రణ్‌బీర్ రామాయణంలో దశరథుడిగా నాటి రాముడు అరుణ్ గోవిల్-bollywood news arun govil as dasharatha in ranbirs ramayana movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  రణ్‌బీర్ రామాయణంలో దశరథుడిగా నాటి రాముడు అరుణ్ గోవిల్

రణ్‌బీర్ రామాయణంలో దశరథుడిగా నాటి రాముడు అరుణ్ గోవిల్

HT Telugu Desk HT Telugu
Feb 14, 2024 10:13 AM IST

అరుణ్ గోవిల్ టీవీలో రాముడి పాత్ర పోషించినప్పటి నుంచి రాముడిగా ప్రేక్షకుల హృదయాల్లో స్థిరపడ్డారు. అయితే ఇప్పుడు రామాయణం సినిమాలో రాముడిగా కాకుండా రాముడి తండ్రిగా నటించబోతున్నారు.

arun govil and ranbir kapoor ramayana
arun govil and ranbir kapoor ramayana

నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణం సినిమా గత ఏడాది నుంచి వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమా స్టార్ కాస్ట్ గురించి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ వస్తూనే ఉండటం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. రామాయణంలో అనేక ముఖ్యమైన పాత్రలు ఉండటంతో ఈ సినిమాలో కూడా అంతే సంఖ్యలో నటీనటులు నటిస్తారని స్పష్టమవుతోంది.

రామానంద్ సాగర్ రామాయణంలో రాముడిగా అందరి హృదయాలను గెలుచుకున్న అరుణ్ గోవిల్ కూడా ఇప్పుడు నితేష్ సినిమాలో భాగం అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. అరుణ్ దశరథ మహారాజుగా నటించనున్నట్టు సమాచారం.

రామాయణం సినిమాలో రాముడి తండ్రి దశరథుడి పాత్రలో నటించేందుకు అరుణ్‌కు ఆఫర్ వచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియదు కానీ అరుణ్ కానీ, మేకర్స్ కానీ దీనిపై ఎలాంటి కన్ఫర్మ్ స్టేట్మెంట్ ఇవ్వలేదు.

మిగిలిన పాత్రలు..

ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్ బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటించనున్నారని తెలుస్తోంది. కేజీఎఫ్ స్టార్ యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నట్లు సమాచారం. కైకేయిగా లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా, బాబీ డియోల్ కుంభకర్ణుడిగా నటిస్తున్నారు.

మరి ప్రస్తుతానికి స్టార్ కాస్ట్ గురించి, సినిమా గురించి నితేష్ తివారీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది కాబట్టి నితేష్ ఎప్పుడు ప్రకటన చేస్తాడో చూడాలి. అయితే కొద్ది రోజుల క్రితం రణ్‌బీర్ లుక్ ను పరీక్షించారని, అందులో రామ్ పాత్రకు రణబీర్ ఎలా సరిపోతాడో చూశారని వార్తలు వచ్చాయి.

ఇప్పటి వరకు భారీ గడ్డంతో ఉన్న రణ్ బీర్ ఇప్పుడు క్లీన్ షేవ్ లుక్ లో కనిపిస్తున్నాడు. అంతేకాదు తన బాడీపై వర్క్ చేస్తూ డైలాగులు ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆస్కార్ విన్నింగ్ వీఎఫ్ఎక్స్ సంస్థ డెనెగ్ ఈ సినిమా వీఎఫ్ఎక్స్ సృష్టిస్తోందని సమాచారం.

WhatsApp channel