Solo Boy: సోలో బాయ్‌గా వస్తున్న బిగ్ బాస్ డాక్టర్ బాబు.. గ్రాండ్‌గా గౌతమ్ కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్-bigg boss gautham krishna birthday celebrations by solo boy movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Solo Boy: సోలో బాయ్‌గా వస్తున్న బిగ్ బాస్ డాక్టర్ బాబు.. గ్రాండ్‌గా గౌతమ్ కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్

Solo Boy: సోలో బాయ్‌గా వస్తున్న బిగ్ బాస్ డాక్టర్ బాబు.. గ్రాండ్‌గా గౌతమ్ కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్

Sanjiv Kumar HT Telugu
Apr 15, 2024 12:24 PM IST

Bigg Boss Gautham Krishna Solo Boy: బిగ్ బాస్ 7 తెలుగు ద్వారా చాలా పాపులర్ అయ్యాడు గౌతమ్ కృష్ణ. ఈ సీజన్‌లో డాక్టర్ బాబుగా పేరు తెచ్చుకున్న గౌతమ్ కృష్ణ నటిస్తున్న సినిమా సోలో బాయ్. తాజాగా ఈ మూవీ టీమ్ గౌతమ్ కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించింది.

సోలో బాయ్‌గా వస్తున్న బిగ్ బాస్ డాక్టర్ బాబు.. గ్రాండ్‌గా గౌతమ్ కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్
సోలో బాయ్‌గా వస్తున్న బిగ్ బాస్ డాక్టర్ బాబు.. గ్రాండ్‌గా గౌతమ్ కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్

Bigg Boss Gautham Krishna Birthday: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో చాలా పాపులారిటీ సంపాదించుకున్న వాళ్లలో గౌతమ్ కృష్ణ ఒకరు. డాక్టర్ అండ్ మోడల్‌గా హౌజ్‌లోకి అడుగుపెట్టిన గౌతమ్ కృష్ణ ఎక్కువగా డాక్టర్ బాబు పేరుతో వైరల్ అయ్యాడు. అయితే గౌతమ్ కృష్ణ హీరోగా వస్తున్న సినిమా సోలో బాయ్. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్‌పై సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ నిర్మాతగా పి. నవీన్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇటీవలే సోలో బాయ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. జుడా షాండి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఆట సందీప్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 13న గౌతమ్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈవెంట్‌లో హీరో గౌతమ్ కృష్ణ, హీరో ఫాదర్ మనోజ్, సెవెన్ హిల్స్ సతీష్, డైరెక్టర్ నవీన్ కుమార్, అనిత చౌదరి, కమెడియన్ భద్రం, పింగ్ పాంగ్ (సూర్య) పాల్గొన్నారు.

"నా పుట్టినరోజు పూట మూవీ టీం ఇలా ఈవెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలా నాకు ఒక టీం ఉంది నవీన్ అనే ఒక కొత్త డైరెక్టర్ ఉన్నాడు అనగానే కథ విని సింగిల్ సిట్టింగ్‌లో కథను ఓకే చేశారు సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ అన్న. ఈ టీమ్ అందరూ కూడా సినిమా మీద ఇష్టంతో పని చేసినవారే. బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కంటెంట్‌‌ని తీసుకొస్తున్నాం" అని హీరో గౌతమ్ కృష్ణ తెలిపాడు.

"అదేవిధంగా అనితా చౌదరి గారు, పోసాని కృష్ణ మురళి గారు ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోడానికి కారణం మంచి కంటెంట్. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. నా ఫస్ట్ సినిమా నుంచి, బిగ్ బాస్ జర్నీ నుంచి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అతి త్వరలో టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో మీ ముందుకు వస్తాం. ప్రేక్షకులు అందరూ ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను" అని బిగ్ బాస్ గౌతమ్ చెప్పాడు.

కాగా సోలో బాయ్ సినిమాలో గౌతమ్ కృష్ణకు జోడీగా శ్వేతా అవస్థి హీరోయిన్‌గా చేస్తోంది. వీరితోపాటు రమ్య పసుపులేటి, పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రమ్, ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజినీ వర్మ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

"నాకు ఈ అవకాశాన్నిచ్చిన సెవెన్ హిల్స్ సతీష్ గారికి రుణపడి ఉంటాను. ముందుగా గౌతమ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిన్న సినిమా పెద్ద సినిమాను ఉండదు. మంచి సినిమా నే ఉంటుంది. సోలో బాయ్ కూడా ఒక మంచి సినిమా. ఈ సినిమాలో నటించిన పోసాని కృష్ణ మురళి గారు, అనిత చౌదరి గారు, భద్రం గారు, సూర్య గారు చాలా బాగా నటించారు" అని డైరెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు.

"మా హీరో గౌతమ్ కృష్ణ చాలా బాగా నటించాడు. సాంగ్స్ ఫైట్స్ ఎమోషనల్ సీన్స్ అన్నిటిలోనూ తనదైన శైలితో నటించాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని దర్శకుడు పి. నవీన్ కుమార్ చెప్పుకొచ్చారు.

IPL_Entry_Point