Naga Shaurya fainted: టాలీవుడ్ యువ నటుడు నాగ శౌర్య మూవీ సెట్స్‌లో స్పృహ తప్పి పడిపోయాడు. మూవీ షూటింగ్‌లో ఉన్న సమయంలోనే శౌర్య పడిపోవడంతో అతన్ని గచ్చిబౌలిలో ఏఐజీ హాస్పిటల్‌లో చేర్చారు. అతని తర్వాతి మూవీ కోసం కఠినమైన డైట్ ఫాలో కావడం వల్లే నాగ శౌర్యకు ఇలా జరిగినట్లు తెలుస్తోంది.
మూవీలోని హై యాక్షన్ సీక్వెన్స్ కోసం అతడు తన సిక్స్ ప్యాక్ యాబ్స్‌ను చూపించాల్సి ఉంది. దీనికోసం అతడు నో లిక్విడ్ డైట్ ఫాలో అవుతున్నాడు. దీని కారణంగా పూర్తిగా అలసిపోవడంతో సెట్స్‌లోనే కళ్లు తిరిగి పడిపోయాడు. అతన్ని వెంటనే షూటింగ్ లొకేషన్‌కు దగ్గరగా ఉన్న ఏఐజీకి తరలించారు. అక్కడ అతనికి చికిత్స అందిస్తున్నారు.
మంగళవారం (నవంబర్ 15) అతన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు. మూడు రోజులుగా నో లిక్విడ్ డైట్‌ను నాగ శౌర్య ఫాలో అవుతున్నాడు. దీంతో విపరీతమైన డీహైడ్రేషన్‌కు గురై స్పృహ తప్పినట్లు డాక్టర్లు వెల్లడించారు. అయితే ప్రమాదమేమీ లేదని డాక్టర్లు తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు శౌర్య త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. అతని పెళ్లి బెంగళూరులో నవంబర్ 20వ తేదీన జరగనుంది. అనూష శెట్టిని నాగ శౌర్య పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు బెంగళూరులోనే అతని పెళ్లి కార్యక్రమాలు జరగనున్నాయి.
పెళ్లి కోసం కూడా శౌర్య కొన్ని రోజుల బ్రేక్ మాత్రమే తీసుకోనున్నాడు. అతడు నటిస్తున్న ఈ కొత్త మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకు పవన్ బాసంశెట్టి డైరెక్టర్‌గా ఉండగా.. యుక్తి తరేజా నాగ శౌర్య సరసన నటిస్తోంది.
టాపిక్