Lucky zodiac signs: ఉగాది నుంచి వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం.. అమూల్యమైన కానుకలు అందుకోబోతున్నారు-these zodiac signs get goddess lakshmi devi blessings on ugadi festival ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lucky Zodiac Signs: ఉగాది నుంచి వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం.. అమూల్యమైన కానుకలు అందుకోబోతున్నారు

Lucky zodiac signs: ఉగాది నుంచి వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం.. అమూల్యమైన కానుకలు అందుకోబోతున్నారు

Gunti Soundarya HT Telugu
Apr 03, 2024 11:47 AM IST

Lucky zodiac signs: ఉగాది నుంచి తెలుగు వారి నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో మూడు రాజయోగాలతో ఉగాది రావడం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది.

ఉగాది నుంచి వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం
ఉగాది నుంచి వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం

Lucky zodiac signs: శోభకృత్ నామ సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది. ఏప్రిల్ 9 నుంచి చైత్రమాసం ప్రారంభం కాబోతోంది. ఆ రోజు తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది పండుగ జరుపుకుంటారు. క్రోధి నామ సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాము. రానున్న కొత్త సంవత్సరానికి కుజుడు రాజుగా ఉంటే మంత్రిగా శని ఉంటాడని పండితులు చెబుతున్నారు.

హిందూ నూతన సంవత్సరం మూడు రాజయోగాలతో ప్రారంభం కాబోతుంది. ఈసారి ఉగాది రోజు నుంచే చైత్ర నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. సర్వార్ధ సిద్ధి యోగం, అమృత సిద్ధియోగం, ప్రీతి యోగం ఏప్రిల్ 9న వచ్చాయి. సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం ఏప్రిల్ 9 ఉదయం 7:30 గంటల నుంచి రోజంతా ఉంటాయి.

జ్యోతిష శాస్త్రంలో ఈ యోగాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ యోగాలతో ఒక వ్యక్తి సంపద పెరుగుతుంది. అన్నింటా విజయం సాధిస్తారు. వీటి ప్రభావంతో హిందూ నూతన సంవత్సరం ప్రారంభం నుంచి కొన్ని రోజుల వారికి శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం పూర్తి మద్దతు ఉంటుంది. లక్ష్మీదేవి కూడా సంవత్సరం పొడవునా వీరి మీద ప్రత్యేక అనుగ్రహాన్ని చూపెడుతుంది. ఉగాది ఏయే రాశుల వారికి శుభదాయకంగా ఉంటుందో చూద్దాం.

మేష రాశి

హిందూ నూతన సంవత్సరం మేష రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. పోటీ పరీక్షలు రాసిన విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. దీనివల్ల అభ్యర్థులు చాలా సంతోషంగా ఉంటారు. వారి కృషికి తగిన ఫలితం లభిస్తుంది. మేషరాశి వారికి ఇది అత్యంత ప్రయోజనకరమైన సమయం. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బోలెడంత సంపద పొందుతారు. వృత్తి, ఉద్యోగాలలో లాభం పొందుతారు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

మిథునం

ఈ కొత్త సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయాన్ని పెంచుతుంది. పూర్వికులు ఆస్తులను అమ్మడం వల్ల మంచి లాభాలు వస్తాయి. ఉత్తేజకరమైన అవకాశాలు మీ తలుపు తడతాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిథున రాశి వారికి ఈ కాలంలో కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ మాటలకు సమాజంలో విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు అందిపుచ్చుకుంటారు. వ్యాపార లావాదేవీలు సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఈ సమయం ఒక వరం లాంటిది.

సింహ రాశి

నూతన సంవత్సరం సింహ రాశి వారికి అమూల్యమైన కానుకను తీసుకొస్తుంది నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగఅవకాశాలు లభిస్తాయి. ఈ కాలం మీ వృత్తి జీవితానికి చాలా శుభదాయకంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మీ భార్య మీకు అండగా నిలుస్తుంది.

ధనుస్సు రాశి

హిందూ నూతన సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి శుభవార్తలు అందుతాయి. సంతోషంగా గడుపుతారు. దాంపత్య జీవితం రొమాంటిక్ గా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ వికసిస్తుంది. ఈ కాలం మీ జీవితంలో ఆర్థిక పురోగతిని తీసుకొస్తుంది. వ్యాపారస్తులు ఈ సమయంలో పెట్టిన పెట్టుబడి రాబోయే కాలంలో భారీ లాభాలను ఇస్తుంది.

WhatsApp channel