Karthika deepam 2 serial: కార్తీకదీపం 2 సీరియల్.. దీప దెబ్బకు వణికిన పారిజాతం.. శౌర్య మాటలకు ఎమోషనల్ అయిన కార్తీక్-karthika deepam 2 serial april 16th episodekarthik breaks down as sourya requests him to find her father ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Serial: కార్తీకదీపం 2 సీరియల్.. దీప దెబ్బకు వణికిన పారిజాతం.. శౌర్య మాటలకు ఎమోషనల్ అయిన కార్తీక్

Karthika deepam 2 serial: కార్తీకదీపం 2 సీరియల్.. దీప దెబ్బకు వణికిన పారిజాతం.. శౌర్య మాటలకు ఎమోషనల్ అయిన కార్తీక్

Gunti Soundarya HT Telugu
Apr 16, 2024 07:37 AM IST

Karthika deepam 2 serial april 16th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప కార్తీక్ కారులో నుంచి రావడం చూసిన పారిజాతం తన దగ్గరకు వెళ్ళి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. దీంతో దీప తనని కొట్టినట్టుగా మాట్లాడటంతో వణికిపోతుంది.

కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 16వ తేదీ ఎపిసోడ్
కార్తీకదీపం 2 సీరియల్ ఏప్రిల్ 16వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar )

Karthika deepam 2 serial april 16th episode: కార్తీక్, జ్యోత్స్న పెళ్లి విషయంలో తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ మారదని శివనారాయణ అంటాడు. కాంచన కొడుకుతోనే పెళ్లి అంటుండగా బయట కార్తీక్ కారులో నుంచి దీప దిగడం చూసి పారిజాతం రగిలిపోతుంది. ఇది దేవుడి సమక్షంలో ఇచ్చిన మాట అంటాడు.

పారిజాతాన్ని వణికించిన దీప

కార్తీక్ ఇంట్లోకి రాగానే పెళ్లి సంగతి మాట్లాడతారు. వచ్చే ముహూర్తాలలో పెళ్లి చేయాల్సిందేనని సుమిత్ర అంటే కార్తీక్ కోపంగా పారు వైపు చూస్తాడు. అక్కడ నుంచి మెల్లగా జారుకుంటుంది. కార్తీక్ కి శౌర్య ఎదురుపడుతుంది. తనని చూడగానే నరసింహ మాటలు గుర్తుకు వస్తాయి.

దీప తన గదిలోకి వచ్చీ భర్త మాటలకు కోపంతో రగిలిపోతూ ఉంటే పారిజాతం వచ్చీ కోపంగా పిలుస్తుంది. నువ్వు ఏవైనా కారు ఓనర్ అనుకుంటున్నావా? నా మనవడు కారు డ్రైవర్ అనుకుంటున్నావా? వాడు వచ్చీ డోర్ తీస్తే కానీ దిగవా అంటుంది. డోర్ రాకపోతే తీశారని దీప చెప్తుంది.

దీప వ్యక్తిత్వం గురించి నోటికొచ్చినట్టు వాగుతుంది. తన మనవడి కారు ఎందుకు ఎక్కావని రచ్చ చేస్తుంది. దీపను కుక్కతో పోలుస్తూ మాట్లాడుతుంది. నాలుక ఉంది కదా ఇష్టం వచ్చినట్టు తిప్పొద్దు నేను చెయ్యి తిప్పాల్సి వస్తుందని దీప వార్నింగ్ ఇచ్చేసరికి పారిజాతం బిత్తరపోతుంది.

నా హద్దులు నాకు తెలుసు. నా హద్దులు దాటి ఎవరైనా లోపలికి వస్తే అప్పుడు మాటలు నోటికి కాదు చేతికి వస్తాయని అనేసరికి పారిజాతం భయపడిపోతుంది. ఇదేంటి ఇంత మాట అనేసింది ఇంక ఎక్కువ మాట్లాడితే దీనితో తన్నులు తినాల్సి వస్తుందని భయపడి జారుకుంటుంది.

నాన్నని ఎప్పుడు చూడలేదు

నేను వదిలేసిన విషయాన్ని ఈయన జోక్యం చేసుకుని గొడవ చేశాడు. ఇది ఇక్కడితో ఆగుతుందా అని దీప కంగారుపడుతుంది. కార్తీక్ శౌర్య దగ్గర తన తండ్రి వివరాలు అడిగి తెలుసుకోవాలని అనుకుంటాడు. నాన్న కోసమే హైదరాబాద్ వచ్చామని ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదని చెప్తుంది.

నాన్న ఇక్కడికి ఎప్పుడు వచ్చాడని కార్తీక్ అడుగుతాడు. తెలియదని చెప్తుంది. మీ నాన్న ఇక్కడికి రావడానికి ముందు తనతో బాగా ఆడుకున్నావా అంటాడు. అయ్యో కార్తీక్ అసలు నాకు మా నాన్న ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఎప్పుడూ చూడలేదు. మా ఫ్రెండ్స్ కి నాన్న ఉంటే మా నాన్న ఎక్కడని అడిగాను. ఊరు వెళ్ళాడు వస్తాడని చెప్పింది.

నువ్వు నాన్నని ఒక్కసారి కూడా చూడలేదా అంటే లేదని బాధగా అంటుంది. నాన్న పేరు ఏంటని అంటే నాన్న అని చెప్తుంది. ఏంటి ఇది పుట్టినప్పటి నుంచి నాన్నని చూడలేదా? అసలు పేరు కూడా తెలియదా? అసలు వాడు వీళ్ళ జీవితాలని ఏం చేశాడని ఆలోచిస్తాడు.

కార్తీక్ సాయం కోరిన శౌర్య

కార్తీక్ మనం ఫ్రెండ్స్ కదా నాకొక హెల్ప్ చేయవా? నేను అమ్మ ఎంత వెతికినా నాన్న దొరకడం లేదు. కాస్త నువ్వు వెతుకుతావా? మా నాన్న అంటే చాలా ఇష్టం. మా ఫ్రెండ్ ని వాళ్ళ నాన్న ఎత్తుకుని స్కూల్ కి తీసుకొస్తాడు. నన్ను మా నాన్న ఎత్తుకుని స్కూల్ కి తీసుకెళ్లాలి ఆయనతో బోలెడు కబుర్లు చెప్పాలని అంటుంది.

వెతికి తీసుకొస్తానని కార్తీక్ అంటాడు. థాంక్స్ కార్తీక్ నువ్వు చాలా మంచివాడివి. మా నాన్న కూడా నీలా ఉంటాడా? అని అడుగుతుంది. దీప కోపంగా శౌర్య అని అరిచి తనని తీసుకుని వెళ్ళిపోతుంది. నా వల్ల జీవితానికి కొంత అన్యాయం జరిగిందని అనుకున్నాను. కానీ నీ జీవితమే అన్యాయం అయిపోయిందని ఇప్పుడే అర్థం అయ్యింది.

నాన్న అంటే ఇలా ఉంటాడని పాప చాలా గొప్పగా అనుకుంటుంది. కానీ కూతురికి తండ్రి పేరు కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? నిన్ను ఎందుకు వాడు పొమ్మని అంటున్నాడని కార్తీక్ బాధపడతాడు. శౌర్య మీద కోపంగా అరుస్తుంది. ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదా? అతన్ని అలా అడగటం తప్పని దీప అంటుంది.

కార్తీక్ మంచివాడు

తప్పేముంది అయితే నువ్వే నాన్న ఎలా ఉంటాడో చెప్పమని శౌర్య తల్లిని నిలదీస్తుంది. నీలా ఉంటాడని చెప్పాను కదా అంటే కార్తీక్ కూడా నాలానే ఉన్నాడని అంటుంది. కార్తీక్ చాలా మంచివాడు. ఒకళ్ళు మనల్ని ఎక్కువగా ఇష్టపడితే అది ప్రేమ అన్నావ్ కదా. నువ్వు నా మీద ఎంత ప్రేమ చూపిస్తావో కార్తీక్ కూడా నామీద అంత ప్రేమ చూపిస్తాడు.

అమ్మ అంటే నీలా ఉండాలి. మరి నాన్న అంటే ఎలా ఉంటాడు. వాళ్ళందరికీ నేనంటే చాలా ఇష్టం. అమ్మమ్మ నన్ను స్కూల్ లో జాయిన్ చేస్తానని చెప్పింది. కానీ నేను ఏమననాన్నో తెలుసా మా అమ్మ వెళ్లమంటేనే వెళ్తానని చెప్పాను. మన ఊర్లో ఉన్నప్పుడు చిన్నగా నాతో మాట్లాడే దానివి కానీ ఇక్కడ మాత్రం చాలా పెద్దగా మాట్లాడుతున్నావని అంటుంది.

దీప బతిమలాడుతుంటే నీతో మాట్లాడను అలిగానని శౌర్య బుంగమూతి పెట్టుకుంటుంది. జ్యోత్స్న బర్త్ డే ఏర్పాట్ల గురించి సుమిత్ర మాట్లాడుతుంది. తన బర్త్ డే వంట బాగా చేయించమని జ్యోత్స్న అంటుంది. అంతలో దీప వస్తే సుమిత్ర వంటలు బాగా చేస్తావంట కదా శౌర్య చెప్పిందని అంటుంది.

వంటలక్క అవతారం స్టార్ట్

దీపని మాట్లాడనివ్వకుండా జ్యోత్స్న పుట్టినరోజుకి వంటలు చేయాలని చెప్తాడు. వెళ్లిపోదామని చెప్పడానికి వస్తే పుట్టినరోజు అంటున్నారు ఏంటి? నాకు అన్నం పెట్టిన ఈ ఇంటికి వంట చేసి పెట్టి రుణం తీర్చుకుంటానని దీప అనుకుంటుంది. దీంతో వంట చేసేందుకు ఒప్పుకుంటుంది.

దీప ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే బంటు తనని చూసి కనిపించకుండా పక్కకి దాక్కుంటాడు. కానీ దీప అతన్ని చూసి ఎదురుగా నిలబడుతుంది. నన్ను చూసి నువ్వు ఎందుకు కంగారుపడుతున్నావ్? ఏమైనా తప్పు చేశావా? అని అడుగుతుంది. బంటు వణికిపోతూ ఉంటాడు. నువ్వు ఏదో తప్పు చేశావ్ లేకపోతే నీ చేతులు ఇలా ఎందుకు వణుకుతాయని అంటుంది.

కాసేపు ఇక్కడే ఉంటే గుడి దగ్గర చూసింది గుర్తు చేసుకుంటుందని బంటు తప్పించుకోవాలని అనుకుంటాడు. దొంగతనం ఏమైనా చేశావా అని దీప అడిగితే నేనెందుకు దొంగతనం చేస్తాను నేను పారిజాతం అమ్మగారికి నమ్మిన బంటుని అని చెప్పి తప్పించుకుంటాడు. ఇతన్ని నేను ఎక్కడైనా చూశానా అని దీప ఆలోచిస్తుంది.

IPL_Entry_Point