Maha shivaratri 2024: మీ రాశి ప్రకారం ఈ మంత్రాలు చదువుతూ శివారాధన చేయండి.. అద్భుతాలు చూస్తారు
Maha shivaratri 2024: మహా శివరాత్రి పర్వదినాన మీ రాశి ప్రకారం ఈ మంత్రాలు చదువుతూ పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. శివయ్య ఆశీస్సులు లభిస్తాయి.
Maha shivaratri 2024: హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగలో మహా శివరాత్రి ఒకటి. ఆరోజు శివాలయాలు మొత్తం శివనామ స్మరణతో మారుమోగిపోతాయి. శివరాత్రి రోజు పూజ చేసి, ఉపవాసం, జాగరణ ఉండి శివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. కొంతమంది ప్రత్యేకంగా అభిషేకం చేయిస్తారు. మీరు శివరాత్రి రోజు పూజ చేయాలనుకుంటే మీ రాశి ప్రకారం ఈ విధంగా పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఏ ఏయే రాశుల వాళ్ళు ఏ మంత్రాలు పఠిస్తూ శివుడిని ఆరాధించాలో చూద్దాం.
మేష రాశి
మేష రాశి జాతకులు శివుడికి ఎరుపు రంగు పుష్పాలు సమర్పించాలి. అలాగే మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ద్వారా శివయ్య అనుగ్రహం లభిస్తుంది. ఉపవాసం ఉండటం వల్ల మీరు ఏదైనా పని తలపెడితే అందులో విజయం సాధిస్తారు.
వృషభ రాశి
వృషభ రాశి జాతకులు శివుడికి ఇష్టమైన తెలుపు రంగు పూలు సమర్పించాలి. రుద్రాభిషేకం పూజలో పాల్గొనడం వల్ల శంకరుడు ఆశీస్సులు మీకు లభిస్తాయి. పూజ సమయంలో “ఓం నమః శివాయ” మంత్రాన్ని పఠిస్తే ఆరోగ్యం, శ్రేయస్సు పొందుతారు.
మిథున రాశి
మిథున రాశి వ్యక్తులు మహా మృత్యుంజయ హవనాన్ని నిర్వహించి, పచ్చని పండ్లు శివుడికి సమర్పించాలి. అలాగే ఓం నమః శివాయ మంత్రాన్ని పఠించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. విజయం సాధించడానికి మార్గాలు సుగమం అవుతాయని పండితులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు శివుడికి పాలు తెల్లటి పువ్వులు సమర్పించి మహా మృత్యుంజయ పూజలో పాల్గొని ఆశీర్వాదాలు పొందవచ్చు. ఈరోజు ఉపవాసం ఉంటే ఆరోగ్యం, విజయము మీకు లభిస్తుంది.
సింహ రాశి
సింహ రాశి జాతకులు రుద్రాభిషేక పూజలు చేయడం పుష్పాలు సమర్పించడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం పొందుతారు. మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది.
కన్యా రాశి
కన్యా రాశి వారు శివుడికి పాలు, తెల్ల పూలు సమర్పించాలి. పవిత్రమైన రుద్రాభిషేకం పూజలో పాల్గొని శివయ్యని స్మరించుకుంటూ ఓం నమః శివాయ మంత్రాన్ని పఠించడం వల్ల ఆరోగ్యం, శ్రేయస్సు పొందుతారు.
తులా రాశి
ఈ రాశి జాతకులు శివునికి ఇష్టమైన తెలుపు రంగు పూలు సమర్పించాలి. పవిత్రమైన మహామృత్యుంజయ పూజలో పాల్గొంటే మంచిది. ఓం నమః శివాయ మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం, విజయం పొందుతారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వ్యక్తులు ఈ పవిత్రమైన రోజున రుద్రాభిషేకం చేయడం మంచిది. శివునికి శక్తివంతమైన ఎర్రటి పువ్వులు సమర్పించాలి. అలాగే ఉపవాసం ఉంటే శుభ ఫలితాలు పొందుతారు.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారు పసుపు పుష్పాలు సమర్పించాలి. మహా మృత్యుంజయ పూజలో పాల్గొని ఆశీర్వచనాలు తీసుకోవాలి. విజయం, ఆరోగ్యం లభిస్తుంది. ఓం నమః శివాయ మంత్రాన్ని జపించాలి. ఇది వారి లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది.
మకర రాశి
మకర రాశి జాతకులు రుద్రాభిషేకం చేయడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయి. నీలం రంగు పుష్పాలు సమర్పించాలి. ఉపవాసం ఉంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. క్రమశిక్షణగా మెలుగుతారు.
కుంభ రాశి
కుంభ రాశి జాతకులు శివునికి స్వచ్ఛమైన తెలుపు రంగు పుష్పాలు సమర్పించాలి. మహా మృత్యుంజయ పూజలో పాల్గొని ఓం నమః శివాయ మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితం వృద్ధిపదంలో సాగుతుంది.
మీన రాశి
మీన రాశి జాతకులు రుద్రాభిషేక పూజ నిర్వహించి పసుపు రంగు పువ్వులు సమర్పించాలి. ఉపవాసం ఉండటం వల్ల మీ లక్ష్యాలను సాధించే సామర్థ్యాలు పొందుతారు. ఆధ్యాత్మికంగా బలపడతారు.