Happy Father's Day 2023: కుటుంబ సభ్యుల్లో కీలకమైన వాడు, కుటుంబ పెద్దగా అన్నీ తానై తన ఇంటిని నడిపించేవాడు, తన కుటుంబ సంరక్షణ, పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడేవాడు ఎవారైనా ఉన్నారా అంటే అది నాన్నే. అలాంటి నాన్నను గౌరవించుకునేందుకు ఒక ప్రత్యేక సందర్భం ఫాదర్స్ డే. ప్రతీ ఏడాది జూన్ మూడవ ఆదివారం పితృ దినోత్సవంగా నిర్వహిస్తారు.
మన జీవితంలో మనం ఎంతగానో అభిమానించే, ప్రేమించే వ్యక్తికి, మనకు తన నిస్వార్థమైన ప్రేమను పంచుతూ కంటికి రెప్పలా కాపాడే నాన్న కోసం ఈ ఫాదర్స్ డేని మరింత ప్రత్యేకంగా చేయండి. ఈ సందర్భంగా ఆయనపై మీకు నచ్చిన విధంగా కృతజ్ఞత చూపండి, ఆయన కోసం మీ ప్రేమ కానుక ఏదైనా బహుమతిని ఇవ్వండి.
మీరు మీ నాన్న ముఖంలో చిరునవ్వు చూడాలనుకుంటే, మీ నాన్నకు ప్రేమతో ఇచ్చేందుకు ఇక్కడ కొన్ని అద్భుతమైన గిఫ్ట్ ఐడియాలు (Fathers day gift ideas) మీతో పంచుకుంటున్నాము. మీ నాన్నకు ఏం గిఫ్ట్ ఇవ్వాలో తెలియనపుడు చివరి నిమిషంలో మీకు ఈ ఉపాయాలు సహాయపడతాయి.
ఈరోజుల్లో స్మార్ట్‌వాచ్‌ను చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీ నాన్నకు మీకు అందుబాటులో ఉండే బడ్జెట్ ధరలో ఒక మంచి స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేసి బహుమతిగా ఇవ్వండి. ఇది వారి ఆరోగ్యాన్ని కాపాడుకోటానికి పలు విధాలుగా ఉపయోగపడుతుంది. నడక దూరం, ఇతర వ్యాయామాలతో కరిగించిన కేలరీలు, హృదయ స్పందన రేటు, పల్స్ రేటు, నిద్ర సమయం మొదలైన వాటిని లెక్కించవచ్చు. వారికి ఒకవేళ అధిక రక్తపోటు లేదా మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధి ఉన్నట్లయితే, RPM-ఆధారిత స్మార్ట్‌వాచ్‌ని ఇవ్వడం మరింత ప్రయోజనకరం.
చాలా మంది నాన్నలు ఎర్రబటన్, పచ్చ బటన్ కలిగిన ఫోన్ ఉపయోగిస్తారు. వారికి ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కొనివ్వవచ్చు. ఇందులో వారు తీరిక సమయాల్లో న్యూస్ చూడవచ్చు, ఆత్మీయులతో వీడియో కాల్ చేయవచ్చు, డాక్యుమెంట్స్ షేర్ చేయవచ్చు, ఇలా అనేక రకాలుగా వారికి ఉపయోగపడుతుంది.
మీ నాన్న రోజూ వ్యాయామం చేసే ఫిట్‌నెస్ ఔత్సాహికులు అయితే వారికి ఒక జత రన్నింగ్ షూస్ లేదా ట్రైనింగ్ షూలను కొనుగోలు చేసి ఇవ్వండి. ఇవి వారు సౌకర్యవంతంగా తమ వ్యాయామాన్ని కొనసాగించటానికి సహాయపడతాయి.
మీ తండ్రికి ఫార్మల్ షర్టులు ఇవ్వడం అనేది సొగసైన బహుమతి. ఫార్మల్ షర్ట్‌లు అనేవి టైమ్‌లెస్ క్లాసిక్‌లు, అవి ఎప్పడు ధరించినా స్టైల్‌గా ఉంటాయి, లేదా టీషర్టులు, కళ్లజోడు, టోపీ మొదలైన యాక్సెసరీలు కూడా బహుమతిగా ఇవ్వవచ్చు.
గ్రూమింగ్ కిట్ అనేది చాలా సాధారణ అవసరం. ట్రిమింగ్ చేసుకోవడానికి ట్రిమ్మర్, షేవింగ్ క్రీమ్, సన్ స్క్రీన్ లోషన్, పెర్ఫ్యూమ్, తలకు ఆయిల్, షాంపూలు ఇలాంటి వస్తువులను జత చేసి బహుమతిగా ఇవ్వండి.
మీరు ఇచ్చే బహుమతి ఖరీదైనదే ఉండాల్సిన అవసరం లేదు. అది వారికి ఎంతమేరకు సహయపడగలదో అది నిర్ధారించుకొని ఇవ్వండి. మీ తండ్రితో కలిసి ఆనందంగా ఫాదర్స్ డే జరుపుకోండి. హ్యాప్పీ ఫాదర్స్ డే!
సంబంధిత కథనం