Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్: దీపను మెచ్చుకున్న సుమిత్ర కుటుంబం.. పెళ్ళికి కలవని జ్యోత్స్న, కార్తీక్ జాతకాలు
Karthika deepam 2 serial april 13th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప ఉగాది పచ్చడి అద్భుతంగా చేసిందని శివనారాయణ కుటుంబం మొత్తం మెచ్చుకుంటుంది. ఇక ఉగాది పంచాంగ శ్రవణంలో జ్యోత్స్న జాతకం చూసి పెళ్లి కష్టమేనని చెప్తాడు.
Karthika deepam 2 serial april 13th episode:సుమిత్ర కుటుంబం మొత్తం ఉగాది పచ్చడి చేయడంలో బిజీ బిజీగా ఉంటారు. ఈ ఇయర్ గోల్డ్ చైన్ తన మెడలోనే పడుతుందని జ్యోత్స్న అంటుంది. పారిజాతం మనవరాలిని తెగ ఎంకరేజ్ చేస్తుంది. శౌర్య బెల్లం తినేందుకు చూస్తే దీప వద్దని సైగ చేస్తుంది.
పెళ్లి చేసుకోమన్న కాంచన
కార్తీక్ ని పెళ్లి చేసుకోమని కాంచన అడుగుతుంది. నా కోడలు ఎన్ని రోజులని ఎదురుచూస్తుందని అంటుంది. కార్తీక్ అసహనంగా మాట్లాడతాడు. శౌర్య అన్నట్టు ఇంత కుటుంబం ఉంటే ఎంత బాగుంటుందో కదాని దీప మనసులో అనుకుంటుంది.
అందరూ ఉగాది పచ్చడి చేసి తీసుకొస్తారు. వాటిలో ఏడి ఉత్తమ ఉగాది పచ్చడి అనేది జడ్జిగా తీర్పు ఇవ్వమని శివనారాయణ అంటాడు. వద్దు మీరే ఇవ్వండి అంటే నేను కోడలు పక్షపాతిని నా తీర్పు కొంతమందికి నచ్చకపోవచ్చని చెప్తాడు. అందుకే అందరివీ టేస్ట్ చేసి ఏది బెస్ట్ అనేది చెప్పమని అంటాడు.
క్షమించనని తెగేసి చెప్పిన దీప
దీప అందరూ చేసిన ఉగాది పచ్చడి రుచి చూస్తుంది. కార్తీక్ వాళ్ళు చేసిన ఉగాది పచ్చని తిని చేదుగా ఉందని చెప్తుంది. వేప పువ్వు ఎక్కువ వేశావని కాంచన తిడుతుంది. తొందరపడ్డాను క్షమించండి అంటాడు కని దీప మాత్రం కోపంగా పట్టించుకోదు. ఎవరూ ఉగాది పచ్చడి సరిగా చేయలేదు. అందరూ తినేలా అచ్చమైన ఉగాది పచ్చడి నీ చేతులతో చేయమని శివనారాయణ అడుగుతాడు.
పంచాంగ శ్రవణం చదువుతానని పంతులు చెప్తాడు. దీప ఉగాది పచ్చడి చేసి తీసుకొస్తానని వెళ్ళిపోతుంది. దీప కిచెన్ లో ఉంటే కార్తీక్ తనవైపే చూస్తూ ఉంటాడు. దీప పచ్చడి చేసి తీసుకొచ్చి అందరికీ ఇస్తుంది కానీ కార్తీక్ వైపు కోపంగా చూస్తూ అతనికి కూడా ఇస్తుంది. క్షమించారని అనుకోవచ్చా అని అడుగుతాడు. అది ఈ జన్మలో జరగదని దీప చాలా కోపంగా చూస్తుంది.
గెలిచిన దీప
ఉగాది పచ్చడి చాలా బాగా చేశావని దీపని అందరూ మెచ్చుకుంటారు. ప్రతి ఉగాదికి దీపను మన ఇంటికి పిలుద్దాం తను రాకపోతే మనమే వాళ్ళ ఇంటికి వెళ్దామని దశరథ వాళ్ళు అంటారు. పచ్చడి సూపర్ గా ఉందని ఏకగ్రీవంగా ప్రకటించారు కాబట్టి ఈ ఏడాది పోటీలో దీపని విజేతగా శివనారాయణ ప్రకటిస్తాడు.
శివనారాయణ బంగారు చైన్ ఇస్తుంటే ఇలాంటివి వద్దని అంటుంది. సరేలే నీకు ఇవ్వనని చెప్పి శౌర్య మెడలో గొలుసు వేస్తారు. దీప నీ రాశి ఏంటమ్మా అని శివనారాయణ అడుగుతాడు. ఇవేవీ తనకు తెలియదని ఇలాంటివి తన తండ్రి ఎప్పుడు చెప్పలేదని దీప అంటుంది.
ఎప్పుడు పుట్టావో చెప్పాడా అని పారిజాతం పుల్లవిరుపుగా మాట్లాడుతుంది. దీపకు అమ్మానాన్న లేరని సుమిత్ర చెప్తుంది. జ్యోత్స్న రాశిఫలం ఎలా ఉందో చెప్పమని అడుగుతాడు. మీకు ఈ సంవత్సరం బాగోలేదని అనేసరికి సుమిత్ర వాళ్ళు బాధపడతారు.
జ్యోత్స్న జాతకంలో దోషాలు
మీ జీవితంలో అనుకోని మనుషుల పరిచయాల వల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతాయని అంటాడు. ముందు పెళ్లి గురించి చూడమని పారు అడుగుతుంది. అమ్మాయికి ఈ సంవత్సరం పెళ్లి కష్టమేనని అనేసరికి అందరూ షాక్ అవుతారు. చిన్న చిన్న దోషాలు ఉన్నాయని పూజలు చేయాలని పంతులు చెప్తాడు.
కార్తీక్ పెళ్లి చేసుకొనని అంటున్నాడు దీనికేమో ఈ ఏడాది పెళ్లి యోగం లేదని అంటున్నారని పారిజాతం టెన్షన్ పడుతుంది. కార్తీక్ కి ఎలా ఉందో చూడమని కాంచన పంతుల్ని అడుగుతుంది. దీనికి ఈ సంవత్సరం పెళ్లి యోగం లేదని అంటే వాడికి ఎలా ఉంటుందని పారిజాతం అనేసరికి కార్తీక్ తనవైపు కోపంగా చూస్తాడు.
పంతులు కార్తీక్ రాశి ఫలాలు చదువుతాడు. మంచికి వెళ్తే చెడు ఎదురైనట్టు చేయాలనుకున్న మంచి వల్ల అవమానాలు ఎదురవుతాయని పంతులు చెప్తాడు. కార్తీక్ యాక్సిడెంట్ గుర్తు చేసుకుని చేసింది చెడ్డ పని అయితే అవమానాలు కాక ఇంకేం ఎదురవుతాయని బాధపడతాడు.
టాపిక్