Ranbir Kapoor: హైదరాబాద్ అంటే చాలా ఇష్టం.. తెలుగు రాష్ట్రాల దత్త పుత్రుడిని కావాలని అనుకుంటున్నాను: రణ్‌బీర్ కపూర్-ranbir kapoor says he loves hyderabad so much wanted to be adapted son of telugu states ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ranbir Kapoor Says He Loves Hyderabad So Much Wanted To Be Adapted Son Of Telugu States

Ranbir Kapoor: హైదరాబాద్ అంటే చాలా ఇష్టం.. తెలుగు రాష్ట్రాల దత్త పుత్రుడిని కావాలని అనుకుంటున్నాను: రణ్‌బీర్ కపూర్

Hari Prasad S HT Telugu
Nov 27, 2023 07:25 PM IST

Ranbir Kapoor: హైదరాబాద్ అంటే చాలా ఇష్టం అని అన్నాడు బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్. తాను తెలుగు రాష్ట్రాల దత్త పుత్రుడిని కావాలని అనుకుంటున్నట్లు కూడా అతడు చెప్పడం విశేషం.

యానిమల్ హైదరాబాద్ ప్రెస్ మీట్ లో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా
యానిమల్ హైదరాబాద్ ప్రెస్ మీట్ లో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా

Ranbir Kapoor: బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ తన నెక్ట్స్ మూవీ యానిమల్ (Animal) హైదరాబాద్ ప్రమోషన్లలో భాగంగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాను తెలుగు రాష్ట్రాల దత్త పుత్రుడిని కావాలని అనుకుంటున్నానని, తనను ఆశీర్వదించాలని కోరాడు. హైదరాబాద్ అంటే చాలా ఇష్టమని, తన తొలి ఆటోగ్రాఫ్ ఇక్కడే ఇచ్చినట్లు అతడు చెప్పడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా కలిసి నటించిన యానిమల్ మూవీ శుక్రవారం (డిసెంబర్ 1) రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం (నవంబర్ 27) హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దానికి ముందు రణ్‌బీర్, ఇతర మూవీ టీమ్ మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా రణ్‌బీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

హైదరాబాద్ అంటే చాలా ఇష్టం

"నాకు హైదరాబాద్ రావడం అంటే చాలా ఇష్టం. నా తొలి ఆటోగ్రాఫ్ ఇక్కడే ఇచ్చాను. సావరియా మూవీ తర్వాత సోనమ్, నేను ఇక్కడికి వచ్చాం. నేను నిజంగా తెలుగు రాష్ట్రాల దత్త పుత్రుడిని కావాలని అనుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించండి" అని రణ్‌బీర్ అన్నాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న అనిల్ కపూర్ జోక్యం చేసుకుంటూ.. ఇక నుంచి నిన్ను ఆర్కే రావ్ అని పిలుస్తారు అని జోక్ చేయడం విశేషం.

నిజానికి యానిమల్ మూవీలో తెలుగు డబ్బింగ్ కూడా తానే చెప్పాలని అనుకున్నానని, కానీ తన యాస డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు నచ్చలేదని రణ్‌బీర్ చెప్పాడు. యానిమల్ మూవీలో అతడు తన లవర్ బాయ్ క్యారెక్టర్లకు భిన్నంగా చాలా వయోలెంట్ పాత్ర పోషించాడు. తన కుటుంబం క్షేమంగా ఉండటానికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండే పాత్ర తనదని రణ్‌బీర్ అన్నాడు.

ఈ ప్రెస్ మీట్ లో రణ్‌బీర్, రష్మికతోపాటు అనిల్ కపూర్, బాబీ డియోల్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీప్ ఫేక్ వీడియోలపై రష్మిక స్పందించింది. తనపై వచ్చిన డీప్ ఫేక్ వీడియోపై అన్ని ఇండస్ట్రీల వాళ్లు స్పందించి తనకు మద్దతు తెలపడం సంతోషంగా ఉందని ఆమె చెప్పింది. ఇక బాబీ డియోల్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో తనది మూగ పాత్రనా కాదా అని ఇప్పుడే చెప్పలేనని అన్నాడు.

బాపుకి రుణపడి ఉంటా: అనిల్ కపూర్

ఈ సందర్భంగా అనిల్ కపూర్ మాట్లాడుతూ.. తాను తొలిసారి నటించింది ఓ తెలుగు సినిమాలో అని, దాని డైరెక్టర్ బాపుకి తానెప్పుడూ రుణపడి ఉంటానని చెప్పడం విశేషం. బాపు డైరెక్షన్ లో వచ్చిన వంశ వృక్షం సినిమాలో అనిల్ కపూర్ నటించాడు. "బాపుకి నేను రుణపడి ఉంటాను. అప్పుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నాకు డబ్బింగ్ చెప్పారు. అతన్ని కూడా నేను మిస్ అవుతున్నాను. కే విశ్వనాథ్ తో కలిసి నటించే అదృష్టం కూడా నాకు దక్కింది. ఇప్పుడు వంగాతో కలిసి పని చేయడం గొప్పగా ఉంది" అని అనిల్ కపూర్ అన్నాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.