Face Yoga । ముఖం అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ముఖ వ్యాయామాలు ఇవిగో!-what is face yoga check out 5 face workouts that delay ageing and gives healthy glowing skin
Telugu News  /  Lifestyle  /  What Is Face Yoga, Check Out 5 Face Workouts That Delay Ageing And Gives Healthy Glowing Skin
Face Yoga
Face Yoga (istock)

Face Yoga । ముఖం అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ముఖ వ్యాయామాలు ఇవిగో!

23 March 2023, 11:30 ISTHT Telugu Desk
23 March 2023, 11:30 IST

Face Yoga: ముఖం అందంగా, యవ్వనంగా కనిపించాలంటే ఖరీదైన కాస్మోటిక్స్, కాస్మోటిక్ సర్జరీలు అవసరం లేదు. ముఖానికి యోగా వ్యాయామాలు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి.

యోగా చేయడం, వ్యాయామాలు చేయడం ద్వారా శరీరం మంచి ఆకృతిలో ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటామని మనకు తెలుసు. మరి మీరు ఎప్పుడైనా ఫేస్ యోగా గురించి విన్నారా? ఫేస్ యోగా అనేది ముఖానికి సంబంధించిన వ్యాయామం. సాధారణంగా వృద్ధాప్య సంకేతాలను దూరం చేయడానికి, ముఖంలోని కండరాలను టోన్ చేసి ముడతలు నివారించడానికి ఈ వర్కౌట్‌లు ఉపయోగపడతాయి.

ఈరోజుల్లో ముఖం అందంగా, యవ్వనంగా కనిపించేందుకు సర్జరీలు చేసుకోవడం, ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తులు, ఇతర స్కిన్-లిఫ్టింగ్ చికిత్సలు తీసుకునే ట్రెండ్ పెరుగుతోంది. అయితే ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు. ఎలాంటి ఖర్చులేకుండా యవ్వనంగా కనిపించే చర్మం కోసం DIY విధానంగా ఫేస్ యోగా ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. సాధారణ ఫేషియల్‌లు, చర్మ సంరక్షణ ఉత్పత్తులకు బదులుగా, ఫేస్ యోగా వ్యాయామాలు చేయడం వలన ముఖంలో సహజత్వం వస్తుందని చెబుతున్నారు.

Face Yoga Exercises- ముఖ యోగా వ్యాయామాలు

మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయగల కొన్ని ప్రముఖ ఫేస్ యోగా వ్యాయామాలు ఈ కింద తెలుసుకోండి.

ఐ-ఓపెనర్

మీ కనుబొమ్మలు, చెంపలు, ముఖంపై ప్రభావం చూపే వ్యాయామం ఇది. మీ చేతివేళ్ళను మీ నుదిటిపై పెట్టండి. రెండు వేళ్లతో నుదుటి వద్ద నుంచి మీ కనుబొమ్మలను పైకి లేపండి, పైకి లేపినపుడు కొద్దిగా మెల్లకన్ను పెట్టి మీ రెండు కనుబొమ్మల మధ్య ప్రాంతాన్ని చూపండి, ఆపై రిలీజ్ చేయండి. ఇలా సుమారు 50 సార్లు పునరావృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి.

నుదిటి లిఫ్టర్

మీ నుదిటికి రెండు పక్కలా పాయింట్ బ్లాంక్ లో మీ వేళ్లను ఉంచండి. తేలికపాటి ఒత్తిడిని వర్తింపజేస్తూ మీ నుదిటిని పైకి ఎత్తడానికి ప్రయత్నించండి. ఇలా 50 సార్లు లేదా ఒక నిమిషం పాటు రిపీట్ చేయండి.

ది చీక్ లిఫ్టర్

ఈ వ్యాయామం ప్రాక్టీస్ చేయడానికి ముందుగా మీరు నోరు తెరిచి, మీ నోటిని ' O ' ఆకారంలో ఉంచండి. అలా నవ్వడానికి ప్రయత్నించండి. ఇదే సమయంలో మీ చూపుడు వేళ్లను మీ చెంప కండరాల పైన, నేరుగా మీ కళ్ళ క్రింద ఉంచండి. ఆపైన మీ వేళ్లతో చెంప కండరాలను వీలైనంత వరకుపైకి లేపండి, 20 సెకన్ల పాటు పట్టుకోండి. ఆ తర్వాత రిలీజ్ చేయండి. ఇలా మూడు సార్లు రిపీట్ చేయండి.

హ్యాపీ చీక్స్ స్కల్ప్టింగ్

మీ దంతాలు చూపించకుండా మీ పెదాలు మూసి ఉంచి నవ్వండి. నోటి మూలల వరకు వీలైనంత సాగదీస్తూ అలాగే నవ్వండి. ఆపైన మీ చూపుడు వేళ్లను మీ నోటి మూలల్లోకి నొక్కండి, వేళ్లతో మీ చెంప కండరాలను లాగండి. 20 సెకన్ల పాటు పట్టుకోండి. ఈ సమయంలో మీ బుగ్గలలో కండరాలు బిగుతుగా ఉన్నట్లు ఆనిపిస్తుంది. ఈ వ్యాయామాన్ని మూడు సార్లు రిపీట్ చేయండి.

జా నెక్ ఫర్మర్

మీ నోరు తెరిచి "ఆహ్" శబ్దం చేయండి, నోరు మూయండి. నోరు మూసినపుడు మీ దవడను ఉన్నస్థానం నుంచి ఒక అంగుళం పైకి లేపండి. మళ్లీ నోరు తెరిచి ఆహ్ అని శబ్దం చేసి, నోరు మూయండి, ఇప్పుడు మీ దవడను ఇంకొంచెం పైకి లేపండి, 20 సెకన్ల పాటు ఈ స్థితిలో ఉంచండి . దీనినే వరుసగా చేస్తూ మీరు పైకి చూసే వరకు, మీ తలను వెనుకకు వంచుతూ వెళ్లండి. మీ వ్యాయామంలో మీ దిగువ దవడను మొత్తం 10 సార్లు తెరిచి, మూసివేయండి. ఇలా దీనిని మూడు సార్లు రిపీట్ చేయండి.

సంబంధిత కథనం