Ugadi Decoration Ideas : ఉగాది పండుగకు ఇంటిని ఇలా అలంకరించండి మంచిది
Ugadi Decoration Ideas : హిందూవులకు ఉగాది పండుగ చాలా ప్రత్యేకమైనది. ఈ పండుగ రోజున మీ ఇంటిని అందంగా అలంకరించడి. మంచి జరుగుతుంది.
భారతదేశంలో ఉగాది పండుగ జరుపుకోవడం చాలా ప్రత్యేకమైనది. ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే పంచాగం ప్రకారం కొత్త సంవత్సరం ఉగాది రోజున ప్రారంభమవుతుంది. నూతన సంవత్సరం సందర్భంగా అంతా మంచి జరగాలని కోరుకుంటారు. ఈ వేడుక అలంకరణతో మొదలవుతుంది. అవును, అలంకరణ ఇంటి గుమ్మం నుండి ప్రారంభమవుతుంది. ఈ ఉగాదికి ప్రత్యేకంగా ఇంటిని ఎలా అలంకరించాలో తెలుసుకుందాం..
ఇంటి ప్రధాన ద్వారం వద్ద సంప్రదాయంగా మామిడి ఆకులతోపాటుగా ఇతర అలంకరణ వస్తువులు పెట్టి.. అతిథులకు స్వాగతం పలకండి. ఈ ఏడాది ఉగాది వేడుకలు మార్చి 9, 2024న జరగనున్నాయి. ఈ ఉగాది వేడుకల కోసం మీ ఇంటి తలుపును అలంకరించేందుకు మేము మీకు సులభమైన టిప్స్ అందిస్తున్నాం. తప్పకుండా వీటిని ప్రయత్నించవచ్చు.
ఫ్లోర్ ఆర్ట్
ఇంటి నేలపై కొత్త తరహా పెయింటింగ్‌ను ప్రయత్నించడానికి ఉగాది పండుగ సరైన సమయం. మీకు రంగోలి గీయడంలో నైపుణ్యం లేకుంటే లేదా మీరు ఇంతకు ముందు ఎప్పుడూ రంగోలి గీయడానికి ప్రయత్నించకపోతే, మీరు ఫ్లోర్ ఆర్ట్ స్టెన్సిల్స్ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఫ్లోర్ ఆర్ట్ స్టెన్సిల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ స్టెన్సిల్ లేదా రంగోలి బొమ్మను వివిధ రంగులతో నింపితే, ఉత్తమ రంగోళి మీ ఇంటి వద్ద సిద్ధంగా ఉంటుంది. రంగులను ఉపయోగించడం కంటే, చెక్క పొడి లేదా సహజ పదార్థాలతో రంగోలిని అలంకరించడం మంచిది. రసాయనాలకు దూరంగా ఉండటం మీ ఆరోగ్యానికి మంచిదని గుర్తుంచుకోండి.
డోర్ హ్యాంగింగ్స్
ఒక్క ఫ్లోర్ ఆర్ట్ తో ఇంటి ముందు అలంకరించడం సాధ్యం కాదు. ఈ ఉగాది వేడుక కోసం కొంచెం వెరైటీగా ఆలోచించండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటిని మెరిసేలా చేయండి. దీని కోసం మీరు డోర్ హ్యాంగింగ్‌లను ఉపయోగించవచ్చు. కలపతో చేసిన ప్రత్యేక రకాల సాంప్రదాయ హ్యాంగింగ్‌లు మార్కెట్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇంటి ముందు వేలాడదీయండి. ఇంట్లోకి వచ్చే అతిథులు, బంధువులు చికాకు కలగకుండా హ్యాంగింగ్స్‌తో అలంకరించండి.
మామిడి, వేప ఆకులు
ఉగాది అంటే మామిడి చిగురించే సమయం. సంవత్సరంలో మొదటి హిందువుల పండుగకు ప్రకృతి కూడా సిద్ధమవుతున్న సమయం ఇది. అదే కారణంగా పూర్వకాలం నుంచి ఇంటిగుమ్మానికి మామిడి ఆకులు పెట్టడం సంప్రదాయం. వేప ఆకులతో అలంకరించడం కూడా ఆనవాయితీ. మామిడి, వేప చెట్టు ఇంటికి సానుకూల శక్తిని తెస్తుంది. నెగెటివ్ ఎనర్జీని దూరం చేయడానికి ఇది చాలా మేలు చేస్తుంది. మామిడి, వేప ఆకులను రంగవల్లిలో కూడా ఉపయోగించవచ్చు. తోరణంలా తయారు చేసి ఇంటి తలుపు వద్ద వేలాడదీయవచ్చు. తలుపులకు పైన కడితే చాలా బాగుంటుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది.
అరటి చెట్టుతో అలంకరణ
అరటి చెట్టు అనేది మతపరమైన ఆచారాలకు మాత్రమే కాకుండా సాంప్రదాయ ఉగాది ఆచారాలలో కూడా భాగం. మీరు కృత్రిమంగా లభించే అరటి చెట్టుతో మీ ఇంటి ముందు అలంకరించవచ్చు. నిజమైన అరటి చెట్టును ఉంచడం ద్వారా కూడా ఇంటిని అందంగా చేసుకోవచ్చు. మీరు కృత్రిమ అరటి చెట్లతో అలంకరిస్తే అది మరింత బాగుంటుంది. వాడిపోకుండా ఉంటాయి.
రాగి డోర్ బెల్స్
ఉగాది అలంకరణ కోసం మరొక ఉత్తమ ఆలోచన ఏమిటంటే తలుపు మీద చిన్న రాగి గంటలు వేలాడదీయడం. రాగి డోర్‌బెల్స్ విజయానికి చిహ్నంగా భావిస్తారు. చాలా ఇళ్లలో అలంకరణకు రాగి దీపాలను ఉపయోగిస్తారు. మీరు రాగి డోర్ బెల్స్ ఉపయోగించండి. ఈ రకమైన బెల్ డెకరేషన్‌తో మీరు మీ అలంకరణతో ఆకట్టుకోవచ్చు. మీ స్నేహితులు, బంధువుల నుండి అభినందనలు పొందవచ్చు. ఇంకా ఎందుకు ఆలస్యం ఉగాది డెకరేషన్ మెుదలుపెట్టండి.