Karthika Deepam End : కార్తీక దీపం ఎండ్.. వంటలక్క మళ్లీ వస్తుందా?-vantalakka and doctor babu s karthika deepam serial ends ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam End : కార్తీక దీపం ఎండ్.. వంటలక్క మళ్లీ వస్తుందా?

Karthika Deepam End : కార్తీక దీపం ఎండ్.. వంటలక్క మళ్లీ వస్తుందా?

Anand Sai HT Telugu
Jan 20, 2023 12:17 PM IST

Karthika Deepam Ending : కార్తీక దీపం.. ఈ సీరియల్ పేరు తెలియని తెలుగు గుమ్మం ఉండదేమో. ఎన్ని ఎపిసోడ్లు.. ఎంతో సాగదీత. అయినా ప్రేక్షకులు ఈ సీరియల్ ను నెత్తిన పెట్టుకున్నారు. ఇక సీరియల్ క్లైమాక్స్ వచ్చేసింది. ఇక బాయ్.. బాయ్ చెప్పనుంది. అయితే వంటలక్క(ప్రేమి విశ్వనాథ్) మళ్లీ రానుందా?

డాక్టర్ బాబు, వంటలక్క
డాక్టర్ బాబు, వంటలక్క (twitter)

డాక్టర్ బాబు.. వంటలక్క.. ఈ పేర్లు వినే ఉంటారుగా.. ఎన్నో ఏళ్లుగా తెలుగులో చాలా ఫేమస్. స్టార్ మాలో వచ్చే.. కార్తీక దీపం సీరియల్ చాలా ఏళ్లుగా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సీరియల్ ఎంతలా కనెక్ట్ అయిందంటే.. ఇంట్లోని కొన్ని విషయాలను పోల్చుకునేలా అయింది. నువ్వు డాక్టర్ బాబుల చేయకు.. నీకు వంటలక్కకు ఉన్నంత ఓపిక.. ఇలా పోల్చుకునే వారూ ఉన్నారు. అంటే ఓ సీరియల్ ఇంతలా కనెక్ట్ అవ్వడం విశేషమే..

ఇక టీఆర్పీల పరంగా చూసుకున్నా.. ఈ సీరియల్ టాప్ ప్లేస్ లో కొనసాగింది. ఇంతటి టీఆర్పీల పెద్ద పెద్ద సినిమాలకూ దక్కలేదేమో. ఇంట్లో ముసలవ్వ నుంచి పిల్లాడి వరకూ.. ఈ సీరియల్ కనెక్ట్ అయింది. మగాళ్లలోనూ ఈ సీరియల్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఇందులో వంటలక్క.. అసలు పేరు ప్రేమి విశ్వనాథ్.. ఆమెకు చాలా మంది అభిమానులు ఉన్నారు. సీరియల్ ఇంతటి స్థాయిలో సక్సెక్ అయ్యేందుకు ఆమె కూడా ప్రధాన కారణం. ఆమెకు జంటగా డాక్టర్ బాబు.. నిరుపమ్ నటించాడు. ఎన్నో ప్రయోగాలు.. ఎంతో ఆసక్తిగా ఈ సీరియల్ సాగింది. మోనిత పాత్రలో నటించిన శోబిత శెట్టి కూడా ఈ సీరియల్ కు కలిసివచ్చిన అంశం.

పదిహేను వందలకు పైగా ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. ఇక అయిపోతుందిలే.. అనుకునే టైమ్ కి కథను సాగదీశాడు దర్శకుడు. అలా ఏళ్లపాటు సీరియల్ హవా నడిచింది. ఇక ఎండ్ కార్డ్ పడే దశకు వచ్చింది. ఈ శనివారంతో కార్తీక దీపం సీరియల్ ముగింపునకు వస్తుంది. ఎట్టకేలకు.. కార్తీక దీపం సీరియల్ శుభం కార్డును తెలుగు ప్రేక్షకులు చూడనున్నారు. మరో క్రేజీ విషయం ఏంటంటే.. ఈ సీరియల్ ను మీమర్స్ కూడా కావాల్సినంతంగా వాడుకున్నారు. కొన్నిరోజుల పాటు వంటలక్క, డాక్టర్ బాబు మీమ్స్ వైరల్ అయ్యాయి. ఇప్పటికీ కొంతమంది వాడుతుంటారు.

స్టార్ మా పరివారంలో సీరియల్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే ఈ సందర్భంగా లీడ్ రోల్ లో నటించిన ప్రేమి విశ్వనాథ్ కాస్త ఎమోషనల్ అయింది. నేను వెళ్లిపోతున్నానని ఎవరూ బాధపడకండి.. మళ్లీ వస్తానని చెప్పుకొచ్చింది. దీంతో మళ్లీ వంటలక్క వస్తుందా అని మీమ్స్ మెుదలయ్యాయి. ఇక చాలు.. అని కొంతమంది అంటుంటే.. మరికొంతమంది వంటలక్కను మళ్లీ చూడాలని కోరుకుంటున్నారు. చాలా మంది అభిమానులు కూడా ఈ సీరియల్ ను మిస్ అవుతాం అని చెప్పుకొచ్చారు.

ఇక కార్తీక దీపం సీరియల్ శనివారంతో ఎండ్ కార్డ్ పడనుంది. అదే ప్లేసులో 'బ్రహ్మముడి' సీరియల్ రానుంది. ఈ సీరియల్‌ని కూడా ఆదరించండి అంటూ వంటలక్క, డాక్టర్ బాబులు బ్రహ్మముడి సీరియల్ ప్రోమోషన్స్‌లో ఇటీవల పాల్గొన్నారు. కార్తీకదీపం సీరియల్ ఎన్నో మరుపురాని జ్ఞాపకాలను ఇచ్చింది.. మీ గుండెల్లో మాకు చోటుని కల్పించింది. ప్రతి గొప్ప కథకి గొప్ప ముగింపు కూడా ఉంటుంది. కార్తీకదీపం మీకు నచ్చే అద్భుతమైన క్లైమాక్స్‌తో ఉంటుంది.. అంటూ చెప్పారు.

IPL_Entry_Point

టాపిక్