Goa crime news : గోవా రిసార్ట్​లో దారుణం.. డచ్​ మహిళపై సిబ్బంది లైంగిక దాడి!-goa resort staff arrested for molesting stabbing dutch tourist in pernem probe underway ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Goa: Resort Staff Arrested For Molesting, Stabbing Dutch Tourist In Pernem; Probe Underway

Goa crime news : గోవా రిసార్ట్​లో దారుణం.. డచ్​ మహిళపై సిబ్బంది లైంగిక దాడి!

Sharath Chitturi HT Telugu
Mar 31, 2023 02:02 PM IST

Goa crime news : గోవాలోని ఓ రిసార్ట్​లో.. ఓ డచ్​ మహిళపై సిబ్బంది లైంగిక దాడికి యత్నించాడు. సాయం చేసేందకు వచ్చిన మరో వ్యక్తిపై దాడి చేశాడు.

గోవా రిసార్ట్​లో దారుణం.. డచ్​ మహిళపై సిబ్బంది లైంగిక దాడి!
గోవా రిసార్ట్​లో దారుణం.. డచ్​ మహిళపై సిబ్బంది లైంగిక దాడి!

Dutch woman molested in Goa : గోవాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ డచ్​ మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడి చేశాడు. ఆమెకు సాయం చేసేందుకు వెళ్లిన మరో వ్యక్తిని కత్తితో పొడిచాడు.

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

Dutch woman molested : నార్త్​ గోవా పెర్నెమ్​లోని ఓ రిసార్ట్​లో ఓ డచ్​​ మహిళ ఇటీవలే చెక్​ఇన్​ అయ్యింది. అక్కడ ఒక టెంట్​ని రెంట్​కు తీసుకుంది. ఆమెపై.. అభిషేక్​ వర్మ అనే రిసార్ట్​ సిబ్బంది కన్నుపడింది. ఈ క్రమంలో ఆమె టెంట్​లోకి అనుమతి లేకుండా ప్రవేశించాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె గట్టిగా అరిచింది. ఆ అరుపులు విన్న స్థానికుల్లో ఒకరు.. మహిళకు సాయం చేసేందుకు టెంట్​ వద్దకు వెళ్లింది. ఆమె పేరు యూరికో.

యూరికోను చూసిన అభిషేక్​.. అక్కడి నుంచి పారిపోయాడు. డచ్​ మహిళ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో.. అభిషేక్​ మళ్లీ టెంట్​ వద్దకు వచ్చాడు. ఈసారి కత్తితో వారిద్దరిపై దాడికి యత్నించాడు. ఈ ఘటనలో యూరికో గాయపడింది. ఆ తర్వాత డచ్​ మహిళపై దాడి చేసి.. అక్కడి నుంచి పారిపోయాడు.

Goa crime news latest : ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లారు. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.

మరోవైపు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనాస్థలం నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడు అభిషేక్​ను అరెస్ట్​ చేశారు. ఈ పూర్తి వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని సమచారం.

పెరిగిపోతున్న నేరాలు..

దేశంలో మహిళలపై లైంగిక దాడులు, అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓ 68ఏళ్ల వృద్ధుడు.. ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలో కలకలం సృష్టించింది.

బాధిత మహిళకు నిందితుడు కొంత కాలం క్రితం పరిచయం అయ్యాడు. రాయ్​గడ్​ జిల్లాలోని అలిబాగ్​ నుంచి రోహా పట్టణానికి ప్రయాణిస్తుండగా వారిద్దరికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి మహిళతో ఆ వృద్ధుడు టచ్​లోనే ఉన్నాడు.

Man rapes woman in Maharashtra : మాయమాటలు చెప్పి ఆ మహిళను పాన్వెల్​ ప్రాంతానికి రప్పించాడు నిందితుడు. అక్కడి నుంచి ఓ లాడ్జ్​కి తీసుకెళ్లాడు. ఆమెకు ఇచ్చిన కూల్​ డ్రింక్​లో మత్తుమందు కలిపాడు. అది తాగిన ఆ మహిళ స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఈ ఘటన జరిగిన అనంతరం బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 68ఏళ్ల వ్యక్తి తనను రేప్​ చేసినట్టు ఫిర్యాదు చేసింది. సెక్షన్​ 376 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. పోలీసులు నిందితుడిని ఇంకా అరెస్ట్​ చేయలేదని తెలుస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం