Sleep Better : నిద్రపోయేందుకు ఈ మెడిటేషన్ టెక్నిక్స్ ట్రై చేయండి
Sleep Better : ధ్యానం మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఒత్తిడిని తొలగిస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ధ్యానం మెలటోనిన్, సెరోటోనిన్‌లను పెంచుతుంది. రక్తపోటు, హృదయ స్పందనను తగ్గిస్తుంది.
ఒత్తిడితో కూడిన జీవితం, పనిభారం, కంప్యూటర్ల ముందు కూర్చొవడం, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల వాడకం కారణంగా రాత్రిపూట నిద్ర సంబంధిత సమస్యలు(Sleeping Problems) సాధారణ విషయంగా మారాయి. నిద్ర రుగ్మత, మందుల ద్వారా కూడా పూర్తిగా నయం కాదు. ఒకవేళ తగ్గినా.. మళ్లీ మెడిసిన్ ఆపేస్తే.. సమస్య మరింత తీవ్రమవుతుంది. ఈ మందులు అనేక దుష్ప్రభావాలను కూడా కలిగి ఉంటాయి. ఇది మీకు తర్వాత మరిన్ని సమస్యలను సృష్టించవచ్చు.
ధ్యానం(Meditation) మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఒత్తిడి(Stress)ని తొలగించడం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మెలటోనిన్, మరియు సెరోటోనిన్‌లను పెంచుతుంది. రక్తపోటు, హృదయ స్పందనను తగ్గిస్తుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే.. మీరు హాయిగా నిద్రపోవచ్చు.
Healthline.com ప్రకారం, ముందుగా మీ గదిలో ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను తీసివేయాలి. ఆపై హాయిగా పడుకోండి. 10 సార్లు శ్వాస తీసుకుని వదిలివేయండి. ఇలా కనీసం 5 సార్లు చేయండి. మీ దృష్టిని మీ శ్వాసపై కేంద్రీకరించండి. ఈ సమయంలో మీ మనసులో ఏదైనా ఆలోచన వస్తే, మీ శ్వాసపై పూర్తి దృష్టి పెట్టండి.
బాడీ స్కాన్ మెడిటేషన్ పేరుతో మన శరీరంలోని ప్రతి భాగంపై దృష్టి కేంద్రీకరించాలి. అన్నింటిలో మొదటిది, పడుకుని, కళ్ళు మూసుకుని, నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఆపై మీ శరీరం(Body)లోని భాగాలపై ఫోకస్ పెట్టండి. మీ దృష్టి మరెక్కడికైనా వెళితే, మీ దృష్టిని మీ శరీరంపై కేంద్రీకరించండి. మనస్సును ఎక్కడకు పయనించకుండా చూసుకోవాలి.
గైడెడ్ మెడిటేషన్‌తోనూ హాయిగా నిద్రపోవచ్చు. ముందుగా సాఫ్ట్ మ్యూజిక్ ఎంచుకుని మొబైల్ ఫోన్లో పెట్టుకుని పడుకోండి. లోతైన శ్వాస తీసుకోండి. ఆ సంగీతంపై దృష్టి పెట్టండి. మీ మనసు ఎటైనా ఆలోచిస్తే.. మ్యూజిక్ మీద ఫోకస్ చేయండి.
త్వరగా పడుకోవాలి. లేదంటే చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. మనం త్వరగా పడుకున్నప్పుడు, మన శరీరానికి విశ్రాంతి, మళ్లీ తిరిగి శక్తి పొందడానికి తగినంత సమయం లభిస్తుంది. ఇది మెరుగైన మానసిక స్థితి, పెరిగిన ఉత్పాదకత సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఉంటాయి. తగినంత నిద్ర పొందడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు(Heart Disease), ఊబకాయం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులకు దూరం ఉండొచ్చు.
త్వరగా పడుకోవడం వల్ల మన శరీరంలోని హార్మోన్లు, ముఖ్యంగా ఒత్తిడి(Stress)కి సంబంధించిన హార్మోన్లను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. మన ఒత్తిడి ప్రతిస్పందనకు కారణమయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ సహజంగా రాత్రి ప్రారంభ గంటలలో తక్కువగా ఉంటుంది. త్వరగా పడుకోవడం కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మన మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.