Karthika deepam today episode: కార్తీక దీపం 2 సీరియల్.. సుమిత్ర మీద అటాక్, కాపాడిన దీప-karthika deepam 2 serial april 5th episode deepa take risk to save sumitra from bantu attack ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam Today Episode: కార్తీక దీపం 2 సీరియల్.. సుమిత్ర మీద అటాక్, కాపాడిన దీప

Karthika deepam today episode: కార్తీక దీపం 2 సీరియల్.. సుమిత్ర మీద అటాక్, కాపాడిన దీప

Gunti Soundarya HT Telugu
Apr 05, 2024 08:34 AM IST

Karthika deepam 2 serial april 5th episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు (ఏప్రిల్5) ఎపిసోడ్‌ విశేషాలు ఇవే. సుమిత్ర మీద బంటు దాడి చేయిస్తాడు. అయితే ఆ ప్రమాదం నుంచి సుమిత్రని దీప కాపాడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 5వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 5వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

సుమిత్ర దీపని ఆప్యాయంగా పలకరిస్తుంది. వాళ్ళకి తనే దగ్గరుండి మరీ వడ్డిస్తుంది. శౌర్యని నీ పేరు ఏంటే అమ్మమ్మ అంటుంది. నా పేరు అమ్మమ్మ కాదు శౌర్య అంటుంది. నువ్వు అమ్మమ్మ కాకపోతే నేను అమ్మమ్మ అంటుంది.

సుమిత్రని కాపాడిన దీప 

బంటు సుమిత్ర మీద అటాక్ చేసేందుకు గుడికి వస్తాడు. శౌర్య అన్నం తింటుంటే పొలమారుతుంది. సుమిత్ర గబగబా వాళ్ళ దగ్గరకు వస్తుంది. బంటు చాటుగా సుమిత్రను గమనిస్తూ ఉంటాడు. ఒక రౌడీకి సైగ చేసి సుమిత్ర మీద అటాక్ చేయమని చెప్తాడు. అతడు సుమిత్ర వైపు రావడం దీప చూస్తుంది. రాడ్డు తీసి సుమిత్రను కొట్టబోతుంటే దీప ఆమెని పక్కకి జరపడంతో దెబ్బ తనకి తగులుతుంది.

తన ప్లాన్ ఫెయిల్ అయ్యిందని బంటు పారిపోతాడు. దీప స్పృహ తప్పి పడిపోతుంది. సుమిత్ర చాలా కంగారుపడుతుంది. మిమ్మల్ని రక్షించడం కోసం తను గాయపడిందని పూజారి అంటాడు. పారిజాతం బంటు చెంప పగలగొడుతుంది. ఎవరిని అడిగి చేశావని అడుగుతుంది. మీ పెదవుల మీద నవ్వు కోసం చేశానని అంటాడు.

పారిజాతాన్ని బెదిరించిన బంటు

ఇప్పుడు కొట్టిన వాడు దొరికితే నువ్వు జైలుకు వెళ్తావని తిడుతుంది. ఇంట్లో బంటు ఉంటే మీరు ఉంటారు జైలుకు వెళ్తే నాతో పాటు మీరు జైలుకు పోతారని అనేసరికి పారిజాతం బిత్తరపోతుంది. కేసులో నేను ఇరుక్కుంటే మిమ్మల్ని ఇరికిస్తానని చెప్పి బెదిరిస్తాడు. దశరథ సుమిత్ర మీద జరిగిన దాడి గురించి ఇంట్లో వాళ్ళకి చెప్తాడు.

జ్యోత్స్న కంగారుగా అమ్మకి ఎలా ఉందని అంటుంది. ప్రమాదం జరిగింది కానీ ఒకరు సేవ్ చేశారని చెప్తాడు. సేవ్ చేసిన వాళ్ళకి గాయం అయ్యిందని అంటాడు. పారిజాతం వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తుంది. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని శివనారాయణ అనేసరికి పారిజాతం టెన్షన్ పడుతుంది.

జ్యోత్స్న తండ్రితో కలిసి సుమిత్ర దగ్గరకు వెళ్తుంది. కార్తీక్ దీప గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దీపని జ్యోత్స్న అక్క అని పిలుస్తుంది. దీప కళ్ళు తెరవడంతో సుమిత్ర ఊపిరి పీల్చుకుంటుంది. నువ్వు ఎవరో కానీ మా అమ్మని కాపాడి మమ్మల్ని అందరినీ బతికించావు. నీ ప్లేస్ లో నేను ఉంటే నీలాగా కాపాడే దాన్నో లేదో కన్నబిడ్డలాగా మా అమ్మని కాపాడావని అంటుంది.

దీపక్క అంటూ పిలిచిన జ్యోత్స్న 

దీప శౌర్య కోసం వెతుకుతుంది. దశరథ వెళ్ళి శౌర్యని తీసుకొస్తాడు. అమ్మా ఏమైందని శౌర్య చాలా ఏడుస్తుంది. సుమిత్ర వాళ్ళు తనని ఓదార్చడానికి చూస్తారు. పువ్వుల కోసం వస్తే వాళ్ళు తిట్టారు, రోడ్డు మీద అంకుల్ కారుతో గుద్దబోయాడు. పూజ దగ్గర అక్కడ కొట్టబోయారు. ఈ ఊరు మంచిది కాదు నాకు భయంగా ఉంది ఇంటికి వెళ్లిపోదామని అంటుంది.

దీప అనసూయ డబ్బుతోనే తిరిగి రావాలని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. తనకేం కాలేదని కూతురికి సర్ది చెప్తుంది. పోలీసులు వచ్చి దీపని ఎంక్వైరీ చేస్తారు. కొట్టిన వాడిని గుర్తు పడతావా అంటే పడతానని చెప్తుంది. సుమిత్ర గురించి పోలీసులు చెప్తారు. వాళ్ళు చాలా సంపన్నులు వందల కోట్లు ఆస్తులు ఉన్నాయని ఎస్సై చెప్తుంది. అతన్ని గుర్తు పట్టాల్సింది నువ్వే కాబట్టి మాకు అందుబాటులో ఉండాలని ఎస్సై చెప్తుంది.

తల్లిదండ్రుల చెంతకు చేరిన దీప 

అటాక్ చేసిన వాళ్ళ కోసం స్టేషన్ కి రావాలని దీపకు షెల్టర్ ఇస్తానని ఎస్సై అంటుంది. కానీ జ్యోత్స్న మాత్రం మా అమ్మ ప్రాణాలు కాపాడిన దానివి నువ్వు మా ఇంట్లోనే ఉండాలని చెప్తుంది. నీ భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పమని సుమిత్ర అంటుంది. దీప మౌనంగా ఉంటున్నది. మీ ఇంట్లో ఎవరో ఒకరికి ఫోన్ చేయమని అంటే దీప మౌనంగా కన్నీళ్ళు పెట్టుకుంటుంది.

నేను కష్టంలో ఉన్న ఆడదాన్ని ఎవరితోనూ ఏమి చెప్పుకోలేనని ఏడుస్తుంది. దీప పరిస్థితిని సుమిత్ర అర్థం చేసుకుంటుంది. అమ్మా దీప అని దశరథ ప్రేమగా పిలిచేసరికి తనకి తండ్రి కుబేర గుర్తుకు వస్తాడు. నువ్వు దాడి చేసిన వాడివి గుర్తు పడతావ్ కాబట్టి వాడు నిన్ను ఏమైనా చేయవచ్చు అందుకే మా ఇంట్లోనే ఉండమని దశరథ చెప్తాడు. నువ్వు కూడా నా కూతురువే అంటాడు.

శౌర్య వాళ్ళ మాటలు విని భయపడుతుంది. మనం పారిపోదామని ఏడుస్తుంది. మన ఇంటికి పోదాం అక్కడ మీ జోలికి ఎవరూ రారని సుమిత్ర చెప్తుంది. శౌర్య సుమిత్రని అమ్మమ్మ అని పిలుస్తుంది. ఎలాగైతేనే దీప తల్లి ఇంటికి చేరుతుంది. ఇంతటితో కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

కార్తీక దీపం 2 సీరియల్ అన్ని ఎపిసోడ్లు ఇక్కడ చూడండి.

టీ20 వరల్డ్ కప్ 2024