Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. పారిజాతం సూటిపోటి మాటలు, ఇంట్లో నుంచి వెళ్ళకుండా దీపను అడ్డుకున్న కార్తీక్
Karthika deepam 2 serial april 9th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 9వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీపను ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలని తనని అవమానించేలా పారిజాతం మాట్లాడుతుంది. దీంతో వెళ్లిపోతున్న దీపను కార్తీక్ ఆపుతాడు.
Karthika deepam 2 serial april 9th episode: పారిజాతం దీప దగ్గరకి వచ్చి యోగక్షేమాలు అడుగుతున్నట్టు నటిస్తూ ఏ ఊరు మీది? అని అంటుంది. మాలాంటి పెద్దవాళ్ళ ఇంట్లో పని చేయడానికి వచ్చావా అంటుంది. లేదు అలా రాలేదని దీప చెప్తుంది. రెండు మూడు ఇల్లు వెతుక్కుంటూ తేరగా వచ్చి నచ్చింది తినొచ్చని అనుకుంటారు.
దీపను అవమానించిన పారిజాతం
ఆత్మాభిమానం కలిగిన మనిషి అయితే పరాయి పంచన ఉండటానికి అసలు ఒప్పుకోదు. అలా ఒప్పుకుంది అంటే అది తింగరిది అయినా అయి ఉండాలి లేదంటే మొగుడు వదిలేసినది అయి ఉండాలి. నిన్ను చూస్తుంటే తింగరిదానిలా అనిపించడం లేదు అంటే నిన్ను నీ మొగుడు వదిలేశాడా అని అవమానిస్తుంది.
తన కూతురు వింటే తప్పుగా అనుకుంటుందని కాస్త పద్ధతిగా మాట్లాడమని దీప అంటుంది. ఎక్కడపడితే అక్కడ ఉండిపోయే ఆడదాన్ని జనం ఇలాగే అంటారు. ఉండాలో ఏం చేయాలో నీకు తెలుసు ఇంకొక్కరితో చెప్పించుకునే రకం నువ్వు కాదని అనిపిస్తుంది. ఉండాలో వెళ్లాలో నీ ఇష్టం. గుడిలో సుమిత్రని కొట్టిన వాళ్ళని గుర్తు పట్టావని చెప్పారు వాడేనా వాడు మనుషులు ఇంకెవరైనా ఉన్నారా అంటూ కూపీ లాగడానికి చూస్తుంది.
ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకున్న దీప
ఇలాంటి వెధవ పనులు చేసే వాళ్ళు తోడు దొంగలుగా కలిసి తిరుగుతూ ఉంటారు. వాడిని గుర్తు పడతావా అని అడుగుతుంది. చూస్తే గుర్తు పడతానని చెప్తుంది. దీప శౌర్యని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే గేటుకు తాళం వేసి ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నామని శౌర్య అడుగుతుంది.
దీప గేటు తీయడం కార్తీక్ చూసి ఆపుతాడు. ఈ టైమ్ లో ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతాడు. ఎక్కడికి వెళ్తే మీకు ఎందుకని కోపంగా అంటుంది. మిమ్మల్ని చూస్తే తిరిగి రావడానికి వెళ్తున్నట్టు లేదు అందుకే అడుగుతున్నానని అంటాడు. ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతున్నానని చెప్తుంది.
కార్తీక్ మాట వినకుండా దీప వెళ్లిపోతుంటే అడ్డుపడతాడు. మీరు హైదరాబాద్ ఎందుకు వచ్చారని అడుగుతాడు. మా నాన్న కోసమని చెప్పి శౌర్య చెప్తుంది. జాతరలో సైకిల్ ఇచ్చారు, రోడ్డు మీద కారుతో డ్యాష్ ఇవ్వబోయారు. మళ్ళీ ఇంట్లో కనిపిస్తే మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని శౌర్య కార్తీక్ ని నిలదీస్తుంది.
అడ్డుకున్న కార్తీక్
కార్తీక్ చాలా బాధగా వాళ్ళని ఆగమని అంటాడు. మీరు ఎప్పటికీ మరచిపోలేని మంచి చేశారు అది చేశారు. ఇక పోగొట్టుకోవడానికి ఏం లేదు ప్రాణాలు తప్ప అని దీప అంటుంది. ఎంత చెప్పినా కూడా దీప మాత్రం వెళ్తానని పట్టుబడుతుంది.
అత్తతో చెప్పి వెళ్ళమని కార్తీక్ అంటాడు. కాసేపు దీప, కార్తీక్ మధ్య వాదన జరుగుతుంది. ఇద్దరూ గొడవ పడుతుంటే అమ్మా నాకు నిద్ర వస్తుంది మనం వెళ్తున్నామా లేదా అంటుంది. ఇంత రాత్రి వేళ వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ మీరు వెళ్లాలని అనుకుంటే అత్తతో చెప్పి వెళ్ళండి. రెండింటిలో ఏదో ఒకటి జరిగే వరకు కదలనని గేటుకు అడ్డంగా నిలబడతాడు.
దీప కార్తీక్ ని తిట్టి లోపలికి వెళ్ళిపోతుంది. శౌర్య ఇంటి ముందు ఉన్న పూలు చూస్తూ ఉంటే పారిజాతం వచ్చి తిడుతుంది. రాత్రి నేను అన్న మాటలకు దీప వెళ్ళి ఉండాలి, తనని వెళ్ళకుండా ఎవరు ఆపారని పారిజాతం అనుకుంటుంది. శౌర్య దగ్గరకు వచ్చి పూలు ఎందుకు కొస్తున్నావని కొట్టేందుకు చెయ్యి ఎత్తుతుంది.
పారిజాతాన్ని ఇరికించిన శౌర్య
కార్తీక్ చూసి వెంటనే తనని ఆపుతాడు. సరదా పడి నాలుగు పువ్వులు కోసుకుంటే ఏమవుతుందని కార్తీక్ శౌర్యని పూలు కోసుకోమని అంటాడు. పారిజాతం మాత్రం అందుకు ఒప్పుకోదు. ఈ ఊర్లో పూలు కోయడం కాదు చూస్తేనే ఇంత పెద్ద గొడవ జరుగుతుందా? ఇక ఈ ఊర్లోనే ఉండను వెంటనే అమ్మమ్మకి చెప్పేసి వెళ్లిపోతానని శౌర్య సుమిత్ర దగ్గరకు పరుగు తీస్తుంది.
నేను అమ్మ ఊరు వెళ్లిపోతాం, ఇక్కడ ఉండమని చెప్తుంది. పారిజాతం వచ్చి విషయం చెప్పకుండా చేసేందుకు చూస్తుంది. వెళ్ళి పూలు కోసుకో అని శౌర్యని పంపించడానికి చూస్తుంది. కానీ శౌర్య మాత్రం మీరు కొట్టబోయారని అంటుంది. వీళ్ళు నాకోసం వచ్చారు ఇందులో మీకేమైన ఇబ్బంది ఉంటే నాతో చెప్పండి అంతే కానీ పెద్దరికానికి ఉన్న గౌరవం పోగొట్టుకోవద్దని సుమిత్ర కూల్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.
బంటు కంగారు
బంటు కంగారుగా పారిజాతం దగ్గరకు వచ్చి గెస్ట్ లు వచ్చారని అంటాడు. ఎవరు అంటే పోలీసులు ఏదో ఎంక్వైరీ అంట అని చెప్తాడు. కాసేపు పారిజాతం బంటుని తిడుతుంది. పోలీసులు కొంతమంది వ్యక్తులను దీప ముందు నిలబెట్టి దాడి చేసిన వ్యక్తిని గుర్తు పట్టమని అడుగుతుంది.
దీప బంటు వైపు చూడటంతో పారిజాతం కంగారుపడుతుంది. ఈవిడ నన్ను గుడిలో చూసినట్టు ఉందని బంటు కంగారుపడతాడు. వీళ్ళు ఎవరూ కాదని దీప చెప్పేసరికి బంటు ఊపిరి పీల్చుకుంటాడు. వాడి మొహం నాకు బాగా గుర్తు ఉంది, ఎంతమందిలో ఉన్నా గుర్తు పడతానని దీప చెప్తుంది.
ఇదంతా చేసిన వెధవ ఎవరో తనకి తెలియాలని సుమిత్ర అంటుంది. దీప ఇక్కడ నుంచి వెళ్లిపోతానని ఎస్సైని అడుగుతుంది. తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా నిర్ణయం ఎలా తీసుకున్నావని సుమిత్ర అంటుంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి నువ్వే ఒకవేళ వెళ్లాలని అనుకుంటే అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళమని చెప్తుంది. అలాంటిది ఏమి అవసరం లేదని తను నా బాధ్యత అని సుమిత్ర చెప్తుంది.
టాపిక్