Jupiter nakshatra transit: శ్రీరామనవమి రోజు నక్షత్రం మారిన బృహస్పతి.. ఈ రాశుల వారికి ఇక రోజూ పండగే
Jupiter nakshatra transit: దేవగురువు బృహస్పతి శ్రీరామనవమి రోజు నక్షత్రాన్ని మార్చుకున్నాడు. భరణి నక్షత్రం నుంచి కృతిక నక్షత్రంలోకి ప్రవేశించాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి ఇక రోజూ పండగే.
Jupiter nakshatra transit: ఏదైనా ఒక గ్రహం ఫలితాలను అంచనా వేయడానికి అవసరమైన సాధనం నక్షత్రం. దేవ గురువుగా భావించే బృహస్పతి ఏప్రిల్ 17 శ్రీరామనవమి రోజున నక్షత్రాన్ని మార్చుకున్నాడు. కృతిక నక్షత్రంలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది. భరణి నక్షత్రం నుంచి బృహస్పతి కృతిక నక్షత్రంలోకి ప్రవేశించాడు.
వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం కృతిక నక్షత్రం వృషభం, మేష రాశి చక్రాలలో వస్తుంది. దీన్ని అగ్ని, శక్తికి మూలంగా పరిగణిస్తారు. కృత్తిక అంటే కట్టేవాడు అని అర్థం. ఒక పదునైన వస్తువుతో పోలుస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్లు ఆవేశపూరితంగా, దూకుడుగా ప్రవర్తిస్తారు. కానీ మంచి స్వభావం కలిగి ఉంటారు. ఈ నక్షత్రం సృజనాత్మకంగా, విధ్వంసకరంగా ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
కృతిక నక్షత్ర ప్రభావం
కృతిక నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు చాలా తెలివిగా ఉంటారు. కానీ కొన్ని సమయాల్లో తమ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన సహనాన్ని కోల్పోతారు. పట్టుదల అవసరం. గొప్ప సలహాదారులుగా ఉపయోగపడతారు. మంచి స్నేహితులను కలిగి ఉంటారు. కృతిక నక్షత్రంలో జన్మించిన వారి జాతకంలో బృహస్పతి ప్రభావం ఉంటే అటువంటి వ్యక్తులు డబ్బు సంపాదించడానికి అసాధారణమైన సామర్ధ్యాన్ని కలిగి ఉంటారు. బృహస్పతి సంచారం వల్ల మూడు రాశుల వాళ్ళు ప్రయోజనం పొందబోతున్నారు.
మేష రాశి
సూర్యుడు కృతిక నక్షత్రానికి అధిపతి. బృహస్పతి ఈ నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల సూర్యుడితో కలవనున్నాడు. ఫలితంగా వ్యాపారం, ప్రైవేట్ రంగంలో కెరీర్ వృద్ధిని ఆశించే వ్యక్తులు అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇది మంచి కాలం. ఈ సమయంలో ప్రమోషన్లు కూడా సాధ్యమే. ఆర్థిక లాభాలతో ఆశీర్వదింపబడతారు. ప్రేమ సంబంధిత విషయాలలో అదృష్టం వారి వైపే ఉంటుంది. బృహస్పతి మేష రాశి ఐదో ఇంట్లో సంచరించడం వల్ల చదువులో రాణిస్తారు.
మిథున రాశి
బృహస్పతి నక్షత్ర మార్పు మిథున రాశి వారికి కలిసొస్తుంది. మిథున రాశి 7, 10 గృహాలకు బృహస్పతి అధిపతి. కృత్తిక నక్షత్రంలోకి సంచరించడం వల్ల ఈ సమయంలో వివాహం చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో బంధం బలపడుతుంది. సామాజిక స్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక స్థితి త్వరగా బలపడుతుంది. వ్యాపారస్తులకు ఇది మంచి సమయం.
కర్కాటక రాశి
బృహస్పతి నక్షత్ర మార్పు కర్కాటక రాశి వారికి ఆశించిన ఫలితాలు ఇస్తుంది. ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న వారికి అద్భుత విజయాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తులకు ప్రయోజనాలు ఉంటాయి. రాజకీయ రంగంలో మీ ప్రతిభని గుర్తిస్తారు. ఉద్యోగస్తులకు పని వాతావరణం సానుకూలంగా ఉంటుంది. వ్యాపారానికి చాలా మంచి సమయం. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఆకస్మిక పెరుగుదల కనిపిస్తుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి బృహస్పతి నక్షత్రం మార్పు ఊహించని లాభాలను ఇస్తుంది. వ్యాపారాన్ని కొత్త స్థానానికి తీసుకెళ్లగలుగుతారు. ఈ రాశికి సూర్యుడు అధిపతి కావడం వల్ల ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ సమయంలో మరిన్ని అవకాశాలు వస్తాయి. వ్యాపార పర్యటనలు ఫలవంతంగా ఉంటాయి.
వృషభం, కన్య, తుల, ధనుస్సు, మకరం, మీన రాశుల వారికి బృహస్పతి కృతిక నక్షత్రంలోకి సంచరించడం అంతగా మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అందువల్ల ఈ రాశుల వాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడతారు.