Karthika deepam 2 serial: కార్తీకదీపం 2 సీరియల్.. అల్లాడించేసిన తల్లీకూతుళ్లు.. దీపని ఆపిన శివనారాయణ, సంతోషంలో కార్తీక్
Karthika deepam 2 serial april 10th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 10వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. ఎవరు ఎన్ని చెప్పిన కూడా దీప ఇంట్లో నుంచి వెళ్లిపోతానని పట్టుబడుతుంది. తన తండ్రిని చంపిన వ్యక్తి ఎదురుగా ఉంటే తట్టుకోలేకపోతున్నానని బాధపడుతుంది.
Karthika deepam 2 serial april 10th episode: దీప ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అంటే ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తావని సుమిత్ర అడుగుతుంది. దీప పారిజాతం మాటలు గుర్తు చేసుకుంటుంది. మీ గాయం కూడా ఇంకా మానలేదు ఉండవచ్చు కదాని కార్తీక్ కూడా అంటాడు. నువ్వు అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం లేదని సుమిత్ర తేల్చి చెప్తుంది.
సుమిత్ర ఆవేదన
శౌర్యని ఇంట్లోకి తీసుకుని వెళ్ళమని కార్తీక్ కి చెప్తుంది. బుడ్డది రాను అంటే బలవంతంగా ఎత్తుకుని తీసుకెళ్లిపోతాడు. సుమిత్ర దీపను తీసుకెళ్ళి ఏంటి నీ సమస్య ఎందుకు వెళ్లిపోవాలని అనుకుంటున్నావని అడుగుతుంది. నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? నేను నిన్ను సరిగా చూసుకోవడం లేదా అంటుంది.
అదేమీ లేదు కానీ ఇక్కడ ఉండలేను కారణాలు చెప్పలేనని దీప అంటుంది. ఏమి చెప్పవు కన్నీటి మూట నెత్తిన పెట్టుకుని మోసుకుని తిరుగు. నీలోపల అగ్నిపర్వతం ఉంది అది ఏదో ఒక రోజు పేలుతుంది. అది నిన్ను తగలబెట్టేస్తుందని సుమిత్ర బాధగా అంటుంది. తగలబడటానికి ఇంకేమీ లేదని దీప అంటే నువ్వు ఇలా మాట్లాడితేనే భయమేస్తుందని సుమిత్ర ఆవేదనగా అడుగుతుంది.
నన్ను వెళ్లిపోనివ్వండి
ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే ఇక్కడ నుంచి బయటకి అని మొండిగా చెప్తుంది. ఇలాంటివి చెప్తే లాగిపెట్టి కొడతానని అంటుంది. దీప పరిస్థితి చూసి సుమిత్ర ఆవేదనగా మాట్లాడుతుంది. నా ప్రాణాలు కృతజ్ఞతతో మాట్లాడటం లేదు మనిషిగా మాట్లాడుతున్నాను.
దెబ్బ తగిలినప్పుడు నువ్వు అమ్మా అని అరిచావు అది నా చెవులకు కాదు నా కడుపులో పేగుకు తగిలింది. నీకు నాకు ఏ జన్మలో ఏ బంధం ఉందో తెలియదు. బంధం అయితే తెలియదు కానీ అది నా గుండెలని చీల్చుకుంటూ కళ్ల వెంట కన్నీళ్లుగా వస్తున్నాయి.
మీ ప్రేమకి, అభిమానానికి దీప చేతులెత్తి నమస్కరిస్తున్నానని అంటుంది. నాకు అదేమీ వద్దు నువ్వు ఉంటే చాలని సుమిత్ర చెప్తుంది. అయితే నాకోసం ఒక పని చేయండి అంటే నన్ను ఇక్కడ నుంచి వెళ్లిపోనివ్వండి. మీ నుంచి నాకు ఏ సాయం వద్దు నన్ను వెళ్లిపోనివ్వండి. ఇదే మీ నుంచి నేను కోరుకునేదని దీప బతిమలాడుతుంది.
నా తండ్రికి చావుకి కారణం అతడే
సరే నిన్ను ఆపను వెళ్ళు. కానీ నువ్వు ఎప్పుడు రావాలని అనుకున్నా ఈ ఇంటి గుమ్మాలు ఆహ్వానం పలుకుతాయి. నీకోసం నేను ఎదురుచూస్తూ ఉంటానని అంటుంది. వెళ్ళే ముందు అందరికీ చెప్పి వెళ్ళు లేదంటే బాధపడతారని చెప్పి సుమిత్ర బాధపడుతుంది.
నేను ఎందుకు వెళ్లిపోవాలని అనుకుంటున్నానో మీకు చెప్పలేను. నా తండ్రి చావుకి కారణమైన మనిషి నా కళ్ళ ముందే తిరుగుతుంటే తండ్రి శవాన్ని గుండెల మీద మోస్తున్నట్టు ఉంది. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట అంటే అది నా బిడ్డ చెవిన పడి నాన్న నిన్ను వదిలేశాడా అంటే అది నా చావు కంటే ఎక్కువ బాధను ఇస్తుంది. ఎటు పోతానో నాకు కూడా తెలియదు కానీ పోవాలని దీప నిర్ణయించుకుంటుంది.
అనసూయ దీప ఎక్కడ ఉందోనని ఆలోచిస్తుంది. నరసింహను కలిసి ఉంటే ఏదో ఒక కబురు తెలియాలి కదాని అనుకుంటుంది. అది తెలిసే దాకా నువ్వు నా ఇంట్లో పనులు చేస్తూ ఉండాలని మల్లేష్ వెటకారంగా అంటాడు. దీపకు నరసింహ దొరకడు, పోయిన దీప రాదు ఇక్కడ నీ ఇల్లు దక్కదని ఇక్కడే పనులు చేసుకుంటూ ఉండమని చెప్తాడు.
దీప బ్యాగ్ పట్టుకుని వెళ్లిపోతానని వస్తే సుమిత్ర మరొకసారి ఉండమని బతిమలాడుతుంది. మిస్ యూ దీపక్క నువ్వు నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటావని జ్యోత్స్న అంటుంది. దీపను ఎలా ఆపాలో అర్థం కావడం లేదని కార్తీక్ ఆలోచిస్తాడు. ఎక్కడికి వెళ్తావో చెప్పు వదిలిపెడతానని సుమిత్ర అంటే వద్దని దీప చెప్తుంది.
దీపను ఆపిన శివనారాయణ
నిజం చెప్పుకునే అవకాశం రాకుండానే దీప వెళ్ళిపోతుంది తను ఆగిపోతే బాగుండని కార్తీక్ అనుకుంటాడు. అప్పుడే శివనారాయణ దీపను ఆగమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని అంటాడు. మా ఇంటి మహాలక్ష్మి ప్రాణాలు కాపాడిన మనిషివి నువ్వు కృతజ్ఞతతో ఏం చేయకుండా పంపిస్తామా? రేపు ఉగాది పండుగ.
ఈ పండుగ అందరం కలిసి సంతోషంగా జరుపుకుంటున్నాం. నీ ప్రయాణం సంగతి పండుగ వెళ్ళిన తర్వాత చూద్దామని శివనారాయణ ఆపుతాడు. ఆ అమ్మాయికి ఏం పనులు ఉన్నాయో ఏంటో అర్థం చేసుకోకుండా ఆపుతారు ఏంటని పారిజాతం అంటే శివనారాయణ తిడతాడు.
పెద్దయ్య చెప్పేసరికి చేసేది లేక దీప ఉండిపోతుంది. ఏం శౌర్య ఉంటావ్ గా అని శివనారాయణ అడిగితే ఉండటానికి బట్టలు లేవుగా అంటుంది. పండగకు ఏం వేసుకోవాలని అనేస్తుంది. శివనారాయణ వెంటనే కార్తీక్ వీళ్ళని తీసుకెళ్ళి బట్టలు కొనివ్వమని అంటాడు.
థాంక్స్ చెప్పిన కార్తీక్
దీప వద్దు నేనే తీసుకుంటానని అంటుంది. బట్టలు తీసుకుని వస్తామా అటు నుంచి అటే ఊరు వెళ్లిపోతామా అని శౌర్య అడుగుతుంది. మనకు చెప్పకుండా సిటీ దాటుతుందా వెళ్తే నేనే వెళ్ళి తీసుకొస్తానని శివనారాయణ అంటాడు. ఆత్మాభిమానం కలిగిన మనిషి, అందుకే మన నుంచి ఏ సాయం తీసుకోవడం లేదు. ఉండమంటే ఉండనని అంటుందని సుమిత్ర, దశరథ చెప్తారు.
కార్తీక్ తన తాతయ్యకు థాంక్స్ చెప్తాడు. ఎందుకని అంటే పండుగ చేసుకుందామని అన్నావ్ కదా అంటాడు. ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం కదా అంటే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కాదుగా అనేసి వెళ్ళిపోతాడు. జ్యోత్స్న కార్తీక్ మాటలు విని బిత్తరపోతుంది.
శౌర్య వైపు దీప కొరకొరా చూస్తుంది. బట్టలు లేవని నేను చెప్పమన్నానా అని తిడుతుంది. యాపిల్ ఇస్తే తీసుకోమని చెప్పావ్ కదా అందుకేనని శౌర్య అమాయకంగా అంటుంది. అలిగానని చెప్పి బుంగమూతి పెడుతుంది. భలే క్యూట్ గా ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో చెప్పు బుక్ లో రాసుకుని దిద్దుకుంటానని అంటుంది. ఇలా మాట్లాడొద్దని దీప అంటే అన్నీ నువ్వే చెప్తావ్ కానీ నాన్న ఎప్పుడు వస్తాడో అసలు చెప్పవని అనేసరికి దీప బాధపడుతుంది.
టాపిక్