తెలుగు న్యూస్ / ఫోటో /
IPL 2024 Points Table: లక్నోపై గెలుపుతో ప్లేఆఫ్స్ రేసులో ఢిల్లీ - అయినా ఆశలు తక్కువే -రన్‌రేట్ దెబ్బకొడుతుందా?
- IPL 2024 Standings After DC vs LSG Match: ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అసమానంగా పోరాడింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై 19 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ ఆశలను ఢిల్లీ నిలుపుకుంది. ఈ ఓటమితో లక్నో ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
- IPL 2024 Standings After DC vs LSG Match: ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అసమానంగా పోరాడింది. లక్నో సూపర్ జెయింట్స్‌పై 19 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ ఆశలను ఢిల్లీ నిలుపుకుంది. ఈ ఓటమితో లక్నో ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
(1 / 7)
ఐపీఎల్ లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరల్ బ్యాటింగ్ మెరుపులకు తోడు బౌలింగ్‌లో సీనియర్ పేసర్ ఇశాంత్ శర్మ విజృంభించడంతో లక్నోపై ఢిల్లీ విజయాన్ని సాధించింది.
(2 / 7)
ఈ విజయంతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో 14 మ్యాచుల్లో ఏడు విజయాలు, ఏడు ఓటములతో ఢిల్లీ ఐదు స్థానంలో నిలిచింది. మిగిలిన జట్ల గెలుపు ఓటములపైనే ఢిల్లీ ప్లేఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. అద్భుతాలు జరిగితేనే ఢిల్లీతో పాటు లక్నో ప్లేఆఫ్స్ రేసులో అడుగుపెడతాయి.
(3 / 7)
కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. పదహారుపాయింట్లు సాధించిన రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ బెర్తు కూడా దాదాపు ఖరారైంది. టాప్ 2లో ఈ రెండు జట్లు నిలిచే అవకాశాలు కనిపిస్తోన్నాయి.
(4 / 7)
మూడు, నాలుగు స్థానాల కోసం చెన్నైతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోటీ నెలకొంది.
(5 / 7)
తదుపరి మ్యాచుల్లో విజయాల్ని ఎస్ఆర్‌హెచ్‌తో పాటు సీఎస్‌కే, ఆర్‌సీబీతో పాటు లక్నో విజయాల్ని సాధించకుండాఉంటేనే ఢిల్లీ ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు రన్‌రైట్ మైనస్‌లలో ఉండటం ప్లేఆఫ్స్ రేసుకు అడ్డంకిగా మారింది.
(6 / 7)
ఇప్పటికే పంజాబ్ కింగ్స్‌తో పాటు ముంబై, గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.
(7 / 7)
ఢిల్లీపై ఓటమితో లక్నో ప్లేఆఫ్స్ అవకాశాలకు గండిపడింది. చేజేతులా ప్లేఆఫ్స్ రేసు నుంచి లక్నో కోల్పోయింది. చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబైతో లక్నో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే లక్నో పాయింట్స్ 14 కుచేరుతాయి. మిగిలిన జట్లు కూడా 14 పాయింట్లకు పరిమితమైతే రన్‌రేట్ ప్రకారం లక్నో ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది.
ఇతర గ్యాలరీలు