Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. పారిజాతాన్ని బెదిరించిన బంటు.. దీప కార్తీక్ ని అసహ్యించుకోవడానికి కారణం ఇదే-karthika deepam 2 serial april 8th episode deepa is angry after she spots karthik in sumithra house ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. పారిజాతాన్ని బెదిరించిన బంటు.. దీప కార్తీక్ ని అసహ్యించుకోవడానికి కారణం ఇదే

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. పారిజాతాన్ని బెదిరించిన బంటు.. దీప కార్తీక్ ని అసహ్యించుకోవడానికి కారణం ఇదే

Gunti Soundarya HT Telugu
Apr 08, 2024 07:19 AM IST

Karthika deepam 2 serial april 8th episode: కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. దీప ఇంట్లో ఉంటే తనని గుర్తు పట్టేస్తుందని వెంటనే ఇంట్లో నుంచి పంపించేయమని బంటు పారిజాతానికి చెప్తాడు. లేదంటే తనతో పాటు జైలుకి రావాల్సి వస్తుందని బెదిరిస్తాడు.

కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 8వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 8వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

Karthika deepam 2 serial april 8th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 8వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. తనతో ఆడుకోవడానికి ఎవరూ లేరని శౌర్య బుంగమూతి పెడుతుంది. దీంతో తమనే ఫ్రెండ్స్ అనుకోమని దశరథ వాళ్ళు చెప్తారు. అప్పుడే కార్తీక్ ఇంటికి వస్తాడు. జ్యోత్స్న ఉత్సాహంగా కార్తీక్ కి విషయం చెప్పబోతుంటే నాన్న చెప్పాడని చెప్తాడు. తను చాలా మంచిది ఒక్క మాట కూడా మాట్లాడదని పొగుడుతుంది.

కార్తీక్ ని చూసిన దీప

కార్తీక్ ని చూసి శౌర్య షాక్ అవుతుంది. జ్యోత్స్న కార్తీక్ ని దీపకి పరిచయం చేస్తుంది. కార్తీక్ ని చూసి దీప షాక్ అవుతుంది. కోపంగా మొహం పెట్టేస్తుంది. కార్తీక్ జరిగిన యాక్సిడెంట్ గుర్తు చేసుకుంటాడు. ఎందుకు ఇలా జరుగుతుంది కనిపిస్తేనే అసహ్యించుకునే ఆ మనిషి ఇంటికే రావడం ఏంటి? అతను నాకు కనిపించకుండా ఉండాలంటే నేను ఎక్కడికి వెళ్లాలని దీప ఆలోచిస్తూ ఉంటుంది.

జాతరలో కనిపించాడు, రోడ్డు మీద కనిపించాడు. ఇప్పుడు ఇంట్లో కూడా కనిపించాడు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడా? ఇది ఆ సర్ ఇల్లే కదా అని శౌర్య అంటుంది. సర్ మూడు సార్లు కనిపించారు కదా మరి నాన్న ఒక్కసారి కూడా కనిపించలేదు ఏంటి? నీకు ఇంత పెద్ద దెబ్బ తగిలితే చూడటానికి రాలేదు ఏంటి? ఏమ్మా నీకు కూడా నాన్న ఎలా ఉంటాడో తెలియదా అనేసరికి దీప కుమిలికుమిలి ఏడుస్తుంది.

దీపకు నిజం చెప్పాలనుకున్న కార్తీక్

కంటికి ఆ మనిషి కనిపించనంత దూరంగా పోయేవరకు ఈ బాధ తప్పదని దీప అనుకుంటుంది. కార్తీక్ దీప గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పటికే జరిగిన దానికి సగం చచ్చిపోతుంటే నువ్వు చూసిన చూపు ఎలా ఉందో తెలుసా? నువ్వు మా నాన్నని చంపేశావ్ కానీ నేను మీ అత్తని కాపాడాను. మనిషి అంటే ఇలా ఉండాలని చెంప దెబ్బ కొట్టి నిలదీసినట్టు ఉందని బాధపడాలి.

నా మీద నీకు ద్వేషం పోవాలంటే ఆరోజు ఏం జరిగిందో నీకు తెలియాలి. నిన్ను ఇంటికి తీసుకొచ్చి దేవుడే నాకు అవకాశం ఇచ్చాడు. నువ్వు వెళ్ళే లోపు నీకు నిజం చెప్పాలి. కానీ నేను చెప్పేది నిజమని నువ్వు నమ్ముతావా అని అనుకుంటాడు. దీప ఇంటి బయట బాధగా కూర్చుని ఉంటే సుమిత్ర వాళ్ళ కోసం పండ్లు తీసుకుని వస్తుంది.

నీ కన్నీళ్ళ వెనుక కథ ఏంటి?

సుమిత్ర శౌర్య, దీప వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటుంది. నీ వివరాలు అడుగుతుంటే కష్టాల్లో ఉన్న ఆడదాన్ని అన్నావ్. కానీ నిన్ను చూస్తుంటే కష్టాల్లో ఉన్న ఆడదానిలా కాదు కష్టాలు పడుతున్న ఆడదానిలా ఉన్నావ్ ఏం జరిగిందో చెప్పమని సుమిత్ర చాలా ప్రేమగా అడుగుతుంది.

నీ తలకి తగిలిన గాయం కంటే నీ మనసుకి తగిలిన గాయం పెద్దగా కనిపిస్తుంది. ఏం జరిగిందని మరోసారి అడుగుతుంది. నీ కన్నీళ్ళ వెనుక ఉన్న కథ ఏంటి? అమ్మానాన్న ఎక్కడ ఉంటారని అడుగుతుంది. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న యాక్సిడెంట్ లో చనిపోయాడు. కళ్ళు మూసుకుపోయి కారు నడుపుతూ నా కళ్ళ ముందే నాన్నని చంపేశాడని చెప్తుంది.

భర్త గురించి చెప్పలేక అల్లాడిన దీప

ఎవడు వాడని సుమిత్ర ఆవేశంగా అడుగుతుంది. ఎవడు అయితే ఏముందని అంటుంది. భర్తతో ఏదైనా సమస్యా? మీ ఆయన ఎక్కడ ఉంటాడు? ఏం చేస్తాడని సుమిత్ర అడుగుతుంది. దీప నరసింహ మాటలు తలుచుకుంటూ ఏడుస్తుంది. నన్ను ఏమి అడగొద్దు, రెండు రోజులు ఉండి పోవాల్సిన దాన్ని ఇవన్నీ ఎందుకని దీప అంటుంది.

భర్త గురించి అడుగుతుంటే దీప చెప్పకుండా ఉంటుంది. బంటు దీపని చూసి ఆశ్చర్యపోతాడు. తల్లిలా అడుగుతున్నానని అంటుంది. కానీ దీప మాత్రం విషయం చెప్పదు. కన్నతల్లిలాంటి ప్రేమని మీరు చూపిస్తున్న నా బాధలు మీతో చెప్పుకోలేను నన్ను క్షమించండి అని మనసులోనే దీప బాధపడుతుంది.

పారిజాతాన్ని బెదిరించిన బంటు

బంటు వచ్చి పారిజాతం కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాడు. ఏం చేసి చచ్చావ్ అని అంటుంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇంట్లోకి వస్తూ దీప, సుమిత్ర మాట్లాడుకోవడం చూశానని చెప్తుంది. గుడి దగ్గర ఆమె నన్ను చూసిందని చెప్పడంతో పారిజాతం గుండె ఆగినంత పనైపోతుంది.

సరిగా చెప్పి చావు ఏం జరిగిందోనని తెగ టెన్షన్ పడుతుంది. చూసిందో లేదో కరెక్ట్ గా తెలియదు. నేను దొరికిపోతే మీరు దొరికిపోతారు. బతికినంత కాలం మా నాన్న మీకు సేవ చేశాడు. నేను అలాగే చేస్తున్నా. అలాంటి నాకు మీరు ఈ చిన్న సాయం చేయలేరా అంటాడు. తను ఉంటే నన్ను గుర్తు పడుతుంది లేకపోతే గుర్తు పట్టదు కదా అనేసరికి పారిజాతం ఆలోచనలో పడుతుంది. తను ఉంటే మీరు నాతో పాటు జైలుకు వస్తారని చెప్పి బెదిరించిపోతాడు.

దీప ఇక్కడే ఉంటే నాకు ఎప్పటికైనా ప్రమాదమని పారిజాతం భయపడిపోతుంది. అమ్మమ్మ వాళ్ళు చాలా మంచిది కదాని శౌర్య అంటుంది. ఇంటికి ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని వెళ్లాలని నరసింహని దీప తిట్టుకుంటుంది.

IPL_Entry_Point