Brahmamudi March 16th Episode: బ్రహ్మముడి.. కావ్య విడాకుల ప్లాన్ ఫెయిల్.. బెడిసికొట్టిన అమ్మమ్మ స్కెచ్.. అనామికకు సమస్య-brahmamudi serial march 16th episode kavya divorce plan fail and anamika in big trouble brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi March 16th Episode: బ్రహ్మముడి.. కావ్య విడాకుల ప్లాన్ ఫెయిల్.. బెడిసికొట్టిన అమ్మమ్మ స్కెచ్.. అనామికకు సమస్య

Brahmamudi March 16th Episode: బ్రహ్మముడి.. కావ్య విడాకుల ప్లాన్ ఫెయిల్.. బెడిసికొట్టిన అమ్మమ్మ స్కెచ్.. అనామికకు సమస్య

Sanjiv Kumar HT Telugu
Apr 03, 2024 11:09 AM IST

Brahmamudi Serial March 16th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 16వ తేది ఎపిసోడ్‌లో కావ్య విడాకుల పైపర్స్‌పై సంతకం చేసి ఇవ్వడంతో అయోమయంలో ఉండిపోతాడు రాజ్. దాంతో రాజ్‌ను తిట్టిన శ్వేత సలహా ఇస్తుంది. మరోవైపు అనామికకు పెద్ద సమస్య వస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మార్చి 16వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మార్చి 16వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో విడాకులపై సంతకం చేసి డివోర్స్ పేపర్స్ రాజ్‌కు ఇస్తుంది కావ్య. ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పండి. వాళ్లకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా అమ్మనాన్నకు నేను చెప్పాలి. ఎందుకంటే నా సైడ్ నుంచి ఎలాంటి తప్పు ఉండదు కదా. మీరే విడాకులు కావాలనుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమ నా దగ్గర ఉంది. మీకు లేదు. ఈ విషయం స్పష్టంగా అందరికీ చెప్పాల్సిన అవసరం ఉందని కావ్య అంటుంది.

కుమిలిపోయిన కావ్య

మీరు మారుతారని ఇంతవరకు వేచి చూశాను. కానీ ఆ నమ్మకం ఇప్పుడు లేదు. మీ నిర్ణయం సాయంత్రంలోపు చెప్పమని విడాకుల పేపర్స్ ఇచ్చేసి ఏడుస్తూ వెళ్లిపోతుంది కావ్య. అక్కడే గది బయట గోడకు నిలబడి నరాలు తెగిపోయేలా ఉన్నాయి. ఆస్తి అడిగితే అవలీలగా ఇచ్చే ఆ వ్యక్తిత్వం ప్రేమ అడిగితే ఎందుకు నిరాకరిస్తుంది అని తానే లోపల కుమిలిపోతుంది కావ్య. మరోవైపు షాక్‌లో రాజ్ ఉంటాడు. ఏం అర్థంకాక సైలెంట్‌గా ఉంటాడు.

రాజ్ అంతరాత్మ బయటకు వచ్చి శభాష్‌.. రా.. మొత్తానికి నువ్ అనుకున్నది చేశావ్. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే భార్యను విడిచిపెట్టి పోయేలా చేశావ్. ఇంకేంటి సంతకం పెట్టు. నీ సంతోషం నీ చేతుల్లోనే ఉంది. పెట్టు సంతకం పెట్టు అని అంతరాత్మ అరుస్తుంటే.. రాజ్ కోపంగా విడాకులు విసిరేస్తాడు. ఆవేశంతో ఊగిపోతాడు. కిందకు దిగిన కావ్యను రాజ్ ఏమన్నాడు అని ఇందిరాదేవి అడుగుతుంది. సైలెంట్‌గా ఉండిపోయారు అని కావ్య అంటే.. దిమ్మ తిరిగి మైండ్ బొద్దిబారి ఉంటుంది వెధవకి అని ఇందిరాదేవి అంటుంది.

రాత్రికి కన్నం వేద్దామని

నాకు భయంగా ఉందని కావ్య అంటే వెళ్లి తీరిగ్గా భయపడి రా. ఈ దెబ్బకి వాడు దిగి రావాల్సిందే అని ఇందిరాదేవి అంటుంది. అదంతా రుద్రాణి గమనిస్తుంటుంది. ఇంతలో రాజ్ వస్తుంటే అక్కడి నుంచి వెళ్లి డైనింగ్ టేబుల్‌ దగ్గరకు వెళ్తారు. ఏంటీ అమ్మ మనవరాలితో చర్చలు జరుపుతున్నావని రుద్రాణి అడిగితే.. బాగా డబ్బు ఉన్న బ్యాంక్ ఏంటో అడుగుతున్నా. రాత్రికి కన్నం వేద్దామని. నీకు అన్ని కావాలి అని ఇందిరాదేవి అంటుంది. రాజ్ బయటకు వెళ్తుంటే వచ్చి తినమని అపర్ణ అంటుంది.

దాంతో రాజ్ వచ్చి కూర్చుంటాడు. కావ్య వడ్డించు అని ఇందిరాదేవి అంటుంది. దాంతో కావ్య వడ్డిస్తుంది. ఏంటీ రాజ్ అదోలా ఉన్నావ్. తలనొప్పా అని ఇందిరాదేవి అంటుంది. అవును, నానమ్మ అని రాజ్ అంటే.. తలనొప్పి ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పిన ఇందిరాదేవి ఏంటో ఈ మధ్య కొన్ని తలనొప్పులు సాయంత్రం వరకు తగ్గట్లేదు అంటుంది. దాంతో కావ్య అన్న విషయం గుర్తుకు తెచ్చుకుంటాడు రాజ్. తర్వాత సాలరీలు నిన్నే వేయాలి. ఇవాళ అయినా వేయు. ఫస్ట్ డేకి సాలరీలు పడిపోవాలి. ఆ రూల్ బ్రేక్ చేయకు అని సుభాష్ అంటాడు.

చాలా సీరియస్‌గా

సరే డాడ్ అని రాజ్ అంటాడు. సాయంత్రం వేయు రాజ్ అని రుద్రాణి కౌంటర్స్ వేస్తుంది. ఏమైంది రాజ్. తలనొప్పి ఉంటే బుర్ర కూడా పని చేయట్లేదా. నీకు ఇడ్లీ అంటే ఇష్టం లేదు. అయినా తింటున్నావ్. కావ్య కూడా వడ్డిస్తుంది అని రుద్రాణి అంటుంది. దాంతో రాజ్‌కు ఏమైందని అంతా షాక్ అవుతారు. కావ్య వేరే టిఫిన్ వడ్డిస్తానని చెబితే.. అక్కర్లేదు. నా బ్రేక్ ఫాస్ట్ అయిపోయిందని వెళ్లిపోతాడు రాజ్. తర్వాత రాజ్ చాలా సీరియస్‌గా ఉన్నాడు. అసలు ఏం జరిగింది అని ఇందిరాదేవి అడుగుతుంది.

మీరు చెప్పినట్లే విడాకుల పేపర్స్‌పై సంతకం చేసి ఇచ్చాను. సాయంత్రంలోపు మీ నిర్ణయం చెప్పమని చెప్పాను అని కావ్య అంటే.. మరి సరే అన్నాడా అని ఇందిరాదేవి అంటుంది. అలా అంటే బాగుండు. ఏం చెప్పలేదు. ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు అని కావ్య భయపడిపోతుంది. ఏం కాదులే. ఏం జరిగినా అడ్డుకోడానికి నేను ఉన్నాగా అని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు విడాకుల గురించే రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో శ్వేత వచ్చి ఏంటీ రాజ్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. బయటకు వస్తానని చెప్పి ఇక్కడే ఉండిపోయావంటుంది.

ఎంతలా నలిగిపోయి

ఏంటీ ఇవి అని డివోర్స్ పేపర్స్ చూసి షాక్ అవుతుంది శ్వేత. ఇంతదాకా తెచ్చుకున్నావా. నా భర్త అంటే దుర్మార్గుడు కాబట్టి విడాకులు కోరుకున్నాను. కానీ కావ్య ఎందుకు కావాలనుకుంటుంది. శారీరకంగానే హింసిస్తేనే హింస కాదు రాజ్. తాను ఈ నిర్ణయం తీసుకోడానికి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటుంది. ఎంతలా ఆవేదన పడి ఉంటుంది. అన్నింట్లో ముందుండే నువ్ నీకు కావ్యే ముందు విడాకులు ఇచ్చింది. పుట్టింటి గౌరవం, అత్తింటి గౌరవం, ఈ సమాజం నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కొడానికి సిద్ధపడి కావ్య విడాకులు ఇచ్చింది అంటే ఎంతలా నలిగిపోయి ఉంటుంది అని శ్వేత అంటుంది.

మొత్తానికి నన్ను అడ్డు పెట్టుకుని అనుకున్నది సాధించావ్. నీ ఇంటి నుంచి. నీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్లిపోతుంది. ఒక్క సంతకమే గా పెట్టు. వీడ్కోలు చెప్పు. ఏంటీ మౌనంగా ఉన్నావ్. ఇది మౌనం కాదు. నిశబద్ధం. కావ్య నీ నుంచి దూరంగా వెళ్లిపోతుందన్న ఊహ తట్టుకోలేక నీ మెదడు సబ్ధంగా మారింది. మెదడు నిశబ్దంగా మారింది. ఈ శూన్యం నువ్ తట్టుకోలేవ్ రాజ్. పిచ్చివాడైపోతావ్. ఏ తప్పు చేయని భార్య నీ మీద ప్రేమను చంపుకుని వెళ్లిపోతే తట్టుకోలేవ్. వెళ్లి నీ మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టు. నీ భార్య అడుగు బయటపెట్టకుండా అడ్డుపెట్టు అని శ్వేత సలహా ఇస్తుంది.

అనామికకు పెద్ద సమస్య

మరోవైపు పెద్ద సమస్య వచ్చిందని ధాన్యలక్ష్మీకి అనామిక వచ్చి చెబుతుంది. ఏంటీ అంతలా కంగారుపడుతున్నావ్. ఏమైంది అని అడుగుతుంది ధాన్యలక్ష్మీ. నా కాలేజ్ ఫ్రెండ్స్ వస్తున్నారు. వాళ్లు చాలా రిచ్. నేను ఏమో కల్యాణ్ మన ఆఫీస్ మొత్తం చూసుకుంటున్నాడని చెప్పాను. కానీ, ఇప్పుడు వాళ్లకు నిజం తెలిస్తే పరువు పోతుంది అని అనామిక భయపడుతుంది. అలా ఎందుకు చెప్పావ్. ఇంకోసారి చెప్పకు. ఇప్పుడు నేను చూసుకుంటాను అని ధాన్యలక్ష్మీ అంటుంది.

ఇంతలో అనామిక ఫ్రెండ్స్ వస్తే కావ్య వెళ్లి డోర్ తీస్తుంది. వాళ్లు అనామిక ఫ్రెండ్స్. బెంగళూరు నుంచి వస్తున్నామని చెప్పడంతో వాళ్లను లోపలికి ఆహ్వానిస్తుంది కావ్య. తర్వాత అమ్మమ్మ. మా అత్తయ్య అని అనామిక పరిచయం చేస్తుంది. మీరు టార్చర్ పెట్టే టైపా పద్ధతి టైపా అని వాళ్లు అడిగితే.. అమ్మలా ప్రేమగా చూసుకునే టైపు అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఈ ఆంటీ ఎవరని అపర్ణ గురించి అడిగితే.. తను ఈ ఇంటికి పెద్ద కోడలు. ఇంట్లో ఏదైనా తన నిర్ణయం మీదే నడుస్తుంది. నేను పెద్ద కోడలు. ఆమె మా అత్తయ్య అని కావ్య అంటుంది.

విడాకుల ప్లాన్ ఫెయిల్

ఇంతలో వచ్చిన రుద్రాణి ఇన్నాళ్లు మా వదినా చెప్పినట్లు నడుచుకునేవాళ్లం. ఇప్పుడు ఈవిడ చెప్పినట్లు చేయాల్సి వస్తుంది అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో అందరిముందు ముఖ్యమైన విషయం చెప్పాలని, తన జీవితానికి చెందిన విషయం అని రాజ్ అంటాడు. దాంతో కావ్య, ఇందిరాదేవి షాక్ అయిపోతారు. అది ఇప్పుడే చెప్పొచ్చు కదా అని ఇందిరాదేవి అంటే.. ఇది కళావతి పుట్టింటివాళ్ల సమక్షంలోనే చెప్పాలి అని రాజ్ అంటాడు. చూస్తుంటే ఇందిరాదేవి ఇచ్చిన విడాకుల ప్లాన్ ఫెయిల్ అయి కావ్యకు రాజ్ డివోర్స్ ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు అనిపిస్తోంది.

Whats_app_banner