Goddess lakshmi devi blessings: ఈ వస్తువులు మీ ఇంట్లో పెట్టుకున్నారంటే ఆర్థిక సంక్షోభమే ఉండదు.. డబ్బే డబ్బు-vastu tips for financial gain and goddess lakshmi devi blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Goddess Lakshmi Devi Blessings: ఈ వస్తువులు మీ ఇంట్లో పెట్టుకున్నారంటే ఆర్థిక సంక్షోభమే ఉండదు.. డబ్బే డబ్బు

Goddess lakshmi devi blessings: ఈ వస్తువులు మీ ఇంట్లో పెట్టుకున్నారంటే ఆర్థిక సంక్షోభమే ఉండదు.. డబ్బే డబ్బు

Gunti Soundarya HT Telugu
Apr 08, 2024 12:00 PM IST

Goddess lakshmi devi blessings: వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడతారు. డబ్బుతో మీ ఇల్లు నిండిపోతుంది. ధన కొరత బాధలు ఉండవు.

ఇవి ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక సంక్షోభమే ఉండదు
ఇవి ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక సంక్షోభమే ఉండదు (pinterest)

Goddess lakshmi devi blessings:  కొంతమంది ఎంత సంపాదించిన డబ్బును నిలుపుకోలేరు. డబ్బు చేతికి వచ్చిందన్న ఆనందం కొద్దిసేపట్లోనే ఆవిరి అయిపోతుంది. అనుకోకుండా ఏదో ఒక రూపంలో డబ్బులు ఖర్చయిపోతూ ఉంటాయి. డబ్బులు పొదుపు చేయలేకపోతారు. మీరు కూడా ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారా?

ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలు ఎదురుకావడానికి వాస్తు దోషం కూడా కారణం కావచ్చు. దాని నుంచి బయట పడేందుకు వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల మీ అదృష్టం, సంపద రెట్టింపు అవుతుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. సంపద పోగు పడటానికి ఆర్టిక పురోగతి సాధించడానికి వాస్తు ప్రకారం ఈ పరిహారాలు పాటించి చూడండి. ఈ వస్తువులోని మీ ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషం కూడా ఉండదు. ఇవి మీ ఇంట్లో ఉంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంపద పెరుగుతుంది.

శ్రీఫలం

శ్రీఫలం ఇంట్లో ఉంచుకోవడాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. శ్రీఫలం అనేది ఒక చిన్న కొబ్బరికాయ. లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. శ్రీఫలాన్ని పూజ గదిలో ఉంచుకుంటే వ్యాపారంలో లాభాలు పొందుతారు. డబ్బు సంపాదన పెరుగుతుంది. ఎనలేని విజయాలు మీ సొంతం అవుతాయి.

తాబేలు

తాబేలుని మహావిష్ణువు అవతారంగా భావిస్తారు. మీ ఇంట్లో తాబేలు ప్రతిమ ఉంచుకోవడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. వాస్తు ప్రకారం తాబేలు ప్రతిమను ఎప్పుడు ఉత్తర దిశలోనే ఉంచుకోవాలి. క్రిస్టల్ తాబేలు ఇంట్లో ఉండటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ఉంటుంది.

పిరమిడ్

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పిరమిడ్ ఉంచడం వల్ల ఆర్థిక శ్రేయస్సు, లక్ష్మీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయి. క్రిస్టల్ పిరమిడ్ ఉన్న ఇళ్లలో ఆదాయం పెరగడంతో పాటు వృత్తిలో పురోగతి కూడా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతారు. వాస్తు ప్రకారం పిరమిడ్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ప్రమాదాల నుంచి బయటపడతారు. మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. వాస్తు దోషాలను తొలగించుకోవడం కోసం ఇంట్లో పిరమిడ్ ని ఉంచుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఈశాన్య మూలలో పిరమిడ్ ప్రతిమను పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు.

గోమతి చక్రం

గోమతి చక్రాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయి. 11 గోమతి చక్రాలను పసుపు వస్త్రంలో చుట్టి భద్రంగా మీరు డబ్బు నిల్వ చేసే సేఫ్ లాకర్ లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. వ్యాపారంలో విజయం సాధిస్తారు. లాభాలు గడిస్తారు. డబ్బు రాకకు అనేక మార్గాలు ఏర్పడతాయి. ధనానికి కొదువ ఉండదు. గోమతి చక్రాలు దోషాలను నివారించే వాటిగా కూడా పరిగణిస్తారు. వీటిని ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిది. బాలారిష్ట దోషాలు కలిగిన పిల్లలకు గోమతి చక్రం లాకెట్ మెడలో వేయడం వల్ల నరదిష్టి బాధ నుంచి విముక్తి కలుగుతుంది.

కమల ఘట్ మాల

ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు కమల ఘట్ మాలను శుభప్రదంగా భావిస్తారు. ఈమాలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల సంపదకు మార్గం సుగమం అవుతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. ధ్యానం, జపం చేసేందుకు శివ భక్తులు రుద్రాక్షలు ఉపయోగిస్తారు. అలాగే వైష్ణవ భక్తులు తులసిమాల ఉపయోగిస్తారు. మహాలక్ష్మి కోసం తామర గింజలతో తయారు చేసిన ఈ కమల ఘట్ మాలతో చేస్తే చాలా మంచిది. దీన్ని ఇంట్లో ఉంచుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారు. ఈ మాలను ఉపయోగిస్తూ జపం చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. భక్తుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.

 

Whats_app_banner