Proteins Rich Foods : మీరు శాఖాహారులైతే.. ప్రోటీన్‌ను వీటినుంచి పొందవచ్చు.. బరువు తగ్గొచ్చు..
- Proteins Rich Foods : ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో ప్రోటీన్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి. బరువు తగ్గడానికి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఇవి చాలా అవసరం. నాన్ వెజ్ తినేవారికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మరి శాఖాహారుల కోసం ఏమి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
- Proteins Rich Foods : ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో ప్రోటీన్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి. బరువు తగ్గడానికి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఇవి చాలా అవసరం. నాన్ వెజ్ తినేవారికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మరి శాఖాహారుల కోసం ఏమి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
(1 / 6)
ఇతర పోషకాల మాదిరిగానే.. మన ఆరోగ్యానికి ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. ఇది కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. మాంసం తినే వ్యక్తులకు ప్రోటీన్ పొందడానికి అనేక మార్గాలు ఉంటాయి. అయితే శాఖాహారులకు అన్నీ ఆప్షన్స్ ఉండవు అంటారు. కానీ అలా కాకుండా.. శాఖాహారులకు కూడా అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. శాఖాహారులు వారి ఆహారంలో అనేక ఆరోగ్యకరమైన ప్రోటీన్ ఎంపికలను చేర్చుకోవచ్చు.(Freepik)
(2 / 6)
శాఖాహార ఆహారాన్ని తీసుకునే వారు ఆహారంలో సోయా పాలను చేర్చుకోవచ్చు. ఇది ప్రోటీన్‌కు అద్భుతమైన మూలం. ఈ పాలను తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు.(Freepik)
(3 / 6)
టోఫు.. పనీర్‌ను పోలి ఉంటుంది. కానీ పాలకు బదులుగా సోయా పాలతో తయారు చేస్తారు. ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైనది కూడా. ఇది తక్కువ కొవ్వు, తక్కువ కార్బ్ ప్రోటీన్‌కు ప్రత్యామ్నాయం.(Freepik)
(4 / 6)
మిల్ మేకర్ వివిధ ఆహారాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.(Pixabay)
(5 / 6)
చిక్కుడు గింజలను ఉడికించి తింటారు. వాటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మిమ్మల్ని ఆరోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి.(Pixabay )
ఇతర గ్యాలరీలు