Chicken Curry Murder: చికెన్ కర్రీ గురించి గొడవ: కొడుకును చంపిన తండ్రి-karnataka man kills son in fight over chicken curry ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chicken Curry Murder: చికెన్ కర్రీ గురించి గొడవ: కొడుకును చంపిన తండ్రి

Chicken Curry Murder: చికెన్ కర్రీ గురించి గొడవ: కొడుకును చంపిన తండ్రి

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 06, 2023 06:08 AM IST

Chicken Curry Murder: చికెన్ కర్రీ గురించి జరిగిన గొడవలో ఓ వ్యక్తి.. ఏకంగా కుమారుడిని హతమార్చాడు. ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT Photo)

Chicken Curry Murder: కొన్నిసార్లు చిన్నచిన్న విషయాలు కూడా భారీ గొడవలకు దారి తీస్తుంటాయి. క్షణికావేశంలో దారుణాలకు పాల్పడేలా చేస్తుంటాయి. తాజాగా కర్ణాటక (Karnataka)లో ఇలాంటి అనూహ్య ఘటన ఒకటి జరిగింది. చికెన్ కర్రీ (Chicken Curry) విషయంలో గొడవ జరగగా.. ఏకంగా 32 ఏళ్ల వయసు ఉన్న కుమారుడిని తండ్రి చంపేశాడు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ (Dakshina Kannada) జిల్లాలో ఇది జరిగింది. పోలీసులు ఈ వివరాలను వెల్లడించారు.

కర్రీ అయిపోయిందని..

Chicken Curry Murder: దక్షిణ కన్నడ జిల్లా సులియా తాలుకా గుట్టిగర్‌లో ఇది ఈ ఘటన జరిగింది. మృతుడిని శివరామ్‍గా పోలీసులు గుర్తించారు. తాను ఇంటికి వచ్చే సరికి చికెన్ కర్రీ మొత్తం అయిపోవడం గురించి తండ్రి షీనాతో శివరామ్ గొడవ పడ్డాడు. ఇంట్లో వండిన చికెన్ తనకు ఎందుకు మిగిల్చలేదని గట్టిగా అడిగాడు.

ఇంట్లో తయారు చేసిన చికెన్ కర్రీని.. శివరామ్ ఇంటికి తిరిగి వచ్చే సరికి అతడి తండ్రి మొత్తం తినేశాడని సమాచారం. దీంతో శివరామ్ ఆగ్రహానికి లోనై తండ్రిని ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఓ చెక్క కర్రతో శివరామ్‍ తలపై షీనా బలంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన శివరామ్ మృతి చెందాడు.

సుబ్రమణ్య స్టేషన్‍కు పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. శివరామ్‍కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

తమిళనాడులో దారుణహత్య

Tamil Nadu Murder Case: కాగా, తమిళనాడులో ఇటీవల ఓ దారుణ హత్య జరిగింది. తన మాజీ ప్రియుడిని ఓ మహిళ చంపేసింది. హత్య చేసిన తర్వాత శరీరాన్ని ముక్కలుగా చేసి చెన్నై నగర శివార్లలో పడేసింది. ఢిల్లీలో గతేడాది జరిగిన శ్రద్ధా వాకర్ హత్య ఉదంతాన్ని ఈ ఘటన గుర్తు చేసింది.

ఈ ఘటనలో బాధితుడిని జయంతన్‍ (29)గా పోలీసులు గుర్తించారు. చెన్నై ఎయిర్‌పోర్టులో ఓ ప్రైవేట్ ఎయిర్‌వేస్ గ్రౌండ్ స్టాఫ్ మెంబర్‌గా అతడు పని చేస్తున్నాడు. మార్చి 18 నుంచి అతడు కనిపించకుండా పోయాడు. దీంతో అతడి సోదరి జయకృబ.. పోలీస్ స్టేషన్‍లో ఫిర్యాదు చేశారు. జయంతన్‍ను బక్కియలక్ష్మి అనే మహిళతో సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కాల్ రికార్డింగ్‍లు, కాల్ డేటా ఆధారంగా ఈ విషయాన్ని కనుగొన్నారు. జయంతన్‍ను తానే చంపానని విచారణలో బక్కియలక్ష్మి అంగీకరించింది. ఈ నెల 4న ఈ కేసు మిస్టరీ వీడింది.

కుటుంబాల్లో ఎవరికీ తెలియకుండా 2020లో జయంతన్, బక్కియలక్ష్మి పెళ్లి చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత 2021లో విడిపోయారని తెలిపారు. మార్చి 18న పదుకొట్టాయ్‍కు పిలిపించి జయంతన్‍ను బక్కియలక్ష్మి చంపింది. శరీరాన్ని ముక్కలుగా చేసి ప్లాస్టిక్ బ్యాగ్‍ల పెట్టింది. ఆ తర్వాత చెన్నైకి తీసుకెళ్లి నగగ శివార్లలో పడేసింది. మరో ముగ్గురి సాయంతో సాయంతో ఆమె ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.

Whats_app_banner