Cycling: మీ బాన పొట్ట త్వరగా తగ్గాలా? రోజూ అరగంట పాటు ఇలా సైకిల్ తొక్కండి
Cycling: చాలామంది బాన పొట్టతో ఇబ్బంది పడుతున్నారు. బరువు పెరిగిన వారందరికీ పొట్ట దగ్గరే కొవ్వు పేరుకు పోతుంది. ఇలాంటివారు సైకిల్ తొక్కడం ద్వారా కరిగించుకోవచ్చు.
Cycling: ప్రపంచంలో ఎంతోమంది ఊబకాయం, అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. వీరందరికీ కొవ్వు అధికంగా చేరేది పొట్ట చుట్టే. దీనివల్ల చూడడానికి అందవిహీనంగా కనిపిస్తారు. కొన్ని రకాల డ్రెస్సులు పట్టక ఇబ్బంది పడతారు. పొట్ట దగ్గర కొవ్వు కరిగించుకోవాలంటే ప్రతిరోజూ సైకిల్ తొక్కండి. రోజూ సాయంత్రం లేదా ఉదయం పూట అరగంట పాటు ఆగకుండా సైకిల్ తొక్కడం వల్ల మీకు బాన పొట్ట కరిగే అవకాశం ఎక్కువ. లేదా ఉదయం వాకింగ్‌కు వెళ్తే సాయంత్రం సైకిల్ తొక్కడానికి కేటాయించండి. అలా అయితే కూడా మీరు త్వరగా బాని పొట్టను కరిగించుకోగలరు.
సైకిల్ తొక్కడం కేవలం చిన్నపిల్లల పని అనుకుంటారు. నిజానికి సైకిల్ తొక్కడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం కుదుటపడుతుంది. సైకిల్ రెగ్యులర్ గా తొక్కేవారు ఇతరులతో పోలిస్తే ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటారు. ముఖ్యంగా గుండే, శ్వాసకోశ వ్యవస్థకు సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థను చురుగ్గా చేసి ఆహారం జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీనివల్ల మీకు అజీర్తి వంటి సమస్యలు కూడా రావు. శరీర భాగాలకు ఆక్సిజన్ తో పాటు ఇతర పోషకాలు సక్రమంగా అందుతాయి. కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
సైక్లింగ్ చేయడం ప్రారంభించాక నెల రోజుల్లో మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది బరువును తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడంలో సైక్లింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మెదడు పని తీరును మార్చడానికి ఇది మేలు చేస్తుం.ది మీకు తొడలు, పొట్ట దగ్గర అధికంగా కొవ్వు పడితే సైక్లింగ్ చేయడానికి ప్రయత్నించండి. త్వరలోనే మీకు ఆ కొవ్వు కరగడం ఖాయం.
సైక్లింగ్ చేయడం వల్ల మీ మానసిక ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. మీ బరువుకు తగ్గ సైకిల్ ని ఎంచుకొని తొక్కడం ప్రారంభించండి. కొన్ని రోజుల్లోనే మీకు ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయి.
టాపిక్