Protein Diet : ప్రోటీన్​ ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే మీకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువట..-eating too much protein can increase the risk of cancer here is the details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Eating Too Much Protein Can Increase The Risk Of Cancer Here Is The Details

Protein Diet : ప్రోటీన్​ ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే మీకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువట..

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 13, 2022 02:40 PM IST

High Protein Side Effects : ఏదైనా అతిగా తీసుకుంటే మంచిది కాదు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. గాయాన్ని నయం చేసే మందు అయినా.. అతిగా తీసుకుంటే అది అనర్థమే అవుతుంది. ప్రోటీన్ కూడా అంతే. ఇది మనం తీసుకునే ఆహారంలో చాలా ముఖ్యమైన భాగం. కానీ దీనిని ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది అంటున్నారు నిపుణులు.

ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త
ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త

High Protein Side Effects : ఆరోగ్యకరమైన ఆహారంలో ప్రోటీన్ అనేది ముఖ్యమైన భాగం. ఇది కండరాలను నిర్మించడానికి, మరమ్మత్తు చేయడంలో బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. కడుపు నిండిన ఫీల్ ఇచ్చి.. కొవ్వును తగ్గిస్తుంది. అయినప్పటికీ దీనిని తగిన మోతాదుకన్నా ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. రోజువారీ కంటే.. అధిక ప్రోటీన్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్‌తో సహా అనేక అనారోగ్యాల బారిన పడే ప్రమాదముంది.

మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారాలు.. ముఖ్యంగా రెడ్ మీట్ ఆధారిత ప్రొటీన్‌లు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇతర మూలాల నుంచి ప్రోటీన్ తీసుకోవడం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మాంసాహారంలో ఉండే కొవ్వు పదార్థాలు, క్యాన్సర్ కారకాల వల్ల ఇలా జరుగుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. అధ్యయనాల ప్రకారం.. మీ ఆహారంలో అదనపు ప్రోటీన్.. క్యాన్సర్‌తో చనిపోయే ప్రమాదాన్ని 4 శాతం పెంచుతున్నట్లు గుర్తించారు. ఇదొక్కటే కాదు.. మాంసాహార ప్రియులు మధుమేహంతో చనిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

మీరు ప్రొటీన్‌ను ఒక మోస్తరుగా తీసుకున్నప్పటికీ.. ప్రొటీన్ నుంచి పది శాతం కంటే తక్కువ కేలరీలు పొందే వారి కంటే మీరు క్యాన్సర్‌తో చనిపోయే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉండవచ్చు. ఈ అధ్యయనంలో యాభై ఏళ్లు పైబడిన 6,138 మంది పాల్గొన్నారు. సెల్ మెటబాలిజంలో ఈ అధ్యయనం గురించి ప్రచురించారు.

ప్రోటీన్ ఎంత తీసుకుంటే ఎక్కువ

సగటున ఒక కిలోగ్రాము శరీర బరువుకు.. 0.8 గ్రాముల ప్రోటీన్ తినాలని అనేక అధ్యయనాలు, ఆరోగ్య సంస్థలు చెప్తున్నాయి. ఉదాహరణకు మీ బరువు 50 కిలోలు ఉంటే.. మీరు ప్రతిరోజూ 40 గ్రాముల కంటే ఎక్కువ ప్రోటీన్ తినకూడదు.

ప్రోటీన్ ఆహారం

* అధిక ప్రోటీన్ ఆహారం : మీరు మీ క్యాలరీలలో 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ ప్రోటీన్ నుంచి పొందినప్పుడు అది అధిక ప్రోటీన్ ఆహారం అవుతుంది. మొక్కల ఆధారిత, జంతు ఆధారిత రెండింటిలోనూ ఇది ఉండొచ్చు.

* మితమైన ప్రోటీన్ ఆహారం : మీరు ప్రోటీన్ నుంచి మీ కేలరీలలో 10 నుంచి 15 శాతం పొందినప్పుడు. అది మితమైన ప్రోటీన్ ఆహారం.

* తక్కువ ప్రోటీన్ ఆహారం : మీరు ప్రోటీన్ నుంచి మీ కేలరీలలో 10 శాతం లేదా అంతకంటే తక్కువ పొందినప్పుడు దానిని తక్కువ ప్రోటీన్ ఆహారం అంటారు.

మరి ప్రోటీన్ ఎలా తీసుకోవాలి

మీ ప్రోటీన్ తీసుకోవడం తగ్గించండి. ముఖ్యంగా మాంసం, పాల ఉత్పత్తులు, చీజ్ నుంచి ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది కాబట్టి. వాటిని కాస్త తగ్గించడంలో తప్పులేదు. మొత్తానికి మానేస్తే.. మీరు చాలా త్వరగా పోషకాహారలోపానికి గురవుతారు కాబట్టి. అతిగా తీసుకోకండి. మితం మంచిదే అని గుర్తు పెట్టుకోండి.

తక్కువ స్థాయిలో ప్రోటీన్ తీసుకోవడం వల్ల ముందస్తు మరణాల సంభావ్యతను 21 శాతం తగ్గిస్తుంది. కానీ మీకు 65 ఏళ్లు వచ్చిన తర్వాత.. మీరు మీ ప్రోటీన్ తీసుకోవడాన్ని మితం చేయవచ్చు. ఎందుకంటే ప్రోటీన్ బలహీనత.. కండరాల నష్టం నుంచి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్