Almond Milk benefits : బాదం పాలతో మెరిసే, మచ్చలు లేని చర్మాన్ని పొందవచ్చట..
Almond Milk benefits : ఆరోగ్యానికి బాదం పాలు మంచివే. అయితే అవి చర్మానికి కూడా చాలా మంచివని మీకు తెలుసా? బాదంపాలను ముఖంపై అప్లై చేస్తే.. పొడిబారడం, ఇన్ఫెక్షన్లు, టానింగ్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా అనేకు ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Almond Milk benefits : బాదం పాలను చర్మంపై ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు. ఎందుకంటే ఇవి చాలా సుసంపన్నమైనవి. ఎక్కువ తేమను కలిగి ఉంటాయి. ఇది చర్మం మృదువుగా, మెరిసేలా చేస్తుంది. ముఖంపై మచ్చలు, నల్ల మచ్చలు ఉన్నవారు తప్పనిసరిగా బాదం పాలను ఉపయోగించాలి. ఎందుకంటే ఇది చర్మం కాంతివంతం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. బాదం పాలను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ముఖ్యంగా పొడి చర్మ సమస్యలు ఉన్నవారికి ఇది బాగా ప్రయోజనకరంగా ఉంటుంది.
పొడి చర్మానింతో బాధపడేవారు..
పొడి చర్మం ఉన్న వ్యక్తులు తరచుగా పొరలుగా, దురద వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది కాలక్రమేణా అనేక చర్మ సమస్యలకు దారితీస్తుంది. బాదం పాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది చర్మాన్ని రిపేర్ చేయడానికి, పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఈ పోషకమైన మొక్కల ఆధారిత పాలను ముఖంపై ఉపయోగించడం వల్ల పొడి, దురద, ఎరుపు, ఇతర చర్మ వ్యాధులకు చికిత్స చేయవచ్చు.
బాదం నూనెతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. వారానికి రెండుసార్లు దీనిని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయంగా.. మీరు బాదం పాలను నేరుగా ముఖంపై మాయిశ్చరైజర్‌గా కూడా రాసుకోవచ్చు.
ముడతలు తగ్గించుకోవడానికి
వృద్ధాప్య మహిళలు ముఖానికి బాదం నూనెను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ముడతలు.. ముఖంపై ఉన్న గీతలు, మచ్చలు వంటి వాటిని తగ్గిస్తాయి. మీరు మీ 30 ఏళ్లలో బాదం పాలను, బాదం నూనెను ఉపయోగించడం ప్రారంభిస్తే.. మీ వృద్ధాప్య రేఖలు తగ్గించవచ్చు.
ప్రతిరోజూ తాజా బాదం పాలతో మీ ముఖాన్ని మసాజ్ చేయండి. రాత్రి బాదం నూనె లేదా బాదం పాలతో మసాజ్ చేస్తే.. అది మీ చర్మానికి పునరుజ్జీవనాన్ని ఇస్తుంది.
డార్క్ సర్కిల్స్‌ని తొలగిస్తుంది
బాదం పాలను ముఖానికి పట్టించడం వల్ల కూడా నల్లటి వలయాలు తగ్గుతాయి. నిద్ర లేకపోవడం, ఒత్తిడి, పోషకాహారం సరిగా లేకపోవడం వల్ల మీ అందాన్ని ప్రభావితం చేసే కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఈ నల్లటి వలయాలకు బాదం పాలు సహజ నివారణిగా పనిచేస్తాయి. కొంచెం బాదం మిల్క్‌ను కాటన్ ప్యాడ్‌పై ఉంచి.. కళ్ల కింద మెత్తగా రుద్దండి. మెరుగైన ఫలితాల కోసం.. ప్యాడ్‌ను 10-15 నిమిషాలు ఉంచండి.
సహజ కాంతి కోసం..
సహజమైన, యవ్వన ప్రకాశాన్ని పునరుద్ధరించలేమని ఎవరు చెప్పారు? మీరు సరైన వయస్సులో సరైన పదార్థాలను ఉపయోగించడం ప్రారంభిస్తే, మీరు మీ మెరుపును కాపాడుకోవచ్చు. బాదం పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి గ్రేట్‌గా సహాయపడుతుంది.
టాన్ తగ్గించడంలో..
బాదం పాలు కేవలం ముఖానికే కాదు.. చేతులతో సహా చర్మంపై టానింగ్‌ను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. మీ చర్మం సూర్యరశ్మికి అతిగా ఎక్స్పోజ్ అయినప్పుడు.. UV కిరణాల కారణంగా అది టాన్ అయ్యే అవకాశం ఉంది. ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే బాదం పాలను ప్రభావిత ప్రాంతంపై రాస్తే.. మీరు టానింగ్‌ను తగ్గించవచ్చు. ఇది మీ చర్మాన్ని నయం చేసి.. సహజమైన మెరుపును అందిస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్