వార ఫలాలు.. ఉగాది పండుగ వారం ఏ రాశి వారికి ఎలా గడుస్తుందో తెలుసుకోండి-april 7th to april 13th weekly horoscope in telugu check zodiac signs results full details ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వార ఫలాలు.. ఉగాది పండుగ వారం ఏ రాశి వారికి ఎలా గడుస్తుందో తెలుసుకోండి

వార ఫలాలు.. ఉగాది పండుగ వారం ఏ రాశి వారికి ఎలా గడుస్తుందో తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu
Apr 07, 2024 02:00 AM IST

Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. ఏప్రిల్7వ తేదీ నుంచిఏప్రిల్13వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

వార ఫలాలు.. ఏప్రిల్ 7 నుంచి 13 వరకు
వార ఫలాలు.. ఏప్రిల్ 7 నుంచి 13 వరకు (freepik)

రాశిఫలాలు (వార ఫలాలు) 07.04.2024 నుండి 13.04 2024 వరకు

సంవత్సరం : శోభకృత్‌ నామ, అయనం : ఉత్తరాయణం, మాసం : ఫాల్గుణం-చైత్రం

మేష రాశి

వార ఫలాల ప్రకారం మేష రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలున్నాయి. మీరు చేసే ప్రతీ పని కలసివస్తుంది. ప్రముఖులు సాయపడతారు. వాహనయోగముంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. విద్యార్థులకు అనుకూలం. ఆరోగ్యవిషయాల్లో జాగ్రత్తలు వహించడం మంచిది. మేష రాశి మరింత శుభఫలితాలు ఈవారం పొందడానికి దక్షిణామూర్తిని పూజించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన వారం. మానసిక ఆందోళన, కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. వ్యాపారస్తులకు లాభదాయకం. అవసరాలకు తగినంత డబ్బు సమకూరుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఒక సమాచారం అందుతుంది. వ్యవహారాలు మరింత సాఫీగా పూర్తి చేస్తారు. కనకధారా స్తోత్రాన్ని పఠించడం మంచిది. గురువారం రోజు దత్తాత్రేయుని పూజించండి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారులచే ప్రశంసలుంటాయి. దూరప్రయాణాలుంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. భూ వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త ఉత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మరింత శుభఫలితాలు కలుగుతాయి. శివాష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. ముఖ్య వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆప్తులు, బంధువులతో ఆనందముగా గడుపుతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకం. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఫలితముంటుంది. అనారోగ్య సమస్యలుంటాయి. రాజకీయ నాయకులకు గౌరవం లభిస్తుంది. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయ దర్శనం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కొత్త కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. ఇళ్ళు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలుంటాయి. విద్యార్థులకు అనుకూల సమయం. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటారు. ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది. సూర్యనారాయణమూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారస్తులకు అనుకూలం. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. మీ ప్రతిభను గుర్తిస్తూ పురస్కారాలు రావచ్చు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విష్ణు సహస్రనామం పారాయణం, ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడులుంటాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. వాహనయోగముంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు చేజారే సూచనలున్నాయి. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. అయితే పట్టుదలతో పరిష్కారానికి కృషి చేస్తారు. ఇంటి ఖర్చులు పెరిగి రుణాల కోసం ప్రయత్నిస్తారు. ప్రయాణాలలో ఆటంకాలుంటాయి. మరింత శుభఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వాహనాలు, భూములు సమకూర్చుకునే పనిలో నిమగ్నమవుతారు. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు అనుకోని మార్పులుంటాయి. దూరప్రయాణాలుంటాయి. మరింత శుభఫలితాలు కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలం. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. దూరప్రయాణాలుంటాయి. ఆరోగ్య సమస్యలుంటాయి. విద్యార్థులకు ఆశించిన ఫలితాలుంటాయి. రాజకీయ నాయకులు అనుకూలం. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు చికాకు కలిగిస్తాయి. అయితే నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మరింత శుభ ఫలితాల పొందడం కోసం సుబ్రహ్మణ్యుడిని, దుర్గాదేవిని పూజించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఊహించని లాభాలుంటాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు తొలగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆలస్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. విదేశీ పర్యటనలుంటాయి. పరిష్కారం కాని వివాదాలు కొలిక్కి వస్తాయి. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

కుంభ రాశి

వార ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలున్నాయి. నిరుద్యోగులకు శుభవార్తలుంటాయి. వ్యాపారస్తులు పెట్టుబడులు పెంచుకుని విస్తరిస్తారు. ఉద్యోగస్తులకు కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనసౌఖ్యముంది. బంధువులతో అభిప్రాయబేధములేర్పడు సూచనలున్నాయి. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలను తొలగించుకుని పూర్తి చేస్తారు. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం ఉంటుంది. ఉద్యోగస్తులకు సమస్యలు తీరతాయి. వేడుకలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు రాగలవు. వ్యాపారస్తులకు లాభదాయకం. తెలివిగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. దూరప్రయాణాలుంటాయి. శుభవార్తలుంటాయి. మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel