపడం మరింత రుచి వస్తుంది. ఇప్పుడు టెస్టీ అవలక్కీ రెడీ. ఇది మంచి టెస్టీతో పాటు ఆరోగ్యం కూడా..
సంబంధిత కథనం