Karthika deepam 2 serial april 2nd: జ్యోత్స్నని పెళ్లి చేసుకోలేనని చెప్పిన కార్తీక్.. మరో కుట్రకు తెర తీసిన పారిజాతం-karthika deepam 2 serial april 2nd episode karthik confides parijatham he is not willing to marry jyotsna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial April 2nd: జ్యోత్స్నని పెళ్లి చేసుకోలేనని చెప్పిన కార్తీక్.. మరో కుట్రకు తెర తీసిన పారిజాతం

Karthika deepam 2 serial april 2nd: జ్యోత్స్నని పెళ్లి చేసుకోలేనని చెప్పిన కార్తీక్.. మరో కుట్రకు తెర తీసిన పారిజాతం

Gunti Soundarya HT Telugu
Apr 02, 2024 09:10 AM IST

Karthika deepam 2 serial april 2nd episode: జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేదని కార్తీక్ పారిజాతానికి తెగేసి చెప్తాడు. దీంతో తన మనవరాలిని ఎలాగైనా కార్తీక్ పెళ్లి చేసుకునేలా చేయాలని తన జీవితంలోకి మరో ఆడదాన్ని రానిచ్చేది లేదని పారిజాతం ఫిక్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 2వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 2వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial april 2nd episode: కార్తీక్ ఇంటికి వస్తాడు. ముందు వెళ్ళి నా కోడలిని కలువు తను నీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుందని కాంచన కొడుకుతో చెప్తుంది. కోడలు కాదు మేనకోడలని అంటాడు. సుమిత్ర వాళ్ళని కలిసి పలకరిస్తాడు. దశరథ కూడా ముందు వెళ్ళి జ్యోత్స్నని కలువు అది నీకోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుందని అంటాడు. పారిజాతం ఎదురుపడుతుంది. ఎలా ఉన్నావ్ అమ్మమ్మ అంటే మూతి ముడుచుకుంటుంది. సరేనని పారు అని పిలుస్తాడు. లండన్ నుంచి ఏం తెచ్చావని అడిగితే లిప్ స్టిక్ ఇస్తాడు. శివనారాయణ వచ్చి పారిజాతంకి కౌంటర్ వేస్తాడు.

ఇంటికి వచ్చిన కార్తీక్

పారిజాతం కూడా ముందు వెళ్ళి జ్యోత్స్నని కలువు అది నీకోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుందని అంటుంది. జ్యోత్స్నని నేను కేవలం మరదలుగా చూస్తున్నానని వీళ్ళకి ఎలా చెప్పాలని కార్తీక్ మనసులో అనుకుంటాడు. జ్యోత్స్న తన ఫోన్లో కార్తీక్ ఫోటో చూస్తూ ఉంటే కార్తీక్ వచ్చి ఫోన్ తీసుకుంటాడు. ఎప్పుడు వచ్చావ్ అంటుంది. టెన్ మినిట్స్ అయ్యిందని చెప్తాడు. దీంతో బుంగమూతి పెడుతుంది. అందరినీ పలకరించి నీ దగ్గరకి వస్తే బాగుంటుందని చెప్పి సోప్ వేస్తాడు. పార్టీ ఇవ్వవా అని అడుగుతాడు. రాత్రి మన ఇంట్లో పార్టీ జరిగింది నా ఫ్రెండ్ గౌతమ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. నేను ఒక్కటే చెప్పాను నాకు నా బావ ఉన్నాడు తనే నాకు కాబోయే భర్త అని చెప్పాను. వన్ అండ్ ఓన్లీ లైఫ్ వన్ అండ్ ఓన్లీ బావ. నేను కరెక్ట్ గానే చెప్పానా అని అంటుంది.

కొన్ని సార్లు సమాధానాలు కూడా ప్రశ్నలులాగా మిగిలిపోతాయని బాధగా చెప్తాడు. బావ అని కాకుండా భర్త అని చెప్పి ఉండాల్సిందని జ్యోత్స్న అంటుంది. నేను నిన్ను అని కార్తీక్ చెప్పబోతుంటే కాంచన పిలుస్తుంది. దీంతో తన మనసులో మాట కార్తీక్ చెప్పలేకపోతాడు. నువ్వు ఎప్పటికీ నాకు మరదలివే వేరే ఏ ఫిలింగ్స్ లేవని అనుకుంటాడు.

కార్తీక్ చేసిన తప్పు అదేనా?

దీప శౌర్య హైదరాబాద్ బయల్దేరతారు. ఎలాగైనా ఆయన్ని తీసుకుని ఇంటికి రావాలి, అసలు ఆయనకు నేను గుర్తు ఉన్నానో లేదోనని అనుకుంటుంది. కార్తీక్ దీప గొలుసు పట్టుకుని నాప్రాణాలు కాపాడిన నిన్ను ఎలా మర్చిపోతాను. కళ్ళు మూసుకుంటే నాకు ఎప్పటికీ గుర్తుకు వచ్చేది రెండే జ్ఞాపకాలు. ఒకటి నన్ను కాపాడిన నువ్వు, రెండు నన్ను క్షమించని దీప అనుకుంటాడు. అయితే ఆ గొలుసు దీపదే అనే విషయం కార్తీక్ కి తెలియదన్న మాట.

దీప నన్ను ఎప్పుడు క్షమిస్తుందో తెలియదు. అప్పుడే కారు యాక్సిడెంట్ జరిగింది చూపిస్తారు. ఆ సీన్ చూస్తే దీప తండ్రి కుబేర యాక్సిడెంట్ లో చనిపోయాడని తెలుస్తుంది. ఈ తప్పు నేను ఎప్పటికీ సరిదిద్దుకుంటానోనని అనుకుంటాడు. జ్యోత్స్న వచ్చి బయటకి వెళ్దామని చెప్పి కార్తీక్ చెయ్యి పట్టుకుని నడుస్తుంది. శివనారాయణ ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతాడు. పార్టీకి వెళ్తున్నామని చెప్తుంది. కొత్త రెస్టారెంట్ కి ఏం పేరు పెడుతున్నావని అంటే జ్యోత్స్న రెస్టారెంట్ అంటాడు. ఆ పేరు పెట్టింది అమ్మమ్మ కోసమని కార్తీక్ మనసులో అనుకుంటాడు. కార్తీక్, జ్యోత్స్నని పారిజాతం ఫోటో తీస్తూ మురిసిపోతుంది.

జ్యోత్స్నని పెళ్లి చేసుకొను

కార్తీక్ దగ్గరకి పారిజాతం వచ్చి ఫోటో చూపిస్తుంది. పెళ్ళికి ముందే నువ్వు నీ భార్యకి రెస్టారెంట్ గిఫ్ట్ గా ఇచ్చావ్ చూడు నువ్వు సూపర్ అంటుంది. నీకోక విషయం చెప్పాలి. జ్యోత్స్నని నేను పెళ్లి చేసుకోలేను. తన మీద నాకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పేసరికి పారిజాతం షాక్ అవుతుంది. జోక్ చేస్తున్నావా అంటే కాదు నిజమే చెప్తున్నా. తనని నేను మరదలిగా తప్ప భార్యగా చూడలేను అంటాడు. ఈ విషయం జ్యోత్స్నకి చెప్పావా అంటే చెప్పడానికే బయటకి తీసుకెళ్తున్నానని అంటాడు. వద్దు చెప్పకు నేనే చెప్తానని పారిజాతం అంటుంది. చిన్నప్పటి నుంచి నువ్వే భర్తగా బతుకుతుంది. నువ్వు ఈ విషయం చెప్తే బాధ తట్టుకోలేక బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోతుంది.

తనకి ఎలా తెలుస్తుందని అంటే నేను చెప్తానని మోసం చేస్తుంది. అంతవరకు నువ్వు ఏం తెలియనట్టే ఉండమని పారిజాతం కార్తీక్ ని విషయం చెప్పనివ్వకుండా ఆపుతుంది. దీంతో కార్తీక్ సరే అంటాడు. నా మనవరాలిని నీకు భార్యని చేసి ఆస్తి మొత్తం సొంతం చేసుకోవాలని అనుకుంటే ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అంటావా? ఇదే మాట నువ్వు కాంచనకి చెప్తే కొడుకు ఇష్టం కాదనలేక సరే అంటుంది. సుమిత్ర కూడా ఇష్టం లేని జంటని కలపాలని చూడదు. నేను ఇంత కష్టపడి బిడ్డల్ని మార్చింది ఇందుకేనా నువ్వు అనుకున్నది ఏది జరగనివ్వను. దాన్ని కాదని నీ జీవితంలోకి వేరే ఏ ఆడదాన్ని రానివ్వనని ఫిక్స్ అవుతుంది.

సిటీ వచ్చిన దీప

దీప హైదరాబాద్ చేరుకుంటారు. రోడ్డు మీద కార్లు, బిల్డింగ్ లు చూసి శౌర్య ఆనందపడుతుంది. కార్తీక్ ఏంటి ఇంత పెద్ద బాంబ్ వేశాడని పారిజాతం ఆలోచిస్తుంది. కార్తీక్ పారుని పక్కకి తీసుకెళ్ళి విషయం చెప్పావా అని అడుగుతాడు. బాధ్యత నీమీద పెట్టి వెళ్తున్నాను నాకు తన మీద అభిప్రాయం లేదని జ్యోత్స్నకి తెలియాలని అంటాడు. వెంటనే ఏదో ఒకటి చేయకపోతే పెద్ద ప్రమాదమే వచ్చేలా ఉందని పారిజాతం అనుకుంటుంది. శౌర్య నాన్న దగ్గరకి ఎప్పుడు వెళ్తామని దీపని అడుగుతుంది.

 

WhatsApp channel