Guppedantha Manasu Today Episode: తమ ప్రేమను అర్థం చేసుకున్న రిషి-వసు.. ఎపిసోడ్ అంతా ఫుల్ ఎమోషనల్
Guppedantha Manasu Today Episode: గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్‌లో రిషి-వసుధారలు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. దీంతో రిషి.. వసుకు ఓటేయగా.. వసు రిషికి ఓటేస్తుంది. దీంతో ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవించుకోవడంతో వీరు మరింత దగ్గరవుతారు.
Guppedantha Manasu Today Episode: గుప్పెడంత మనసు నిన్నటి ఎపిసోడ్‌లో జయచంద్ర.. పెళ్లి గురించి కాలేజ్ విద్యార్థులకు అనర్గళంగా ఉపన్యాసం ఇస్తారు. ఆ తర్వాత వసు, రిషీలు ఇద్దరూ విభిన్న అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు. తొమ్మిదో రకం పెళ్లి ఉందని, అది ఆపత్కాల వివాహమని వసు చెప్పగా.. మరోపక్క రిషి అసలు అలాంటి పెళ్లిలో నిజముందా అంటూ ప్రశ్నిస్తారు. వీరిద్దరి వాదనల్లో ఎవరిది కరెక్టో నిర్ణయించేందుకు జయచంద్ర ఓటింగ్ నిర్వహిస్తారు. ఎవరి వాదన కరెక్ట్ అనిపిస్తే వాళ్ల పేరు మొదట అక్షరాన్ని పేపర్‌పై రాసి బౌల్‌లో వేయమని చెబుతారు. రిషికి ఓటు వేయాలనుకున్న వాళ్లు ఆర్ అని, వసుధారకు ఓటు వేయాలనుకునేవాళ్లు వీ అని రాయాలని జయచంద్ర స్పష్టం చేస్తారు.
ఒకరికొకరు ఓటు వేసుకున్న రిషి-వసు..
రిషి సార్ బాధపడటానికి కారణం నేనే కదా.. ఆయన స్థానంలో ఎవరున్నా అలాగే మాట్లాడతారు కదా అని వసు ఆలోచిస్తుంది. నేను మెడలో తాళి వేసుకోవడం నిజమే కానీ.. పెళ్లి అంటే రిషి సార్ చెప్పిందే కరెక్ట్ అని వసు తన ఓటును రిషి సార్‌కు వేస్తు ఆర్ అని రాస్తుంది. మరోపక్క రిషి కూడా వసు గురించి ఆలోచించి వసుధార చేసిందాంట్లో తప్పేమి లేదు కదా? ఆ సమయంలో వసు అలా చేయకపోతే తను నాకు దక్కేది కాదు కదా? అని వసుకు ఓటేస్తు వీ అని రాస్తాడు. అంతా ఓట్లు వేసిన తర్వాత రిషి, వసు బౌల్స్‌లో ఓటేయబోతుంటే.. జయచంద్ర అడ్డుకుంటాడు. ఓటింగ్ వేయబోయేది మీరే కాబట్టి మీ ఓట్లు నాకివ్వండి అంటూ వారి నుంచి తీసుకున చూడకుండానే జేబులో పెట్టుకుంటాడు.
మిగిలిన ఓట్లన్నీ లెక్కించడంతో ఇద్దరికి సమాన ఓట్లు వస్తాయి. ఇంకా ఓటింగ్ పూర్తి కాలేదు.. రిషి, వసు అభిప్రాయాలు లెక్కలోకి తీసుకోవాలి కదా.. అంటూ జేబులో పేపర్లను బయటకు తీస్తాడు. నా కుడి చేతిలోనిది వసుధార ఓటు.. ఆమె ఆర్ అని రాసింది, ఇంకో చేతిలోనిది రిషిది.. అతడు వీ అని రాశాడు అని చెబుతాడు. దీంతో అక్కడున్న వసు, రిషితో పాటు జగతీ, మహేంద్ర షాక్ అవుతారు. జయచంద్ర వారి మధ్య ఉన్న సమస్యను వివరించి చెబుతారు.
ఎదుటి వారి అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నారు..
"వీళ్లిద్దరూ సమర్థించే వారు, విమర్శించే వారు సరిసమానం అవ్వడం ఆశ్చర్యమైతే.. వీరిద్దరూ ఒకరికొకరు ఓటేసుకోవడం ఇంకా ఆశ్చర్యకరమైన విషయం. ఇందాక వీళ్లిద్దరూ తమ అభిప్రాయాలపై బలంగా నిలబడి వాదనలు వినిపించారు. కారణాలు చెప్పారు. కానీ ఇప్పుడు వీళ్లు అనుకున్నట్లు కాకుండా.. వేరే వాళ్లకు ఓటేశారు. ఇద్దరికి ఒకరి అభిప్రాయాల మీదు ఒకరికి అమితమైన గౌరవం ఉంది. కానీ నేను చెప్పిందే కరెక్ట్ అనే చిన్నపాటి భేదాభిప్రాయం కారణంగా ఎదుటి వారిని అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు ఎదుటివారి అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నారు. వాళ్లు చేసింది కరెక్ట్ అని అర్థం చేసుకున్నారు. దట్స్ ఇట్. నేను చెప్పేది కూడా అదే. జీవితంలో ఆవేశంతో, అనాలోచితంతో ఏ పని చేయకూడదు. ఒక్క క్షణం ఆగి ఎదుటి వారి స్థానంలో ఉండి ఆలోచిస్తే ఇద్దరూ సమానమే అని తెలుస్తుంది" అని జయచంద్ర చెబుతాడు.
ఎమోషనలైన రిషి-వసు..
జయచంద్ర మాటలకు రిషి-వసుధారలు ఎమోషనల్ అవుతారు. ఒకరివైపు మరొకరు నడుస్తూ దగ్గరకు వెళ్లి కళ్లల్లోకి చూసుకుంటారు. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను వసుధార.. నీ ప్రేమను గుర్తించలేకపోయాను అని రిషి మనుసులో అనుకోగా.. ఐ యామ్ సారీ సార్ నేను మీ బాధను గుర్తించలేకపోయానని వసు బాధపడుతుంది. అప్పుడే చప్పట్ల శబ్దం వినిపించి తేరుకుంటారు. ఆ చప్పట్లు కొట్టేది జయచంద్ర. వేనకే ఉన్న జగతీ మహేంద్ర వాళ్ల దగ్గరకు వస్తారు. "చూశారా మీ ఇద్దరి మధ్య ఎంత అవాగాహన ఉందో. మీరిద్దరూ ఒకరు లేకపోతే మరొకరు బతకలేరు. ఆ విషయం మీకూ తెలుసు. కానీ ఇద్దరికీ మీరు కావాలి. అది కూడా మీకు తెలుసు.. దగ్గర కావాలి అనుకుని దూరం దూరం మసలే మీ వింత ప్రేమ కథకు మీరే ప్రత్యక్ష సాక్ష్యం అయ్యారు అని జయచంద్ర అంటాడు. నిజానికి జగతీ.. జయచంద్ర చెప్పడం వల్లే వాళ్లిద్దరూ ఇప్పుడు కలిశారు.
ప్రపంచమంతా ఏకమైన విడదీయలేదు..
"మీ స్వభావాలే మీ దూరానికి కారణం.. మీ ప్రేమకి పునాది కూడా ఆ స్వభావాలే.. వాటిని మీరు వదులుకోవద్దు.. మీ బంధాన్ని మీరు వదులుకోవద్దు.. ఓటింగ్‌లో మీరొక నిర్ణయం తీసుకోగలిగారు.. కానీ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు.. నాకు తెలుసు.. అందుకే ఒక మాట చెబుతాను. యద్భావం తద్భవతి అంటారు. నువ్వు ఏది అనుకుంటే.. ఏది ఆలోచిస్తే అదే జరుగుతుందని అర్థం.. మీరు కనుక మీరిద్దరూ బలంగా కలిసి ఉండాలని అనుకుంటే.. ఈ ప్రపంచ మొత్తం కలిసొచ్చినా మిమ్మల్ని విడదీయలేరు.. ఇప్పుడు మీ మనసు ఏంటో మీరు తెలుసుకున్నారు కాబట్టి.. మీ ప్రేమని నిలబెట్టుకునే బాధ్యత కూడా మీదే" అని జయచంద్ర చెబుతాడు.
జయచంద్ర మాటలు విన్న వసు.. అది రిషి సార్ చేతిలోనే ఉంది అని సమాధానమిస్తుంది. సార్ మన బంధం వివాహం బంధం అని మీరు భావిస్తేనే ఈ తాళి నా మెడలో ఉంటుంది అని రిషితో అంటుంది వసు. రిషి నీ అభిప్రాయం ఏంటి? అని మహేంద్ర అడుగుతాడు. మహేంద్ర గారు రిషికి కాస్త ఆలోచించుకునే సమయమివ్వండి అని జయచంద్ర అంటాడు. సరే రిషి.. రేపు ఉదయానికల్లా ఆలోచించే మేమంతా సంతోషించే సమాధానమిస్తావని అనుకుంటున్నాను. అంటాడు మహేంద్ర. కానీ రిషి మాత్రం మౌనంగా ఉంటుంది. కట్ చేస్తే అనంతరం జయచంద్రకు అందరూ వీడ్కొలు పలుకుతారు. మొత్తానికి జయచంద్ర రాకతో వసు-రిషి బంధంలో మార్పు వచ్చింది.