Yoga Poses for Breasts । వక్షోజాలకు సరైన ఆకృతి ఇవ్వాలంటే ఈ యోగాసనాలు ఉత్తమం!
Yoga Poses To Tone Breasts: గర్భాధారణ జరిగినపుడు, చనుబాలు ఇచ్చేటపుడు, హర్మోన్ల హెచ్చుతగ్గులు, శరీర తత్వం మొదలైన కారణాలతో వక్షోజాల ఆకృతి దెబ్బతుంటుంది. యోగా ఆసనాలతో వక్షోజాలకు మంచి ఆకృతిని తీసుకురావచ్చు.
ప్రతి స్త్రీ రొమ్ము పరిమాణం ఒకేలా ఉండదు. కాలక్రమేణా శరీరంలో వచ్చే మార్పులు వారి వక్షోజాలపై కూడా ప్రభావం చూపుతాయి. సాధారణంగా గర్భధారణ జరిగినపుడు, చనుబాలు ఇచ్చే సమయంలో స్త్రీల రొమ్ము పరిమాణం పెరుగుతుంది. ఆ తర్వాత వయసు పెరిగేకొద్ది పెరిగిన వక్షోజాలు సాగిపోవడం జరుగుతుంది. ఇలా వారి వక్షోజాల ఆకృతిలో మార్పు రావడం పట్ల కొంతమంది స్త్రీలు కలత చెందుతారు. వారి వక్షోజాలను సరైన ఆకృతిలో ఉంచుకోవడంతో పాటు పరిమాణాన్నిపెంచడానికి లేదా తగ్గించడానికి తరచుగా ఔషధాలు, రసాయనాలు అధికంగా ఉండే క్రీములను ఉపయోగిస్తారు. కొంతమంది శస్త్ర చికిత్సల వరకూ వెళ్తారు. అయితే ఈ రకంగా వక్షోజాల ఆకృతిని మార్చుకోవడం వారికి చాలా హానికరం. భవిష్యత్తులో చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఏదైనా సహజ పద్ధతిలో జరిగితేనే ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు అంటున్నారు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
తమ వక్షోజాల సైజును మార్చువాలనుకునే వారు లేదా వాటికి సరైన ఆకృతిని ఇవ్వాలనుకునే ఆడవారు యోగా చేయడం ద్వారా పరిష్కారం పొందవచ్చు.
Yoga Poses To Tone Breasts- వక్షోజాల ఆకృతికి యోగాసనాలు
NCBI (నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్) వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం, రొమ్ములోని కొవ్వు కణజాలం, గ్రంథులను పెంచడం ద్వారా వక్షోజాల పరిమాణాన్ని పెంచవచ్చు. ఇందుకు యోగాలో కొన్ని ఆసనాలు ఉన్నాయి. ఆ ఆసనాలు అభ్యాసం చేయడం వక్షోజాలు మంచి ఆకృతిలోకి వస్తాయి, మరొక ప్రయోజనం ఏమిటంటే ఈ పద్ధతిలో వక్షోజాలు పెంచుకోవడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వక్షోజాల ఆకృతికి ఉపయోగపడే యోగాసనాలు ఏమిటో ఈ కింద చూడండి.
భుజంగాసనం- Cobra Pose
ఆధునిక యోగాలో భుజంగాసనం లేదా కోబ్రా భంగిమ అనేది హత యోగా వ్యాయామం. ఇది వెనుకకు వంగి ఉండే ఆసనం. దీనిని సాధారణంగా సూర్య నమస్కార ఆసనాల చక్రంలో ప్రదర్శిస్తారు. ఈ ఆసనం రొమ్ము సైజును పెంచడంలో సహాయపడుతుంది. ఈ యోగాతో, మీ రొమ్ము చుట్టూ ఉన్న కండరాలలో స్ట్రెచ్ ఏర్పడుతుంది, దీని కారణంగా రొమ్ము పరిమాణం పెరుగుతుంది.
శలభాసనం- Locust Pose
ఆధునిక యోగాలో ఈ ఆసనాన్ని లోకస్ట్ పోస్ అంటారు. వెనుకకు వంగడం వంటి వ్యాయామం. దీనినే గొల్లభామ భంగిమ అని కూడా అంటారు. ఈ శలభాసనం అభ్యాసం చేయడం వల్ల రొమ్ము చుట్టూ కండరాలు విస్తరిస్తాయి, దీంతో రొమ్ము పరిమాణం పెరుగుతుంది. ఇదే కాకుండా, ఈ ఆసనం వెన్నునొప్పి, నడుము నొప్పి, అలసట నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది.
పర్వతాసనం- Mountain Pose
ఈ ఆసనాన్ని తడాసనం అని పిలుస్తారు, ఎందుకంటే దీన్ని చేసేటప్పుడు శరీరం ఆకారం పర్వతంలా ఉంటుంది. ఈ ఆసనం వేయడం ద్వారా రొమ్ము ప్రాంతానికి రక్త ప్రసరణ పెరుగుతుంది, దీని కారణంగా రొమ్ము పరిమాణం పెరుగుతుంది. అంతే కాకుండా, పర్వతాసనం చేయడం వల్ల భుజాలు బలపడతాయి, నడుము కొవ్వును తొలగిస్తుంది, కడుపు సంబంధిత సమస్యలను నయం చేయడంలో ఈ యోగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్