ఈ ఫెంగ్ షూయి టిప్స్ ఆచరిస్తే వైవాహిక జీవితం ఆనందమయం
మీ వైవాహిక జీవితం సంతోషంగా సాగాలంటే కొన్ని ఫెంగ్ షూయి చిట్కాలు ఆచరించాలి. అవేంటో ఇక్కడ చూడండి.
ఫెంగ్ షూయ్ చిట్కాలతో మీ వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడపొచ్చు. మీ ఇంట్లో సంతోషం, శాంతి వెల్లివిరుస్తాయి. చైనీస్ వాస్తు శాస్త్రం అయిన ఫెంగ్‌షూయి భారత దేశంలో కూడా ప్రాచుర్యం పొందింది. మీరు కూడా మీ ఇంట్లో శాంతి, సంతోషం, శ్రేయస్సు వెల్లివిరియాలంటే కొన్ని ఫెంగ్ షూయి చిట్కాలు పాటించాలి. ఈ చిట్కాలను ఆచరించడం వల్ల మీ ఇంట్లో, వైవాహిక జీవితంలో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. మీ ఇంట్లో ఉన్న లోపాలు తొలగిపోతాయి. ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.
ఫెంగ్ షూయి ప్రకారం పడక గదిలో పసుపు రంగును వాడాలి. దీనితో పాటు మీరు ఎరుపు రంగు చేతి రుమాలును మీ వెంట ఉంచుకోవాలి. ఈ రంగ అదృష్టాన్ని పెంచుతుంది. అందువల్ల దీనిని ఎల్లప్పుడు మీ వెంట ఉంచుకోండి. మీ జీవితంలో వీలైనంత వరకు ఈ రంగులను ఉపయోగిస్తే మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు.
మీ పడక గదిని ఎప్పుడు చెల్లాచెదురుగా, గందరగోళంగా ఉంచవద్దు. చాలాసార్లు పడక గదిలో వస్తువులు చిందరవందరగా ఉంటే మీ వైవాహిక జీవితంలో ఒత్తిడి ఎదురవుతుంది.
ఫెంగ్ షూయి ప్రకారం పడక గదిలో గ్లాస్ లేదా డ్రెసింగ్ టేబుల్ ఎప్పుడూ ఉంచకూడదు. దీని వల్ల భార్యాభర్తలు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని దిగజార్చుతుంది.
ఫెంగ్ షుయి ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం నుంచి నేరుగా పడక గదిలోకి ప్రవేశించకూడదు. మధ్యలో విభజన ఉండాలి. మెయిన్ గేటు నుంచి నేరుగా పడక గదిలోకి ప్రవేశించడం వల్ల ఇంటి యజమాని కోర్టు కేసుల్లో ఇరుక్కోవలసి వస్తుంది.
గమనిక: ఈ వ్యాసంలోని సమాచారం పూర్తిగా సత్యం, కచ్చితమైనందని చెప్పలేం. వీటిని ఆచరించేముందు సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించాలి.