Weekend Events in Hyderabad: హైదరాబాద్ లోనూ క్రమంగా మెట్రో కల్చర్ వచ్చేస్తోంది. వీకెండ్ ఈవెంట్స్ కు డిమాండ్ పెరుగుతోంది. దీంతో ప్రతి శని, ఆదివారాల్లో నగరంలో ఎన్నో ఈవెంట్స్ జరుగుతూనే ఉంటున్నాయి. వీటిపై ఆసక్తి చూపించే ఆడియెన్స్ రోజురోజుకూ పెరిగిపోతున్నారు. మరి ఈ వీకెండ్ హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్స్ ఏవి? వాటికి టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో చూడండి.
మ్యూజిక్ షోస్, కామెడీ షోస్, పాటరీ మేకింగ్.. ఇలా మీకు నచ్చిన ఈవెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటిలో ఏ ఈవెంట్ కు వెళ్లాలనుకుంటున్నారో ఆ ఈవెంట్ టికెట్లు బుక్ చేసుకునే వీలుంటుంది. డేట్, ఈవెంట్ నేమ్ అన్నీ అందులో ఉంటాయి. మీకు నచ్చిన షోకి టికెట్లు బుక్ చేసుకోండి.
షేమ్ ఆన్ మి బై సపన్ వర్మ - మార్చి 30 నుంచి ఏప్రిల్ 7 వరకు వివిధ వేదికల్లో సపన్ వర్మ షోలు ఉంటాయి. టికెట్లు రూ.499 నుంచి అందుబాటులో ఉన్నాయి.
ఓపెన్ మైక్ బై క్యా బోల్తే హైదరాబాద్ - మార్చి 30న సాయంత్రం 6.30 గంటల నుంచి రెడ్‌బ్రిక్ ఆఫీసెస్, నాలెడ్జ్ సిటీ. రూ.250 నుంచి టికెట్లు ఉన్నాయి.
వీకెండర్ ఎట్ హైదరాబాద్ బై వివేక్ మురళీధరన్ - మార్చి 30 నుంచి వివిధ వేదికల్లో ఈవెంట్స్ ఉంటాయి. టికెట్లు రూ.249 నుంచి అందుబాటులో ఉన్నాయి.
సో మినీ థింగ్స్ అయ్యో శ్రద్దా వరల్డ్ టూర్ 2024 - మార్చి 30 నుంచి ఏప్రిల్ 6 వరకు వివిధ వేదికల్లో కామెడీ షోస్ ఉంటాయి. రూ.799 నుంచి టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
రామ్ మిరియాల లైవ్ - శుక్రవారం (మార్చి 29) రాత్రి 8 గంటలకు గ్రీస్ మంకీలో. రూ.500 నుంచి టికెట్లు ఉన్నాయి.
కారివోకె ఓపెన్ మైక్ - శనివారం (మార్చి 30) కృష్ణా స్టూడియో, హైదరాబాద్. రూ.99 నుంచి టికెట్లు అందుబాటులో..
ట్రిబ్యూట్ టు బోన్ జోవి - శనివారం (మార్చి 30) రాత్రి 9 గంటల నుంచి హార్డ్ రాక్ కేఫ్ లో.. రూ.499 నుంచి టికెట్లు కొనుగోలు చేయొచ్చు.
పాటరీ వర్క్‌షాప్ - ఆదివారం (మార్చి 31) మధ్యాహ్నం 3 గంటలకు హౌస్ ఆఫ్ గౌర్మెట్ లో.. టికెట్లు రూ.1499 నుంచి..
కాఫీ పెయింటింగ్ వర్క్‌షాప్ - ఆదివారం (మార్చి 31) మధ్యాహ్నం ఒంటి గంట నుంచి హౌస్ ఆఫ్ గౌర్మెట్ లో.. టికెట్లు రూ.1199 నుంచి..
కారికేచర్ వర్క్‌షాప్ - ఆదివారం (మార్చి 31) మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ది బీనెరీ కెఫెలో.. టికెట్లు రూ.1299 నుంచి ప్రారంభం.
ఇవి మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో ఈవెంట్స్ ఈ వీకెండ్లో జరగనున్నాయి. వాటి టికెట్లను బుక్ మై షోలోకి వెళ్లి బుక్ చేసుకోండి.