Afternoon Nap : మధ్యాహ్నం అంతకుమించి నిద్రపోతే.. పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువట-afternoon naps are good for health or bad here is the matter ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Afternoon Naps Are Good For Health Or Bad Here Is The Matter

Afternoon Nap : మధ్యాహ్నం అంతకుమించి నిద్రపోతే.. పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువట

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 06, 2023 02:32 PM IST

Afternoon Nap : చాలా మంది మధ్యాహ్నం కాస్త నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు. ఇది ఈ చిన్న న్యాప్స్ మనలో నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి. అయితే సెలవు ఉన్నప్పుడు.. వర్క లేనప్పుడు చాలా మంది అదే పనిగా ఎక్కువసేపు పడుకుంటారు. అది మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఈ మధ్యాహ్న నిద్ర వల్ల కలిగే ప్రయోజనాలు, హానికరమైన ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 మధ్యాహ్నం నిద్ర వల్ల కలిగే లాభాలు, నష్టాలు
మధ్యాహ్నం నిద్ర వల్ల కలిగే లాభాలు, నష్టాలు

Afternoon Nap : మీకు మధ్యాహ్నం నిద్రించే అలవాటు ఉందా? ఇంతకీ అలా నిద్రపోవడం మంచిదా చెడ్డదా.. అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పగటిపూట చాలా మంది నిద్రపోవడానికి ఇష్టపడతారు. మీకు రాత్రి మంచి నిద్ర లేకపోవడం వల్ల కూడా మధ్యాహ్నం నిద్రవచ్చే అవకాశం ఉంది. లేదా పని ఎక్కువగా ఉన్నా.. శరీరం కాస్త విశ్రాంతిని కోరుకుంటుంది. అయితే చాలా మంది గృహిణులు ఇంటి పని పూర్తి చేసుకుని మధ్యాహ్నం పడుకుంటారు. మరి ఇలా మధ్యాహ్నం పడుకోవడం మంచిదేనా? ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో.. నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

* ఒత్తిడి నుంచి ఉపశమనం

మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడంతోపాటు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రాత్రిపూట పనిచేసే వ్యక్తులు ఎక్కువసేపు మెలకువగా ఉంటారని.. దాని వల్ల అలసట పెరుగుతుంది. ఒత్తిడి స్థాయి కూడా క్రమంగా పెరుగుతుంది. ఈ పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగితే.. క్రానిక్ ఫెటీగ్ తీవ్రమవుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ రకమైన ఒత్తిడిని తగ్గించడానికి పగటిపూట నిద్రపోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.

* అలసట దూరం

ఉదయం నుంచి మధ్యాహ్నానికి మనం పని చేసి.. అలసిపోతాము. ఎందుకంటే మన శరీరం సిర్కాడియన్ రిథమ్‌ను అనుసరిస్తుంది. ఇందులో ప్రతి 12 గంటలకొకసారి శరీర ఉష్ణోగ్రత కాస్త తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రధానంగా మధ్యాహ్నం ఉంటుందని చెప్తున్నారు. అందుకే వ్యక్తి మధ్యాహ్నం కాస్త అలసటగా ఫీల్ అవుతూ ఉంటారని చెప్తారు. కాబట్టి 30 నిమిషాలకు మించకుండా నిద్రపోవడం వల్ల అలసట నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు.

* రిఫ్రెష్ కోసం

మధ్యాహ్నం సమయంలో అప్రమత్తంగా ఉండటం కష్టం. దీనిని పోస్ట్-లంచ్ డిప్ అని పిలుస్తారని డాక్టర్ సూద్ పంచుకున్నారు. ఇది ప్రధానంగా మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల మధ్య జరుగుతుంది. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గుతుంది. దీని కారణంగా మనకు నీరసం, చురుకుదనం కూడా తగ్గుతుంది. కాబట్టి కొంచెం నిద్రపోవడం రిఫ్రెష్​గా ఉండటానికి సహాయపడుతుంది.

ఇంతకీ మధ్యాహ్నం పడుకోవడం మంచిదేనా?

మధ్యాహ్నం చిన్న నిద్ర తీసుకోవడం సర్వసాధారణం. కానీ మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం. ఇది మీ రాత్రిపూట నిద్రను ప్రభావితం చేస్తుంది. కాబట్టి మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోకుండా ఉండటం చాలా ముఖ్యం. ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల స్ట్రోక్ ముప్పు 20 శాతం కంటే ఎక్కువ పెరుగుతుందని మెడికల్ జర్నల్ ఆఫ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ నిపుణులు తెలిపారు. మధ్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం 25 శాతం ఉంటుందని వెల్లడైంది.

నిద్ర లేకపోవడం వల్ల కలిగే సమస్యలు

ఎక్కువసేపు నిద్రపోవడం మంచి అలవాటు కాదు. కానీ నిద్ర లేకపోవడం వల్ల కూడా సమస్యలు ఉంటాయి. కొందరు రాత్రి సమయంలో ఎక్కువ సేపు పడుకోరు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. తగినంత నిద్ర లేకపోవడం వల్ల మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం, డిప్రెషన్‌కు కారణమవుతాయి. అందుకే మనం ప్రతిరోజూ తగినంత నిద్రపోవడానికి ప్రయత్నించాలి.

WhatsApp channel

సంబంధిత కథనం