
(1 / 5)
ఐపీఎల్‍లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ కేఎల్ రాహుల్‍పై ఆ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గొయెంకా బహిరంగంగానే అరిచేశారు. సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో భారీ ఓటమి తర్వాత రాహుల్‍పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే, తాజాగా రాహుల్‍కు ప్రత్యేకంగా డిన్నర్‌కు ఆతిథ్యమిచ్చారు గోయెంకా.

(2 / 5)
సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో మే 8న జరిగిన మ్యాచ్‍లో లక్నో ఓటమి పాలైంది. 167 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా సన్‍రైజర్స్ ఛేదించింది. దీంతో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‍పై ఓనర్ సంజీవ్ గొయెంకా బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు సంబధించిన వీడియో వైరల్ అవడంతో.. గోయెంకా తీరుపై చాలా మంది మాజీలు, నెటిజన్లు విమర్శలు కురిపించారు.
(Photo: X (Twitter))
(3 / 5)
ఈ తరుణంలో కేఎల్ రాహుల్‍కు ప్రత్యేకంగా డిన్నర్ ఇచ్చారు సంజీవ్ గోయెంకా. సోమవారం (ఏప్రిల్ 13) రాహుల్‍కు తన ఇంట్లోనే ఆయన ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా రాహుల్‍ను ఆయన ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
(Photo: X (Twitter))
(4 / 5)
కేఎల్ రాహుల్, సంజీవ్ గోయెం కా నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తంగా కెప్టెన్ కేఎల్, ఎల్‍ఎస్‍జీ ఓనర్ మధ్య ఉన్న గ్యాప్ దీంతో ముగిసిపోయిందని అర్థమవుతోంది.

(5 / 5)
ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు లక్నో సూపర్ జెయింట్స్ 12 మ్యాచ్‍ల్లో ఆరు గెలిచి ఆరు ఓడింది. ప్లేఆఫ్స్ చేరాలంటే లీగ్ దశలో తనకు మిగిలిన రెండు మ్యాచ్‍లను లక్నో తప్పక గెలవాలి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో నేడు (మే 14) తలపడనుంది.
(PTI)ఇతర గ్యాలరీలు