తెలుగు న్యూస్ / ఫోటో /
Thurdsay remedies: గురువారం ఈ పనులు చేస్తే దరిద్రం ఇంట్లో తిష్ట వేసుకుంటుందట
What should not do on Thursday: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం రోజు కొన్ని పనులు చేయడం మంచిది కాదు.
(1 / 6)
గురువారం దేవగురు బృహస్పతికి అంకితం చేసే రోజు. ఈ రోజున విష్ణువును పూర్తి ఆచారాలతో పూజిస్తారు. ఇది జీవితంలో శ్రేయస్సు, ఆనందాన్ని తెస్తుందని నమ్ముతారు. ఈ రోజున ఉపవాసం ఉండడం, అరటిచెట్టుకు పూజ చేయడం, విష్ణుసహస్త్రాణం పారాయణం చేయడం వల్ల ఇంటికి ఐశ్వర్యం చేకూరుతుంది.
(2 / 6)
గురువారం నాడు శ్రీమహావిష్ణువును పూజిస్తే ఇంట్లో శాంతి, సంతోషాలు ఉంటాయి. ఈ రోజున చేసే కొన్ని చర్యలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి, అయితే గురువారం కొన్ని పనులు చేస్తే పేదరికం పెరుగుతుంది.
(3 / 6)
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం నాడు బట్టలు ఉతకకూడదు. ఈ రోజున సబ్బు వాడటం మంచిది కాదు. మత విశ్వాసాల ప్రకారం, గురువారం సబ్బును ఉపయోగించడం జాతకంలో గురు స్థానాన్ని బలహీన పరుస్తుంది. అందువల్ల సుఖం, ఐశ్వర్యం పోతాయి.( Instagram)
(4 / 6)
గురువారం డబ్బుకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు చేయడం శుభప్రదంగా పరిగణించరు. అప్పులు ఇవ్వకూడదు, తీసుకోకూడదు. గురువారం రోజు ఎవరి నుండి రుణం తీసుకుంటే మీ అప్పులు మరింత పెరుగుతాయి. ఆర్థిక కష్టాలు తప్పవు. డబ్బుకు సంబంధించిన పనులు చేయకూడదు.
(5 / 6)
పురుషులు గురువారం నాడు జుట్టు, గడ్డం కత్తిరించకూడదు. ఇలా చేయడం వల్ల ఆయురారోగ్యాలు, సంపదలు తగ్గుతాయని నమ్ముతారు. ఈ రోజున పూజా సామాగ్రి, కత్తులు, కత్తెర వంటి పదునైన వస్తువులను కొనడం కూడా అమంగళంగా పరిగణిస్తారు.
ఇతర గ్యాలరీలు