Karthika deepam 2 serial: కార్తీకదీపం 2.. దీప మీద కన్నేసిన నరసింహ.. అసలు మనవరాలితో తాతయ్య అని పిలిపించుకున్న శివనారాయణ
Karthika deepam 2 serial april 12th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీప కార్తీక్ మధ్య ఏదో సంబంధం ఉందని నరసింహ తప్పుగా అర్థం చేసుకుంటాడు. తనని ఎలాగైనా మనశ్శాంతిగా ఉండకుండా చేయాలని డిసైడ్ అవుతాడు.
Karthika deepam 2 serial april 12th episode: నరసింహ మందు తాగుతూ దీప, కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. శోభ వచ్చి ఏమైందని అడుగుతుంది. నరసింహ ఫేస్ ఫీలింగ్ చూసి అది కనపడిందా అని అంటుంది. నువ్వు తెలివైన దానివి దీప. పండగకు కూడా పాత మొగుడేనా అనే సామెత నిజం చేశావని తప్పుగా అర్థం చేసుకుంటాడు.
కార్తీక్ ని పొగిడిన జ్యోత్స్న
శివనారాయణ ఇంట్లో ఉగాది సంబరాలు మొదలవుతాయి. కార్తీక్ ని చూసి జ్యోత్స్న చాలా అందంగా ఉన్నావని పొగుడుతుంది. ఎంగేజ్ మెంట్ చేసుకుని పెళ్లి చేసుకోవచ్చా, లేదంటే డైరెక్ట్ గా పెళ్లి చేసుకోవచ్చా అని అడుగుతుంది. డైరెక్ట్ గా పెళ్లి చేసుకోవచ్చని కార్తీక్ అనేసరికి వాళ్ళ నాన్న విని కాస్త స్పీడ్ తగ్గించండి అంటాడు.
నా మనసులో ఏముందో ఎవరికి తెలియదు. ఎవడి స్క్రీన్ ప్లే వాడు రాసేసుకుంటున్నాడు. అసలు ఇంతవరకు నిజం చెప్పకుండా పారు ఏం చేస్తుందని తిట్టుకుంటాడు. ఉగాది పండుగ శుభాకాంక్షలు చెప్తాడు. అంతేనా అని సుమిత్ర అడుగుతుంది. ఇంకేం కావాలని అంటాడు.
దీప కొత్త బట్టలు చూసి ఇవి చూస్తే ఖరీదుగా ఉన్నాయి. ఇతను కావాలని రేటు తగ్గించి ఇచ్చాడా ఏంటని డౌట్ పడుతుంది. సుమిత్ర, జ్యోత్స్న కొత్త బట్టలు తీసుకొచ్చి దీప వాళ్ళకు ఇస్తారు. శౌర్య సుమిత్ర ఇచ్చిన బట్టలు చూసి మనం కొన్న వాటి కంటే అమ్మమ్మ ఇచ్చినవి చాలా బాగున్నాయని అంటుంది. త్వరగా శౌర్యని తీసుకుని పూజకు రమ్మని చెప్తుంది.
దీపను మనశ్శాంతిగా బతకనివ్వను
సుమిత్ర వైపు దీప ప్రేమగా చూస్తుంది. ఉగాది అయిపోయిన వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని దీప మనసులో అనుకుంటుంది. దీపను వదిలించుకోకపోతే ఊరుకునేది లేదని నరసింహని శోభ తిడుతుంది. నువ్వు అర్థం కావడం లేదు దీప నువ్వు నిజంగా నాకోసమే సిటీకి వచ్చావా? లేదంటే వేరే వాళ్ళ కోసం వస్తే అనుకోకుండా నేను తగిలానా? అనుకుంటాడు.
నిన్ను కారులో తెచ్చింది ఎవడో తెలుసుకోవాలని అనుకున్నాను కుదరలేదు. అసలు ఎవడు వాడు? వాడితో నువ్వు ఎందుకు ఉన్నావ్. నువ్వు నాకంటే ఏదో పెద్ద కథ నడుపుతున్నావ్. ఇక నుంచి నాకు నిన్ను వెంటాడమే పని. నిన్ను అయితే మనశ్శాంతిగా బతకనివ్వనని అనుకుంటాడు.
మనవరాలితో తాతయ్య అనిపించుకున్న శివనారాయణ
శౌర్య కొత్త బట్టలు వేసుకుని వచ్చి అమ్మమ్మ ఎలా ఉన్నాయి నువ్వు ఇచ్చిన బట్టలు అని అంటుంది. చాలా అందంగా ఉన్నావని మెచ్చుకుంటుంది. పెదింటి అమ్మాయి అయినా ఎందుకో చూస్తే గొప్పింటి బిడ్డలా కనిపిస్తున్నావని శివనారాయణ మనసులో అనుకుంటాడు.
శౌర్య కార్తీక్ దగ్గరకు వెళ్ళి నా డ్రెస్ ఎలా ఉంది కార్తీక్ అంటుంది. అందరూ ఆశ్చర్యపోతారు. అలా పిలవమని నేనే చెప్పానని అంటాడు. ఇది పెద్ద రౌడీ నేను తనని రౌడీ అని పిలుస్తాను తను నన్ను కార్తీక్ అని పిలుస్తుందని చెప్తాడు. పైకి కనిపించనివ్వడం లేదు కానీ నువ్వు ఇక్కడ ఎంత ఇబ్బందిగా ఉంటున్నావో తనకు తెలుసని కార్తీక్ అనుకుంటాడు.
దీప శివనారాయణని పెద్దయ్యగారు అంటే అలా పిలవ్వద్దు తాత అని పిలవమని చెప్తాడు. అలా పిలవలేనని అంటే నా కొడుకుతో చెప్పి నిన్ను దత్తత తీసుకుని అయినా సరే తాతయ్య అని పిలిపించుకుంటానని అంటాడు. చేసేది లేక తాతయ్య గారు అని పిలుస్తుంది. అందరూ సంతోషిస్తారు.
ఉగాది పచ్చడి పోటీ
సుమిత్ర కుటుంబ సభ్యులందరూ దీప వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటాడు. దీప కుబేర యాక్సిడెంట్ గురించి తలుచుకుంటుంది. మీ తాతయ్యను దూరం చేసిన మనిషి ఇక్కడే ఉన్నాడని కార్తీక్ వైపు కోపంగా చూస్తుంది. ఇక ఇంట్లో పోటీ మొదలవుతుందని దానికి దీప జడ్జిగా ఉండాలని అంటాడు. ఏం పోటీ అంటే ఉగాది పచ్చడి ఎవరు బాగా చేస్తారో వాళ్ళకు బహుమతి ఇస్తానని శివనారాయణ అంటాడు.
మొదట్లో ఏదో అనుకున్నాను కానీ వీళ్లందరూ నిజంగానే నామీద ప్రేమ చూపిస్తున్నారు. ఈ పెద్దావిడ, కార్తీక్ తప్ప అందరూ మంచివాళ్లేనని దీప అనుకుంటుంది. అందరూ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తారు.
టాపిక్