Rashmika in Family Star: విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’లో రష్మిక!: వివరాలివే
Rashmika in Family Star: ఫ్యామిలీ స్టార్ చిత్రంలో రష్మిక మందన్న ఓ ప్రత్యేక పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్‍లోనూ ఆమె పాల్గొన్నారని సమాచారం. ఆ వివరాలివే.
Rashmika in Family Star: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'ఫ్యామిలీ స్టార్' సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. పరుశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గీతగోవిందం తర్వాత విజయ్ - పరశురామ్ కాంబినేషన్ ఫ్యామిలీ స్టార్ మూవీతో మరోసారి రిపీట్ అవుతోంది. దీంతో ఈ చిత్రంపై మంచి క్రేజ్ ఉంది. గ్లింప్స్ కూడా ఆకట్టుకుంది. కాగా, ఫ్యామిలీ స్టార్ మూవీ గురించి తాజాగా ఓ విషయం చక్కర్లు కొడుతోంది.
ఫ్యామిలీ స్టార్ సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా నటిస్తున్నారని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. ఈ చిత్రంలో ఓ స్పెషల్ రోల్‍లో ఆమె కనిపిస్తారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. షూటింగ్ స్పాట్ నుంచి ఈ మూవీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఓ ఫొటోను ఇన్‍స్టాగ్రామ్ స్టోరీగా పోస్ట్ చేశారు. ఫ్యామిలీ స్టార్ నైట్ షూట్ అంటూ రాసుకొచ్చారు. అయితే, రష్మిక మందన్న కూడా అదే షూటింగ్ లొకేషన్‍కు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశారు. “ఢిల్లీ నైట్ షూట్‍కు అవసరమైనవి. సమ్‍థింగ్ స్పెషల్ షూటింగ్ జరుగుతోంది. త్వరలో చెబుతా” అని రష్మిక తన ఇన్‍స్టాగ్రామ్ స్టోరీకి క్యాప్షన్ రాశారు.
దీంతో ఫ్యామిలీ స్టార్ మూవీలో రష్మిక నటిస్తున్నారని దాదాపు ఖరారైంది. అయితే, ఆమె ఈ చిత్రంలో క్యామియో రోల్ చేయనున్నారా.. లేకపోతే స్పెషల్ సాంగ్‍లో చిందేయనున్నారా అన్నది తెలియాల్సి ఉంది.
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని దిల్‍రాజు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని ముందుగా మూవీ యూనిట్ నిర్ణయించింది. అయితే, వాయిదా పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వచ్చే ఏడాది వేసవికి ఫ్యామిలీ స్టార్ మూవీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని రూమర్లు చాలాకాలం నుంచి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే వీరిద్దరూ జోడీగా గోతగీవిందం, డియర్ కామ్రెడ్ చిత్రాల్లో నటించారు. ఇటీవల దీపావళి పండుగను కూడా విజయ్ ఇంట్లోనే రష్మిక సెలెబ్రేట్ చేసుకున్నారన్న రూమర్స్ కూడా వచ్చాయి.