Karthika deepam 2 serial march 28th: కార్తీక్ చేసిన తప్పు ఏంటి? దీప ముందు దోషిగా ఎందుకు నిలబడ్డాడు?
Karthika deepam 2 serial march 28th episode: జాతరలో నిర్వహించిన సైకిల్ పోటీలో దీప గెలుస్తుంది. బహుమతి ప్రదానం చేసేందుకు కార్తీక్ వస్తాడు. దీపని చూసి తాను ఆ తప్పు చేయలేదని నమ్మమని అడుగుతాడు. అసలు కార్తీక్ చేసిన తప్పు ఏంటి? దీప ఎందుకు నమ్మడం లేదో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Karthika deepam 2 serial march 28th episode: యువరాణిలా బతకాల్సిన దీప పారిజాతం చేసిన కుట్ర వల్ల పేదింటి బిడ్డగా మారిపోతుంది. డబ్బా వాలాగా మారి జీవనం సాగిస్తుంది. తన కూతురికి సైకిల్ కొనివ్వాలనే ఆశతో డబ్బులు కూడబెడితే వాటిని తన అత్త అనసూయ లాగేసుకుంటుంది. నీ మొగుడు చేసిన అప్పులు తీర్చాలని చెప్పి దీపని నానా మాటలు అంటుంది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
కూతురిని సంతోషపెట్టడం కోసం జాతరకు తీసుకెళ్తుంది. సైకిల్ కొనివ్వమని శౌర్య గొడవ చేస్తుంది. మా నాన్న ఉంటే ఇలా చేసేవాడా? అని శౌర్య అనేసరికి దీప తన దీన స్థితిని తలుచుకుని కన్నీళ్ళు పెడుతుంది. తల్లిని శౌర్య ప్రేమగా ఓదారుస్తుంది. జాతరలో సైకిల్ పోటీలు నిర్వహిస్తారు. అందులో పోటీ చేయమని శౌర్య అడిగితే సరే అని బరిలోకి దిగుతుంది. ఆడదానివి మాతో ఎందుకు పోటీ అని మగవాళ్ళు హేళనగా మాట్లాడతారు. సైకిల్ పోటీలో మనల్ని ఎవర్రా ఆపేది అంటూ దీప ధీమాగా చెప్తుంది.
దీప సైకిల్ పోటీలో గెలిచి విజేతగా నిలుస్తుంది. జాతరలో కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. పోటీలో గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేసేందుకు కార్తీక్ వచ్చారని అనౌన్స్ చేస్తారు. దీప కార్తీక్ పేరు వినగానే కోపంగా మొహం పెట్టేస్తుంది. బహుమతి అందుకోవడం కోసం స్టేజ్ మీదకు వచ్చిన దీపతో కార్తీక్ దీనంగా ‘నేను ఆ తప్పు చేయలేదు నన్ను నమ్మండి’ అని అడుగుతాడు. కానీ దీప మాత్రం చాలా కోపంగా ‘నేను నమ్మను.. నన్ను నమ్మించలేరు’ అని చెప్తుంది. అసలు వీళ్లిద్దరి మధ్య జరిగిన గొడవ ఏంటి? కార్తీక్ చేసిన తప్పు ఏంటి? దాని వల్ల దీపకు జరిగిన నష్టం ఏంటి? తెలియాలంటే ఈరోజు ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.
నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
పారిజాతం తన కొడుక్కి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా దశరథకు పుట్టిన కూతుర్ని మాయం చేస్తుంది. ఆ బిడ్డని చంపేయమని ఒక వ్యక్తిని పురమాయిస్తుంది. కానీ అతడు బిడ్డని చంపకుండా బస్టాండ్ లో వదిలేస్తాడు. ఆ బిడ్డ కుబేర ఇంటికి చేరుతుంది. తనని సొంత కూతురులాగే పెంచుకుంటాడు. కానీ కుబేర అక్క మాత్రం అది ఒక అనాథ అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. కష్టపడి ఎలాగైనా తన కూతురిని కలెక్టర్ ని చేయాలని రాత్రింబవళ్ళు కష్టపడతాడు. దీంతో అనసూయ దీపని తిడుతుంది. నీ వల్లే నా తమ్ముడి ఆరోగ్యం చెడిపోతుంది. నీ కోసమే కష్టపడుతున్నాడని అనేసరికి దీప చదువు మానేస్తుంది.
తండ్రికి సాయంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. ఇక దీపను తన కొడుకు నరసింహానికి ఇచ్చి పెళ్లి చేయాలని అనసూయ ఫిక్స్ అవుతుంది. ఒకరోజు సుమిత్ర తన మేనల్లుడు కార్తీక్, కూతురు జ్యోత్స్నని తీసుకుని గుడికి వెళ్తుంది. గుడి దగ్గర ఉన్న కొలనులో కలువ పువ్వులు తీసుకురమ్మని జ్యోత్స్న కార్తీక్ ని బలవంత పెడుతుంది. తనకి నీళ్లంటే భయమని చెప్పినా కూడా వినిపించుకోదు. దీంతో కార్తీక్ వాటి కోసం కొలనులోకి దిగుతాడు. నీళ్ళలో మునిగిపోతుంటే అటుగా వెళ్తున్న దీప చూసి కాపాడుతుంది. అప్పుడే తొలిసారిగా దీప తన తల్లి సుమిత్రని అనుకోకుండా కలుస్తుంది.
కొన్నేళ్ళ తర్వాత దీప పెద్ద వాళ్లగా చూపిస్తారు. దీప వంటలక్క అవుతుంది. సైకిల్ మీద డబ్బాలు పెట్టుకుని ఆకలిలో ఉన్న వారికి అన్నం పెడుతుంది. డబ్బులు లేకపోయినా సరే పేదవాళ్ళ పట్ల జాలితో కడుపు నిండా అన్నం పెడుతుంది. అందరూ తనని మెచ్చుకుంటారు. అన్నం పెట్టి ఆకలి తీరుస్తుందని ఆశీర్వాదిస్తారు. సీన్ కట్ చేస్తే పెద్దయిన జ్యోత్స్న ఎంట్రీ చూపిస్తారు. మిస్ హైదరాబాద్ పోటీలో పాల్గొంటుంది. జ్యోత్స్న మీద పారిజాతం అతి ప్రేమ చూపించడంతో శివనారాయణ తనకి దూరంగా ఉండమని వార్నింగ్ ఇస్తాడు.
మిస్ హైదరాబాద్ పోటీలో జ్యోత్స్న ఫైనల్ రౌండ్ కి చేరుకుంటుంది. ఓ వైపు జ్యోత్స్న అందాల పోటీలో విజేతగా నిలిస్తే అటు దీప తన కూతురు సంతోషం కోసం సైకిల్ పోటీలో గెలుస్తుంది. తన కూతురి కోరిక ప్రకారం పోటీలో గెలిచి సైకిల్ బహుమతిగా ఇస్తుంది. దీనికి కొనసాగింపు ఈ ప్రోమో..
టాపిక్