Evil Eye: ‘ఈవిల్ ఐ’ అంటే ఏంటి? ఇది ధరిస్తే నరదిష్టి తగలదా?
Evil eye: ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ లో వినిపిస్తున్న పేరు ఈవిల్ ఐ. నర దిష్టి తగలకుండా ఎక్కువ మంది దీన్ని ధరిస్తున్నారు. అసలు ‘ఈవిల్ ఐ’ అంటే ఏంటో తెలుసుకుందాం.
Evil eye: నరుల దృష్టికి నాపరాళ్ళు కూడా పగిపోతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. అందంగా, ఆనందంగా ఉన్న వాళ్ళని చూస్తే కొంతమందికి అసూయ కలుగుతుంది. ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి చెప్పుకుంటూ తమకి ఆ సంతోషం దక్కలేదని ఏడుస్తూ ఉంటారు. అటువంటి దిష్టి తగలకుండా చాలా మంది కాళ్ళకి నల్ల తాడు కట్టుకుంటారు.
చిన్న పిల్లలకు తప్పనిసరిగా వెంట్రుకలతో తయారు చేసిన దిష్టి తాడు కడతారు. మరికొందరు పసి పిల్లలకు రూపాయి బిళ్ళ సైజులో నలుపు రంగు బొట్టు పెడతారు. ఎవరైనా పసి పిల్లల్ని చూసి ఎంత ముద్దుగా ఉన్నారో అన్నప్పుడు వారి దిష్టి అంతా నలుపు రంగు తీసేస్తుందని నమ్ముతారు. వాహనాలకు నిమ్మకాయలు దిష్టి తలగకుండా కట్టుకుంటారు. ఇప్పుడు దిష్టి తగలకుండా ఎక్కువ మంది ఫాలో అవుతున్న పద్ధతి “ఈవిల్ ఐ”.
ఈవిల్ ఐ అంటే ఏంటి?
ప్రపంచవ్యాప్తంగా ఈవిల్ ఐ ఎంతో ప్రాచుర్యం పొందింది. చైనీయులు అనుసరించే ఫెంగ్ షూయిలో ఈవిల్ ఐ గురించి ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈవిల్ ఐకి కులమతాలతో సంబంధం లేకుండా అందరూ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈవిల్ ఐ అనేది గుండ్రని ఆకారంలో కనుపాప మాదిరిగా ఉంటుంది. దీన్ని నీలం రంగులో గాజుతో చేస్తారు. దిష్టి నివారణకి ఈవిల్ ఐ ఉపయోగిస్తారు. ఇప్పుడు దీన్ని కట్టుకోవడం ఫ్యాషన్ గా మారిపోయింది. చాలా మంది మెడలో ఈవిల్ ఐ ఉన్నదాన్ని లాకెట్ గా ధరిస్తున్నారు.
చెడు దృష్టి తగలడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనారోగ్యపరమైన సమస్యలు, దురదృష్టం, ప్రమాదాలు జరిగి గాయాలు కావడం వంటివి దిష్టి తగలడం వల్లే జరిగాయని నమ్ముతారు. చెడు దృష్టి పోవడం కోసం నీలం రంగు ఉన్న ఈవిల్ ఐ ధరించడం వల్ల దిష్టి తగలదని అంటారు. అయితే ఈవిల్ ఐ నీలం రంగు ఎక్కువగా వినియోగిస్తారు. ఇది వేర్వేరు రంగుల్లో కూడా లభిస్తుంది. ఒక్కో రంగు ఒక్కో ప్రాముఖ్యతని తెలియజేస్తుంది.
- అత్యధికులు ముదురు నీలం రంగు కన్ను ఉన్నదాన్ని ధరిస్తాడు. కర్మ, ప్రేరణ, చెడు కన్ను నుంచి రక్షణ వంటి సానుకూల శక్తులని సూచిస్తుంది.
- లేత నీలం రంగు చెడు దృష్టి మీ మీద పడకుండా చేస్తుంది.
- పసుపు లేదా బంగారు రంగులో సూర్యనితో ముడి పడి ఉంటుంది. వ్యాధుల రక్షణగా నిలుస్తుంది.
- పింక్ కలర్ విశ్రాంతిని సూచిస్తుంది. స్నేహం, ప్రేమ కోసం పరిగణిస్తారు.
- ఆరెంజ్ కలర్ ఆనందం, సృజనాత్మకతతో ముడిపడి ఉంటుంది.
- బ్రౌన్ సహజ వనరుల నుంచి రక్షణని సూచిస్తుంది.
- ఆకుపచ్చ రంగు ఆనందానికి ప్రతీక.
- తెలుపు సంపద, కొత్త అవకాశాలని సూచిస్తుంది.
- పర్పుల్ ఆధ్యాత్మికతను సూచిస్తుంది. అలాగే అడ్డంకుల్ని తొలగిస్తుంది.
- ఎరుపు జీవితంలో ఎదురయ్యే సమస్యలని ఎదుర్కొనే శక్తి, ధైర్యాన్ని బలాన్ని అందిస్తుంది.
- నలుపు ప్రతికూల శక్తుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.
ఈవిల్ ఐ ఏ దిశలో పెట్టాలి?
- వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పే దాని ప్రకారం చెడు దృష్టి మీ మీద పడకుండా ఉండాలంటే ఇంటి గుమ్మానికి ఈవిల్ ఐ వేలాడదీయడం మంచిది. అసూయ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా రక్షిస్తుంది.
- ఈవిల్ ఐ జ్యుయలరీ ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది. బ్రేస్లేట్ లేదా నెక్లెస్ లో లాకెట్ మాదిరిగా ధరిస్తున్నారు. కానీ దీన్ని కాలికి మాత్రం ధరించకూడదు.