Karthika deepam 2 march 30th: జ్యోత్స్నకి ప్రపోజ్ చేసిన గౌతమ్.. బెడిసికొట్టిన బంటు ప్లాన్, పారిజాతం కవరింగ్
Karthika deepam 2 serial march 30th episode: గౌతమ్ జ్యోత్స్నకి ప్రపోజ్ చేస్తాడు. కానీ తనకు పుట్టకముందే తన బావతో పెళ్లి అయిపోయిందని చెప్తుంది. ఇక పారిజాతాన్ని సంతోష పెట్టడం కోసం దొంగతనం చేసి సుమిత్రని ఇరికించాలని ట్రై చేస్తాడు. కానీ ఆ ప్లాన్ బెడిసికొడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

Karthika deepam 2 serial march 30th episode: మల్లేష్ అర్థరాత్రి టైమ్ దీప ఇంటికి వస్తాడు. మొగుడు లెక్క చూసుకోమంటే ఎవడితోనే కొట్టించాలని చూశావ్ నీ అంతు తేలుస్తానని అంటాడు. దీప ఇంట్లో మల్లేష్ భార్య కనకం ఉంటుంది. దీపకి మొగుడు అవుతావా అని లాగిపెట్టి ఒకటి పీకుతుంది. మొగుడిని చెప్పుతో కొట్టబోతుంటే దీప ఆపుతుంది. మగ తోడు లేని ఆడది తలుపులు తెరిచిన ఇల్లు లాంటిది. మంచి వాడైన చెడ్డ వాడైన మొగుడు మన పక్కన ఉంటేనే మంచిది. నరసింహ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని ఇంటికి తెచ్చుకోమని చెప్తుంది. మల్లేష్ ని తీసుకుని కనకం వెళ్ళిపోతుంది.
జ్యోత్స్నకి ప్రపోజ్ చేసిన గౌతమ్
పారిజాతం శివనారాయణ దగ్గరకు వచ్చి రెండు లక్షలు కావాలని డబ్బు అడుగుతుంది. ఇప్పుడే నువ్వు పెడుతున్న దుబారా ఖర్చు ఎంతని లెక్కపెడితే నెలకు మూడు లక్షలు దాటింది నువ్వు అడిగిన దాని బట్టి చూస్తే నువ్వే లక్ష నాకు తిరిగి ఇవ్వాలని అంటాడు. దీంతో బిత్తరపోతుంది. నచ్చింది తిని ఇంట్లో మూలన పడి ఉండు హక్కులు గిక్కులని మాట్లాడితే ఇంట్లో నుంచి గెంటేస్తానని కూల్ గా వార్నింగ్ ఇస్తాడు. డబ్బులు ఇవ్వలేదని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. బంటు వచ్చి పాతికవేలు కావాలని అడిగేసరికి పారిజాతం చెంప చెల్లుమనిపిస్తుంది. మిమ్మల్నే అంత మాట అంటాడా? వేసేయమంటారా అంటాడు. వద్దులే అంటుంది.
మిస్ హైదరాబాద్ గెలిచినందుకు పార్టీ ఏర్పాటు చేస్తారు. మూవీస్ లో ట్రై చేస్తావా అని జ్యోత్స్నని తన ఫ్రెండ్స్ అడుగుతారు. లేదు మా బావకి పెళ్ళాం కావడమే తన గోల్ అని చెప్తుంది. ఎప్పుడూ బావ అని తన జపం చేయడం తప్ప అసలు మీ బావ ఎక్కడని అంటారు. ఫుల్ బిజీ అంటే ఇది అబద్ధాలు చేపతుందని ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారు. అప్పుడే కార్తీక్ బొకే పట్టుకుని ఎంట్రీ ఇస్తాడు. కార్తీక్ ని అలాగే చూస్తూ ఉండిపోతుంది. బొకే ఇచ్చిన తర్వాత రింగ్ పట్టుకుని విల్ యు మ్యారీ మీ అని అడుగుతాడు. ఐయామ్ వెయిటింగ్ ఫర్ దిస్ బావ అంటుంది. బావ కాదు నేను గౌతమ్ అంటాడు. అప్పుడే జ్యోత్స్న ఊహలో నుంచి బయటకు వస్తుంది.
పుట్టకముందే నా బావతో పెళ్లి అయింది
నీతో పాటు చదువుకున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం అందుకే రింగ్ తీసుకుని పెళ్లి చేసుకోమని చెప్పడానికి వచ్చానని అంటాడు. సారి గౌతమ్ మా బావ కార్తీక్ అంటే నాకు ప్రాణం. నువ్వు ఎందురుగా ఉన్న నాకు మా బావ కనిపిస్తున్నాడు. నేను పుట్టకముందే నాకు మా బావతో పెళ్లి అయిపోయిందని చెప్తుంది. జ్యోత్స్న మాటలకు కుటుంబ సభ్యులందరూ సంతోషిస్తారు. కంగ్రాట్స్ చెప్పి గౌతమ్ వెళ్ళిపోతాడు. జ్యోత్స్న దిగాలుగా కూర్చుంటుంది. రింగ్ ఎందుకు తిరిగి ఇచ్చేశావ్ అది కాస్ట్లీ గా ఉందని పారిజాతం అంటుంది. రింగ్ తీసుకుంటే పెళ్లికి ఒప్పుకున్నట్టేనని సుమిత్ర సీరియస్ అవుతుంది. శివనారాయణ నాలుగు చీవాట్లు పెడతాడు.
పిల్లల మనసు చెడగొట్టకుండా ఉంటేనే మంచిదని సుమిత్ర పారిజాతాన్ని తిడుతుంది. తనకు అవమానం జరిగిందని తెగ బాధపడిపోతుంది. మీరు ఇలాగే ఉంటే సుమిత్ర మిమ్మల్ని ఉండనివ్వరు ఆవిడ విలువ తగ్గాలి మీ విలువ పెరగాలి. మీ రేంజ్ పెంచుతాను మీ పెదవుల మీద చిరునవ్వు చూడాలని బంటు అంటాడు. సుమిత్ర గట్టిగా పారిజాతాన్ని పిలిచి బంటు ఎక్కడని అడుగుతుంది. ఏమైందని అడిగితే చెప్పదు. తమ ప్లాన్ సక్సెస్ అయిందని తెగ సంతోషపడతాడు బంటు. అప్పుడే పారిజాతం ఫోన్ చేస్తుంది. బంటి రాగానే చెంప పగలగొడుతుంది. నన్ను మోసం చేస్తావా అంటూ తిడుతుంది. నా పేరు చెప్పి క్యాషియర్ మూడు లక్షలు తీసుకున్నాడు. విషయం చెప్పొద్దని చెప్పి లక్ష లంచం కూడా ఇచ్చాడని సుమిత్ర చెప్తుంది.
బెడిసికొట్టిన బంటు ప్లాన్
ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని సుమిత్ర తిడుతుంది. వాడు వెళ్లిపోతే తన పనులన్నీ ఎవరు చేస్తారని పారిజాతం టెన్షన్ పడుతుంది. సుమిత్ర కోపం తగ్గించడం కోసం కావాలని పారిజాతం బంటుని వాయించేస్తుంది. క్షమించమని కోడలు కాళ్ళు పట్టుకోమని చెప్తుంది. అవసరం లేదని సుమిత్ర అంటే చూశావా నా కోడలు ఎలా క్షమించిందో వెళ్ళి బుద్ధిగా పని చేసుకో అని కవర్ చేస్తుంది. ఒంటి మీద పడిన ప్రతి దెబ్బకు లెక్క చెప్తానని బంటు మనసులో కోపంతో రగిలిపోతాడు. నిన్ను తంతే వాడికి బుద్ధి వస్తుందని శివ నారాయణ తిట్టేసి వెళ్ళిపోతాడు.
దీప తండ్రి ఫోటో పట్టుకుని చూస్తూ ఎండుస్తుంది. తండ్రితో గడిపిన క్షణాలు తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. మల్లేష్ ఊరి పెద్దలని తీసుకుని దీప ఇంటికి వస్తాడు. ఇచ్చి ఆరేళ్లు అవుతుంది ఇంతవరకు డబ్బు కట్టలేదని మల్లేష్ గొడవ చేస్తాడు. అనసూయ వచ్చి ఏంటి జనాలు వచ్చారని అంటే మీ అబ్బాయి చేసిన అప్పుల కోసం వచ్చారని అంటుంది.
టాపిక్